ప్రియుడికి జబర్ధస్త్ బ్యూటీ బ్రేకప్.. దానికి ఒప్పుకోకపోవడం వల్లే అంటూ!
తెలుగు బుల్లితెరపై గతంలో కంటే ఈ మధ్య కాలంలోనే అమ్మాయిలు ఎక్కువగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే కమెడియన్లుగా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం పవిత్ర ఒకరు.
అద్భుతమైన టాలెంట్లతో అదరగొడుతోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అలాగే, సంతోష్ అనే కుర్రాడితో ప్రేమను కూడా నడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడికి పవిత్ర బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

టిక్ టాక్ నుంచి జబర్ధస్త్: పవిత్ర ముందుగా టిక్ టాక్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ చిన్నది జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టింది. అందులో తనదైన కామెడీతో అలరించిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతోన్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగమైంది. తద్వారా కెరీర్‌ను జబర్ధస్త్‌గా నడుపుతోంది.

సెలెబ్రిటీ.. ఫుల్ ఆఫర్లతో: జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవిత్ర యమ ఫేమస్ అయింది. దీంతో బిగ్ సెలెబ్రిటీగానూ మారిపోయింది. అదే సమయంలో ఆమెకు ఎన్నో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఫలితంగా జబర్ధస్త్‌కు కాస్త విరామం ప్రకటించి వేరే షోలు, సినిమాల్లోనూ అవకాశాలను అందుకుంటోంది. ఇలా కొంత కాలంగా జబర్ధస్త్ పవిత్ర చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగానే గడుపుతోంది.

అతడితో ప్రేమాయణం: కెరీర్ పరంగా దూసుకుపోతోన్న జబర్ధస్త్ పవిత్ర.. సంతోష్ అనే కుర్రాడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు అతడితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ 'నా జీవితంలో ఓ స్పెషల్ థింగ్ గురించి చెప్పబోతున్నాను. నేను సంతోష్ అనే అబ్బాయి ప్రేమను యాక్సెప్ట్ చేశాను' అంటూ సుదీర్ఘమైన పోస్టునే చేసింది.
పెళ్లి కూడా చేసేశారుగా: జబర్ధస్త్ బ్యూటీ పవిత్ర తన ప్రియుడి గురించి సోషల్ మీడియాలోనే కాకుండా ఓ చానెల్‌లోనూ ప్రస్తావన తెచ్చింది. ఆ తర్వాత ఓ షోలో భాగంగా అతడిని పిలిపించి సందడి చేశారు. అంతేకాదు, వీళ్లిద్దరికీ సదరు షోలో పెళ్లి కూడా జరిపించారు. దీంతో చాలా మందికి పవిత్ర ప్రేమ గురించి తెలిసిపోయింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి పెళ్లిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

బ్రేకప్ చెప్పిన బ్యూటీ: వాలెంటైన్స్ డేన పవిత్ర ఇన్‌స్టాలో 'నా శ్రేయోభిలాషులు అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. పరస్పర అంగీకారంతో నేను, సంతోష్ బ్రేకప్ చెప్పుకున్నాం. మా దారులు వేరైనా ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం అలానే ఉంటుంది. మా ఇద్దరి జర్నీలకి ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నాం. ఈ కష్ట సమయంలో మా శ్రేయోభిలాషులు అర్థం చేసుకొని మాకు ప్రైవసీ ఇవ్వండి' అని చెప్పింది.
అందుకే బ్రేకప్ అంటూ: ప్రియుడికి జబర్ధస్త్ పవిత్ర బ్రేకప్ చెప్పడంతో అసలు ఇలా ఎందుకు జరిగింది అని చాలా మంది చర్చించుకుంటున్నారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. వివాహం తర్వాత ఇండస్ట్రీలో కొనసాగడానికి ప్రియుడు ఒప్పుకోలేదట. అందుకే పవిత్ర అతడికి బ్రేకప్ చెప్పేసిందని అంటున్నారు. దీంతో ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











