జబర్దస్త్ బ్యూటీ జంప్.. ఇకపై నాగబాబుతో పాటు ఆమె కూడా.. కన్ఫర్మ్ చేస్తూ వీడియో

గత కొన్నివారాలుగా బుల్లితెర పాపులారిటీ షో జబర్దస్త్ రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తోంది. జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లినప్పటి నుంచి ఈ షో గురించిన రకరకాల వార్తలు వింటున్నాం. ఇదిలాఉంటే జబర్దస్త్ తెరపై వినోదాల విందు ఇచ్చిన సాయి తేజ (ప్రియాంక) తాజాగా కెమెరా ముందుకొచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది, వివరాల్లోకి పోతే..

ప్రియాంక (పింకీ)గా మారిన సాయి తేజ

ప్రియాంక (పింకీ)గా మారిన సాయి తేజ

లేడీ గెటప్పులో జబర్దస్త్ తెరపై వినోదాలు పంచిన సాయితేజ.. ఇప్పుడు ప్రియాంకగా మారిపోయిన సంగతి తెలిసిందే. అంటే ఆడవారిగా మారేందుకు గాను సర్జరీ చేయించుకొని పూర్తి ఆడదానిగా అయిపోయాడు సాయి తేజ. గతంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు కూడా. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల పాటు జబర్దస్త్‌కి దూరంగా ఉన్నాడు.

పింకీ రీ ఎంట్రీ.. స్వయంగా ప్రకటన

పింకీ రీ ఎంట్రీ.. స్వయంగా ప్రకటన

పూర్తిగా అమ్మాయిగా మారిన తర్వాత సాయి తేజ (పింకీ) మళ్ళీ బుల్లితెరపై అడుగుపెట్టబోతున్నారు. ఆవిడకు ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయి. దాదాపు ఏడాది పాటు షూటింగ్‌లకు దూరంగా ఉన్న పింకీ.. మళ్లీ తన టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. జబర్దస్త్ బ్యాచ్‌తో స్కిట్స్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా పేర్కొంది.

జబర్దస్త్ షోకు పోటీ.. అందుకే నాగబాబు సహా..

జబర్దస్త్ షోకు పోటీ.. అందుకే నాగబాబు సహా..

ప్రముఖ ఛానెల్ జీ తెలుగులో ఇటీవలే 'అదిరింది' షో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షోలో యాంకర్‌గా రవి, నాగబాబు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కామెడీ షో జబర్దస్త్ షోకు పోటీగా దిగిందని ప్రచారం జరుగుతోంది. అందుకే నాగబాబు సహా జబర్దస్త్ కామెడీలో పనిచేసిన టీమ్ లీడర్స్‌ ఇందులో పాల్గొంటున్నారని టాక్.

చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్

చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్

ఇప్పటికే స్కిట్స్‌కు సంబంధించిన రిహార్సల్స్ కూడా బయటికొచ్చాయి. అందులో నరేష్, నెమలి రాజు, తన్మయ్, కొమరం సహా చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ కనిపించారు. ధన్ రాజ్, వేణు, ఆర్పీ, చంద్ర ఈ నలుగురూ 'అదిరింది' షోలో టీమ్ లీడర్స్‌గా పనిచేస్తున్నారు.

సోషల్ మీడియాలో వీడియో.. కన్ఫర్మ్

సోషల్ మీడియాలో వీడియో.. కన్ఫర్మ్

అయితే వీరితో పాటు తాను కూడా 'అదిరింది' ప్రోగ్రామ్ లో భాగం కాబోతున్నానని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది పింకీ (సాయి తేజ). ఈ మేరకు తన రీ ఎంట్రీ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ అభిమానులను బాగా అలరిస్తానని మాటిచ్చింది పింకీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X