నాభి అందాలతో జబర్దస్త్ ప్రియాంక.. అలాంటి డ్రెస్సులో ఫోకస్ అయ్యేలా హాట్ సెల్ఫీ
ట్రాన్స్‌జెండర్ గా మారి మంచి ఆదరణ పొందిన అతి తక్కువ మందిలో ప్రియాంక సింగ్ ఒకరు. అందరూ ఆమెను ముద్దుగా పింకీ అని పిలుచుకుంటారు. అయితే బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో మొదటగా లేడీ గెటప్పులో ఆకర్షించాడు సాయి తేజ. అందులో లేడీగా మంచి కామెడీ పండించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తర్వాత కొంత కాలానికి సర్జరీ ద్వారా ట్రాన్స్‌జెండర్ అయి ప్రియాంక సింగ్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. దీని తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటోన్న ప్రియాంక సింగ్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ యూత్ మతులు చెడగొడుతోంది.
అలా పాపులర్:పాపులర్ కామెడీ పోగ్రామ్ జబర్ధస్త్ లో అమ్మాయి గెటప్‌లు వేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు సాయి తేజ. లేడీ గెటప్పుకు పర్ఫెక్టుగా సెట్ అయి అమ్మాయిల ఆహార్యంతో మంచి కామెడీ పండిచేవాడు. ఎన్నో టీమ్‌లలో అదిరిపోయే ప్రదర్శనలు ఇచ్చిన సాయి తేజ తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యాడు.

ఇంటర్వ్యూలో:జబర్దస్త్ షోలో లేడీ గెటప్పులతో ఆకర్షించిన సాయి తేజ ఆ తర్వాత ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్ గా మారాడు. అప్పటి నుంచి చాలా కాలం గ్యాప్ తీసుకుంది. ట్రాన్స్‌జెండర్‌గా అయిన తర్వాత ప్రియాంక సింగ్ ఆరోగ్య పరంగా, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. దీనిపై మరో జబర్దస్త్ కమెడియన్ తో చేసిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

లవ్ ట్రాక్ తో:అనంతరం బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 19 మందిలో ఒకరిగా బిగ్ బాస్ మెట్లు ఎక్కిన ప్రియాంక సింగ్ మొదట్లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా మానస్‌తో చనువుగా ఉంటూ అతడితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లుగా వ్యవహరించింది.

కొన్ని షోలలో:బిగ్ బాస్ షో తర్వాత ప్రియాంక సింగ్ మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా ప్రకటించింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేస్తోంది. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం ప్రియాంక సింగ్ అనుకున్నంత రేంజ్‌లో అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

ఫాలోవర్లతో షేర్:ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయిన తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయింది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ తన క్రేజ్ మరింతగా పెంచుకుంటోంది.

హాట్ సెల్ఫీ పిక్:నిత్యం హాట్ పిక్స్ వదులుతూ రచ్చ చేస్తోన్న బ్యూటిఫుల్ ప్రియాంక సింగ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఘాటు సెల్ఫీ ఫొటోను పంచుకుంది. ఈ సెల్ఫీ ఫొటోలో ఆమె మెరూన్ కలర్ టాప్.. బ్లూ కలర్ ప్యాంట్ వేసుకుంది. దీనిలో మాస్క్ పెట్టుకున్న ప్రియాకం సింగ్ తన నాభి అందాన్ని మాత్రం ఫోకస్ చేసి చూపించింది. దీంతో ఈ పిక్ నెట్టింట్లో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











