లేడీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కోరిక తీర్చమన్నారు: జబర్దస్త్ ఫణి సంచలనం!

By Bojja Kumar

Recommended Video

Jabardasth Phani Revealed Shocking Facts About A Female Director

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని దూసుకెళుతున్న యాక్టర్లలో జబర్దస్త్ ఫిణి ఒకరు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.

ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలైంది

ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలైంది

తాను ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలైందని, కేవలం జబర్దస్త్ వల్లనే తన కెరీర్ టర్న్ అయిందని, అదే తన కెరీర్లో పెద్ద మైల్ స్టోన్ అని ఫని తెలిపారు. జబర్దస్త్ లేక పోతే తాను లేను అని స్పష్టం చేశారు.

ఇండస్ట్రీలో పరిస్థితి మారింది

ఇండస్ట్రీలో పరిస్థితి మారింది

ఒకప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్ చూసేవారు. ఏదైనా పాత్ర ఉంటే పలానా యాక్టరే కావాలని తీసుకునేవారు. కానీ ఇపుడు అలా లేదు. పది వేలకు, ఐదు వేలకు యాక్టర్లు వస్తారా? అని చూస్తున్నారు. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది అని ఫణి తెలిపారు.

నేను బయటకు రావడానికి వారు కారణం కాదు

నేను బయటకు రావడానికి వారు కారణం కాదు

జబర్దస్త్ నుండి ఎందుకు బయటకు వచ్చారు? అనే ప్రశ్నకు సమాధానం నా వద్ద కూడా లేదు. కారణం ఏమిటో నాకు కూడా ఇప్పటి వరకు తెలియలేదు. నేను బయకు రావడానికి అభి, ఆది కారణం అనే ప్రచారంలో నిజం లేదని ఫణి తెలిపారు. వారిద్దరూ తనకు మంచి స్నేహితులు అని తెలిపారు.

హైపర్ ఆది తొక్కేయలేదు, తమ్ముడు లాంటోడు

హైపర్ ఆది తొక్కేయలేదు, తమ్ముడు లాంటోడు

ఎక్కడో ఉన్న ఆదిని... అభి, ఫణి జబర్దస్త్‌లోకి తీసుకొస్తే అతడు ఆ ఇద్దరినీ తొక్కేసి బయటకు పంపించారని కొందరు అనడం విన్నాను. కానీ అదంతా నిజం కాదు. ఆది మాకు తమ్ముడు లాంటోడు. వాడిలో టాలెంటు ఉంది కాబట్టే ఈ స్థాయికి వచ్చాడు అని ఫణి తెలిపారు.

వల్గర్ అనిపిస్తే చూడకండి

వల్గర్ అనిపిస్తే చూడకండి

జబర్దస్త్ కామెడీ షోలో వల్గారిటీ ఎక్కువయిందనే విమర్శలపై మాట్లాడుతూ.... ఈ షో చూడాలని ఎవరూ ఎవరినీ బలవంత పెట్టడం లేదు. అందరికీ ఈ షో నచ్చింది కాబట్టే ఇంత పెద్ద హిట్టయింది. ఇష్టం లేని వారు ఈ షో చూడటం మానేయండి, టీవీ రిమోట్లో వేరే ఛానల్ పెట్టుకుని చూడండి అంటూ ఫణి ఉచిత సలహా ఇచ్చారు.

ఆ లేడీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోరిక తీర్చమన్నారు

ఆ లేడీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోరిక తీర్చమన్నారు

నాకు ఓ చిన్న సినిమాలో అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి లేడీ ప్రొడ్యూసర్, లేడీ డైరెక్టర్. వాళ్లు అంతా ఒకేనా? అని అడిగారు...... రెమ్యూనరేషన్ ఒకే, డేట్స్ ఓకే అని చెప్పాను. కమిట్మెంట్ కావాలని అడిగారు. కమిట్మెంట్ అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులను కమిట్మెంట్ అడగటం, వారిని శారీరకంగా వాడుకోవడం గురించి విన్నాను. కానీ మగాళ్లను కూడా ఇలా అడుగుతున్నారని తెలిసి షాకయ్యాను. దీంతో ఆ సినిమాను వదిలేసుకున్నాను. దీన్ని బయటపెడితే నీ సంగతి చెబుతాం అంటూ బెదిరించారు కూడా. ఆ విషయం జరిగి చాలా కాలం అయింది కాబట్టి ఇపుడు బయట పెడుతున్నాను అని ఫని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X