Bigg Boss Telugu 5: నీవు హీరోవా? యాటిట్యూడ్ చూపించకు.. లోబో వార్నింగ్.. పోవే పో ఉమ అంటూ ప్రియాంక ఫైర్

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో రెండో వారం ఎలిమినేషన్‌ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. అప్పటి వరకు ఫ్రెండ్లీగా ఉన్న వాళ్లు నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగానే.. ఒకరిపై ఉన్న అసంతృప్తిని మరొకరు బహిరంగంగా వెల్లగక్కి మాటల యుద్ధానికి తెరలేపారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా దారుణంగా నోరు పారేసుకొన్న పరిస్థితి కనిపించింది. ఇంటిలో తమ అస్థిత్వం కోసం ఇంటి సభ్యులు దిగజారుతున్నారా? అనేంతగా ప్రోమోలో కనిపించింది. సెప్టెంబర్ 13వ తేదీ నాటి రెండో ప్రోమోలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం..

మానస్‌పై మండిపడ్డ లోబో

మానస్‌పై మండిపడ్డ లోబో

నామినేషన్ల సందర్భంగా లోబో, హీరో మానస్ మధ్య భారీగానే వాగ్వాదం చోటుచేసుకొన్నట్టు కనిపించింది. ఏదైనా రీజన్లు చేస్తే ఇలా చప్పుడు రావాలి అంటూ చేతితో లోబో చప్పట్లు కొట్టి చూపించారు. అంతేకాకుండా మీరు ఏదైనా చెబితే వినడానికి సిద్ధంగా లేరు. మీరు హీరో కదా.. యాటిట్యూడ్ చూపిస్తున్నారు అని లోబో ఘాటుగా స్పందించారు. అయితే లోబో మాటలకు మానస్ స్పందిస్తూ.. నేను మీ ముందు చిన్నపిల్లాడిని అని అంటే... అవును నేను చిన్నపిల్లాడినే అంటూ మానస్ అంటే.. అవును నీవు చిన్న పిల్లాడివే అంటూ లోబో సమాధానం ఇచ్చాడు.

ఆర్జే కాజల్‌పై విశ్వ ఘాటుగా

ఆర్జే కాజల్‌పై విశ్వ ఘాటుగా

ఇక విశ్వ, ఆర్జే కాజల్ మధ్య కూడా గట్టిగానే మాటల యుద్ధం జరిగింది. గ్రూప్స్ పెట్టుకొని చాలా మంది ఫేక్‌గా ఆడుతున్నారు అని కాజల్ ఆరోపణలు చేసింది. అయితే ఇది అందరి ఇల్లు. అందరు పనిచేస్తేనే పని అయితది. లేకపోతే నోట్లకు ముద్ద పోదు అని విశ్వ అంటే.. నా పని నేను నీట్‌గా, పర్‌ఫెక్ట్‌గా చేస్తాను అని ఆర్జే కాజల్ సమాధానం ఇచ్చింది. అలాగే కాజల్‌ను ఉద్దేశించి సింగర్ రామచంద్ర మాట్లాడుతూ.. అది నాగ్ గారు చెప్పిన తర్వాతే నీలో మార్పు కనిపించింది అంటే.. అవునా అన్నట్టు కాజల్ ముఖం పెట్టింది.

ప్రియపై నటరాజ్ మాస్టర్ ఆగ్రహం

ప్రియపై నటరాజ్ మాస్టర్ ఆగ్రహం


ఇక ప్రియ, నటరాజ్ జోరుగా మాటలు విసురుకొన్నారు. నటరాజ్ మాస్టర్‌ను టార్గెట్ చేస్తూ ప్రియ.. చాలా స్టుపిడిటి అనిపించింది. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. మీరు ఒకరిని ప్రభావితం చేయడం ఆపేయండి అని అంటే.. అదే గేమ్ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్‌ను ప్రియ నామినేట్ చేస్తూ కనిపించింది.

సత్తా ఉంటే నాతో పెట్టుకో.. అంటూ

సత్తా ఉంటే నాతో పెట్టుకో.. అంటూ

ఇక కార్తీకదీపం ఫేమ్ ఉమ కూడా ఘాటుగానే స్పందించింది. తన గేమ్‌కు పదునుపెట్టినట్టు కనిపించింది. సత్తా ఉన్నవాళ్లు, దమ్ము ధైర్యం ఉన్నవాళ్లు, బుద్ది, బలం ఉన్న వాళ్లు నాతో ఆడండి. నాతో మాట్లాడాలంటే..ఏదైనా భయం ఉంటే కనుక అని ఉమ ఏదో చెప్పబోతుంటే.. నాకు భయం లేదు అంటూ అనీ మాస్టర్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది.

పోవే ఉమ అంటూ ప్రియాంక కోపంగా

అలాగే తాజా ప్రోమోలో షణ్ముఖ్, శ్రీ రామచంద్ర, జస్వంత్, ప్రియాంక ఘాటుగానే స్పందించినట్టు కనిపించింది. ఓ దశలో ఉమపై ప్రియాంక సింగ్ విరుచుకుపడినట్టు కనిపించింది. అంతేకాకుండా పోవే పో.. ఉమ అంటూ అనడం ప్రోమోలో వినిపించింది. తాజా ప్రోమో చూస్తే.. నామినేషన్ల ప్రక్రియలో రణరంగమే సృష్టించినట్టు కనిపించింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బిగ్‌బాస్ తెలుగు 5 సెప్టెంబర్ 13వ షో చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X