Jabardasth Nukaraju: ఆసియాకు బ్రేకప్ చెప్పేసిన నూకరాజు.. నీలో అదే నచ్చలేదంటూ.. ఫోన్ కాల్ వైరల్!
తెలుగు బుల్లితెరపై కనిపిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కడుపుబ్బా నవ్వించే కమెడియన్ల గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్న కమెడియన్ల గురించి అయితే మరింత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ షో ద్వారానే విపరీతమైన పాపులారిటీ సంపాధించుకున్న వాళ్లలో ఒకరే నూకరాజు. అయితే గతంలో పటాస్ షో చేస్తుండగా.. ఆసియాతో లవ్ ట్రాక్ కూడా నడిపాడు.
ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆసియా షోనుంచి వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి నూకరాజు ఒక్కడే షోలు చేస్తూ వస్తున్నాడు. కానీ యూట్యూబ్ వేదికగా ఆసియాతో ఓ ఛానెల్ పెట్టించి మరీ చాలా సపోర్ట్ చేస్తున్నాడు నూకరాజు. ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తేలిపోయింది. ముఖ్యంగా దీన్ని వీరిద్దరూ అఫీషియల్ గా కూడా ప్రకటించేశారు. అయితే తాజాగా నూకరాజు ఆసియాకు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు పటాస్ షోలో కనిపించి విపరీతమైన కామెడీ చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఈయన ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా తన అద్భుతమైన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఇప్పటికీ సూపర్ కామెడీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రచ్చ చేస్తున్న ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడే అతను తన ప్రేమికురాలు అయిన ఆసియాకు బ్రేకప్ చెప్పాడు.
ముఖ్యంగా పంచ్ ప్రసాద్ తో కలిసి.. బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ శోబాశెట్టి యాంకర్ గా చేస్తున్న కాఫీ విత్ శోభాశెట్టి ప్రోగ్రాంకు వచ్చాడు నూకరాజు. ఇక్కడే తన ప్రియురాలు అయిన ఆసియాకు ఫోన్ చేశాడు. నువ్వు నాకు నచ్చలేదు.. నేను నీకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నాను అని వివరించాడు. ఆమె మాత్రం ఏమైందిరా.. ఎందుకిలా మాట్లాడుతున్నావు, నేనేం తప్పు చేశానో చెప్పు అంటూ కన్నీరు పెట్టుకుంది.

నీకు నచ్చకపోయినా ఓకే కానీ బ్రేకప్ చెప్పడానికి రీజన్ ఏంటో చెప్పు చాలంటూ తీవ్ర ఆవేదననను వ్యక్తం చేసింది. ఆ తర్వాత పక్కనే ఉన్న పంచ్ ప్రసాద్ మాట్లాడగా.. ఆమెకు ఇదంతా ప్రాంక్ అని అర్థం అయింది. ఎక్కుడున్నావు, ఇదంతా ప్రాంక్ అని తెలుస్తుందిలే.. ఏ షోలో ఉన్నావో చెప్పంటూ అడిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నూకరాజు మనసు తెలిసిన ఈ ముద్దుగుమ్మ అతడి ప్రేమను పొందేందుకు అసలైన అర్హురాలని.. వీరిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు చాలా మంది.


Click it and Unblock the Notifications











