Pavithra: మా నాన్న చనిపోతే చాలా సంతోషించా.. చిన్నప్పుడే అలా.. లేడి కమెడియన్ షాకింగ్ కామెంట్స్!
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వినోదాన్ని పంచుతూ తెలుగు ప్రేక్షకులకు అలవాటుగా మారిపోయింది. ఇక ఈ షో ద్వారా మోస్ట్ పాపులర్ అయినవాళ్లలో ఎంతోమంది ఉన్నారు. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ ద్వారా వివిధ షోలలో, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ సినీ రంగంలో తమ కెరీర్ ను పదిలం చేసుకుంటున్నారు. జబర్దస్త్ షోలో లేడి కమెడియన్స్ కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల లేడి కమెడియన్స్ గల రోహిణి టీమ్ బాగా ఆకట్టుకుంటోంది. అందులో తన కామెడీతో నవ్విస్తోంది పవిత్ర. ఎంతోమందిని నవ్వించే ఆమె జీవితంలో కష్టాల కడలి నిండి ఉంది. అయితే వాళ్ల నాన్న చనిపోతే చాలా సంతోషించాను అని చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఎంట్రీ మాత్రమే కాకుండా..
తెలుగులో లేడి కమెడియన్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మొన్నటివరకు అయితే సినిమాల్లో ఎక్కువగా కోవై సరళ పేరు వినిపించేది. ఇప్పుడు బుల్లితెరపై మాత్రం అనేకమంది లేడి కమెడిన్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా అనేకమంది లేడి కమెడిన్స్ పరిచయం అవుతున్నారు. కేవలం ఎంట్రీ ఇవ్వడం కాకుండానే తమ కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

వాళ్ల జాబితాలోకి పవిత్ర..
జబర్దస్త్ ద్వారా ఇప్పటికీ ఎంతోమంది కమెడియన్స్ లైమ్ లైట్ లోకి వచ్చారు. కొంతమంది అయితే సినిమా హీరోలు కూడా అయ్యారు. మరికొంతమంది నిర్మాతలు, రైటర్స్, డైరెక్టర్స్ గా మారారు. ఇలా జబర్దస్త్ నుంచి లేడి కమెడియన్స్ గా రోహిణి, ఫైమా బాగా పాపులర్ అయ్యారు. వివిధ షోలలో తమదైన కామెడీతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు వీరి జాబితాలోకి పవిత్ర కూడా వచ్చేసింది. తన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ లతో అలరించే ప్రయత్నం చేస్తోంది.

తండ్రి లారీ డ్రైవర్..
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పవిత్ర జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయింది. ఈ షోలో మంచి లేడి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న పవిత్ర ప్రస్తుతం ఈవెంట్స్, షోలు అంటూ ఖాలీ లేకుండా బిజీగా మారింది. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో పడిన కష్టాలు చెప్పుకొచ్చింది పవిత్ర. తనది నిరుపేద కుటుంబం అని, తండ్రి లారీ డ్రైవర్ గా పనిచేసేవాడని తెలిపింది పవిత్ర.

తిండి లేకున్నా తాగుడు కోసం..
"మాది రెక్కాడితో గానీ డొక్కాడని కుటుంబం. నాన్న లారీ డ్రైవర్. కానీ పచ్చి తాగుబోతు. తాగుడుకు బానిస అయి ఇంటిని పట్టించుకునేవాడు కాదు. ఒక్కోసారి తాగేసి ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. భార్యా పిల్లలను గాలికి వదిలేస్తే.. మా అమ్మే కూలిపని చేసి పెంచింది. అసలు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. పిల్లలకు తిండి లేకున్నా మా నాన్న తన తాగుడు కోసమే చూసుకునేవాడు. అందుకే అతనితో 13 ఏళ్లు మాట్లాడలేదు. తండ్రి ప్రేమకు చిన్నప్పుడే దూరమయ్యాను" అని పవిత్ర ఎమోషనల్ అయింది.

ఈ మధ్యే చనిపోయారని తెలిసింది..
"పిన్ని సాయంతో ఇంటర్ వరకు చదువుకున్నా. ఆ తర్వాత చదువు మానేసి మా అమ్మకు సహాయంగా ఉన్నాను. కాలేజీలో ఉన్నప్పుడు నా జోక్స్ కు స్నేహితులు పడిపడి నవ్వేవారు. కామెడీ షోలు చూస్తూనే నేను కామేడీ చేయడం నేర్చుకున్నాను. మాకు సొంత ఇల్లు కూడా లేదు. కాలేజ్ తర్వాత హైదరాబాద్ లో ఒక సెలూన్ పెట్టా. కానీ అది ఫ్లాప్ అయింది. ఇక ఈ మధ్యనే నాన్నగారు చనిపోయారని తెలిసి చాలా సంతోషించానే తప్పా ఏమాత్రం బాధపడలేదు. ఆయన వల్లే నేను, మా అమ్మా ఇలా అయ్యాం. ఆయన బాగుండి ఉంటే.. మేము ఇంకో స్థాయిలో ఉండేవాళ్లం" అని చెప్పుకొచ్చింది పవిత్ర.

ఫైమా వెళ్లిపోడంతో..
ఇదిలా ఉంటే సెలూన్ లో పని చేస్తూ టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయింది పవిత్ర. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించిన పవిత్రకు జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. బుల్లెట్ భాస్కర్, రాకేట్ రాఘవ, హైపర్ ఆది, మంకీ వెంకీ టీమ్స్ లో తనదైన కామెడీతో ఆకట్టుకుంది. ఇక ఫైమా జబర్దస్త్ నుంచి బయటకు రావడం వల్ల.. పవిత్రకు కలిసివచ్చిందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











