For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jabardasth Priyanka in Bigg Boss Telugu 5: నాన్నా తలదించుకొనే పని చేయను.. ఆ ఒక్క రాత్రి అంటూ ప్రియాంక కంటతడి

  |

  బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలోకి ట్రాన్స్‌జెండర్, జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక అలియాస్ ప్రియాంక సింగ్ అలియాస్ సాయి తేజ 9వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. అందంగా ముస్తాబైన ఈ ముద్దుగమ్మ ఆటపాటతో బిగ్‌బాస్ వేదిక మీద మెరిసింది. అయితే బిగ్‌బాస్ వేదిక మీద చాలా ఎమోషనల్ అయ్యింది. నాగ్‌తో మాట్లాడుతూ ఓ దశలో కంటతడి పెట్టుకొనేంతగా భావోద్వేగానికి గురైంది. ప్రియాంక సింగ్ జీవితంలోకి వెళితే..

   అసలు పేరు సాయితేజగా

  అసలు పేరు సాయితేజగా

  ప్రియాంక సింగ్ అమ్మాయిగా మారకముందు తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు సాయి తేజ. చిన్నతనం నుంచే అమ్మాయిలా కోరికలు ఉండేవి. ఇంటర్మీడియెట్ వరకు ఆ కోరికలను కుటుంబం కోసం అదుపులోపెట్టుకొన్నాడు. ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు వచ్చి అమ్మాయిలా సర్జరీ చేయించుకొని ట్రాన్స్‌జెండర్‌గా మారారు. ఆ తర్వాత జబర్దస్త్ షోలో స్థానం సంపాదించుకొని పాపులర్‌గా మారారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో అందమైన యువతిగా మెరిసారు.

  గ్రీకువీరుడు సమయంలో కలిశా

  గ్రీకువీరుడు సమయంలో కలిశా

  బిగ్‌బాస్ వేదికపై నాగ్‌తో మాట్లాడుతూ.. నేను గ్రీక్ వీరుడు సినిమా షూటింగ్ సమయంలో అబ్బాయిగా కలిశాను. ఇప్పుడు అమ్మాయిగా మారి మీ ముందు ఉన్నాను. గీతాంజలి గారితో మిమ్మల్ని కలిశాను. అబ్బాయిగా అద్దంలో చూసుకొంటే అబద్దం అనిపించేది. అందుకే అమ్మాయిగా మారిపోయాను అని ప్రియాంక చెప్పారు. తన గురించి చేసిన ఆడియో విజువల్ ప్రజెంటేషన్‌ను నాగ్‌తో కలిసి చూసింది.

  మనసును కాదనలేక ట్రాన్స్‌జెండర్‌గా

  మనసును కాదనలేక ట్రాన్స్‌జెండర్‌గా

  ఒకరి జీవితానికి సంబంధించిన చరిత్ర ముగిసిపోవాలనుకొన్నా. కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకొన్న అది కేవలం ఒక్క నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. రెండు మంచి మార్గాలు ఎదురైనప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎవర్నీ అడగాలి. ఇది నువ్వు కాదని చెప్పే మనసును కాదనలేక ఎంతో సతమతమయ్యాను. అందుకే మది నొప్పించని మార్గంలో మగువగా మారాను. సులభం కాని సమస్యలను సమాజంలో అధిగమించడానికి నా మనసుకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొన్నాను. ఇలా మీముందుకు వస్తున్నాను అని వీడియోలో ప్రియాంక సింగ్ తెలిపారు.

  మీరు కొందరికి స్పూర్తి అంటూ నాగ్

  మీరు కొందరికి స్పూర్తి అంటూ నాగ్

  వీడియో చూసిన తర్వాత నాకు మాటలు రావడం లేదు అంటూ ప్రియాంక సింగ్ అంటే.. నీవు కొందరికి ఇన్సిపిరేషన్. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ జన్మత సిద్దించిన హక్కు. దాని కోసం పోరాడుతున్న తీరు స్పూర్తిగా అనిపిస్తుందని నాగార్జున అన్నారు. ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం. పోరాడుతాను అని ప్రియాంక చెప్పారు. అబ్బాయిగా సాయి తేజ నుంచి అమ్మాయిగా ప్రియాంకగా మారిన విషయం తన తండ్రికి తెలియదు. అంధుడైన తన తండ్రి బీబీ సింగ్‌కు తన జెండర్ మార్పు విషయం బిగ్‌బాస్ షో ద్వారా తెలియజేయాలనుకొంటున్నాను అని ప్రియాంక చెప్పారు.

   ప్రియాంక సింగ్ కుటుంబ గురించి

  ప్రియాంక సింగ్ కుటుంబ గురించి

  మాది శ్రీకాకుళం, నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు ఉన్నారు. నేను కుటుంబంలో ఐదో సంతానం. ఇద్దరు అక్కలు, అన్నయ్యలకు అప్పుడే పెళ్లిచేశారు. మా నాన్న ల్యాబ్‌లో పనిచేసే వారు. ప్రాక్టికల్స్ చేయిస్తుండగా యాసిడ్ ఎటాక్ కావడంతో కళ్లుపోయాయి. ఆయనకు కళ్లు కనిపించవు. ల్యాబ్ అటెండర్‌గా నేను పనిచేశాను. ఇంట్లో నా కంటే పెద్దవాళ్లు వాళ్ల బతుకు తెరువు కోసం బయటకు వెళ్లారు. దాంతో నాన్న బరువు బాధ్యతలు నాపై పడ్డాయి. ఆ సమయంలో నాకు పెళ్లి చేయాలని చూశారు. కానీ నేను పుట్టుకతో ఉన్న నా కోరికను నిజం చేసుకోవాలని అనుకొన్నాను. పెళ్లి జరిగితే అమ్మాయి జీవితం నాశనం అవుతుందని భావించాను. అందుకే రాత్రికి రాత్రే సర్జరీ చేయించుకొని మగువగా మారాను. నాన్న గారికి ఇంకా తెలియదు. కాబట్టి ఇంతకంటే మంచి సమయం, వేదిక లభించదు అని ప్రియాంక అన్నారు.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
  నీ కొడుకు స్థానాన్ని భర్తీ చేస్తా అంటూ

  నీ కొడుకు స్థానాన్ని భర్తీ చేస్తా అంటూ

  నేను అమ్మాయిగా మారినా నేను ఎప్పటికీ మీ తేజనే. ఒక కొడుకు స్థానాన్ని ఎప్పుడూ తీసుకొంటాను. నన్ను అర్ధం చేసుకొంటారని భావిస్తున్నాను. నన్ను అంగీకరిస్తారని అనుకొంటున్నాను. మీరు తలదించుకొనేలా చేయను అంటూ కన్నీళ్లు పెట్టుకొంది. దాంతో నాగార్జున ఆమెను ఓదార్చుతూ.. ఈ విషయం మీ నాన్నకు తెలుసా? ఆయన పేరు ఏమిటి అని అడిగితే.. డీబీ సింగ్ అని ప్రియాంక చెప్పింది. దాంతో డీబీ సింగ్ రిక్వెస్ట్ చేస్తూ.. కోట్ల ముందు చెప్పావు. నీ బాధను నీ తండ్రి అర్ధం చేసుకొంటారు అని నాగార్జున అంటూ ప్రియాంకను బిగ్‌బాస్ ఇంటిలోకి పంపించారు.

  English summary
  Jabardasth Priyanka entered into Bigg Boss Telugu 5.She gets emotinal after revealing Transgender surgery matter.Here is the her Biography, life facts, career
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X