Jabardasth Praveen: ఫైమా లవర్ ఇంట్లో తీవ్ర విషాదం.. స్టేజ్ పైనే ఏడ్చేసిన ప్రవీణ్

జబర్దస్త్ కామెడీ షో ద్వారా అనేక మంది మంచి కమెడియన్స్ తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయిన వ్యక్తులతో స్కిట్ చేయిస్తున్నారు జబర్దస్త్ కమెడియన్స్. ఇక జబర్దస్త్ స్టేజ్ మీద తనదైన కామెడీ డైలాగ్ లతో ఫేమస్ అయ్యాడు ప్రవీణ్. పటాస్ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్.. జబర్దస్త్ షోతో మరింతగా పాపులర్ అయ్యాడు. ప్రవీణ్, లేడీ కమెడియన్ ఫైమా ఇద్దరు లవర్స్ అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ప్రవీణ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ విషయం చెబుతూ ఏకంగా జబర్దస్త్ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రవీణ్.

 వారంతా పటాస్ షో ద్వారానే

వారంతా పటాస్ షో ద్వారానే

కమెడియన్ ప్రవీణ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. జబర్ధస్త్ స్టేజ్ పై మంచి కమెడిన్ గా పేరు తెచ్చుకున్నాడు. తనదైన టైమింగ్ తో, కామెడీ డైలాగ్ లతో ఆద్యంతం ఆకట్టుకుంటున్నాడు ప్రవీణ్. ముందుగా పటాస్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్ జబర్దస్త్ షోతో మరింతగా పేరు తెచ్చుకున్నాడు. ఫైమా, ప్రవీణ్, నూకరాజు, ఆసియా వీరంతా కూడా పటాస్ షోతో వచ్చి ఎక్కువగా ఫేమ్ తెచ్చుకున్నవాళ్లే. అయితే తాజాగా అందరినీ నవ్వించే ప్రవీణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏకంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ పైనే ఏడ్చేశాడు.

చిన్నప్పుడే అమ్మను కోల్పోయాను..

చిన్నప్పుడే అమ్మను కోల్పోయాను..

ఇటీవలే ప్రవీణ్ తండ్రి మరణించాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో స్కిట్ అయన తర్వాత తన తండ్రి మరణం గురించి చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు ప్రవీణ్. ''నా చిన్నప్పుడే మా అమ్మను కోల్పోయాను. ఇప్పుడు నాన్న కూడా చనిపోయాడు. అన్ని తానై పెంచాడు. ఏం ఉన్నా కూడా నాన్నతోనే చెప్పుకునేవాన్ని. ప్రతి రోజూ రాత్రి నాన్నా తిన్నవారా అని అడిగితే గానీ నిద్రపోయే వాడు కాదు. అలాంటి నాన్న ఇప్పుడు లేడు'' అంటూ ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ పై కన్నీరుమున్నీరయ్యాడు. అతని బాధ చూల్లేక ఇంద్రజ వచ్చి ప్రవీణ్ ను ఓదార్చింది. నీకు మేమంతా ఉన్నామని హత్తుకుని భరోసా ఇచ్చింది.

నేను ప్రవీణ్ పక్కనే ఉండాలి..

నేను ప్రవీణ్ పక్కనే ఉండాలి..

కాగా ప్రవీణ్, ఫైమా ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసిందే. వారి ప్రేమ వ్యవహారాన్ని వాళ్లు బాహటంగానే చెప్పారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 షోలో కంటెస్టెంట్ గా పార్టిస్ పేట్ చేస్తోంది ఫైమా. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేముందు ప్రవీణ్ గురించే చెప్పుకొచ్చింది. అసలు ఇప్పుడు నేను ప్రవీణ్ పక్కనే ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ల నాన్న చనిపోయాడు.

ఈ సమయంలో నేను ప్రవీణ్ పక్కనే ఉండాలి. కానీ వాడే నన్ను బిగ్ బాస్ హౌజ్ కు పంపించాడు. ఈ ఆఫర్ రావడం గొప్ప. నువ్ వెళ్లు.. బాగా ఆడు అని నన్ను ఇక్కడికి పంపించాడు అంటూ చెబుతూ స్టేజ్ పై ఎమోషనల్ అయింది ఫైమా. అనంతరం ప్రవీణ్ రాసిన లెటర్ ను స్టైజ్ పై ఫైమాతో చదివించి నవ్వించాడు హోస్ట్ నాగార్జున.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X