నడుము మడతలు చూపిస్తూ జబర్దస్త్ ప్రియాంక హాట్ షో.. ఆ పిచ్చి ఇలా చేయిస్తుందంటూ!

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది లైమ్ లైట్ లోకి వచ్చారు. జబర్దస్త్ లో కమెడియన్ గా అలరించిన తర్వాత వారు వివిధ రకాలుగా గుర్తింపు పొందారు. అలాంటి వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్పులతో చాలా ఫేమస్ అయ్యాడు సాయి తేజ. అతని కామెడీ టైమింగ్ తో అలరించారు. అయితే కొన్నేళ్ల తర్వాత సర్జరీ చేయించుకుని ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ గా మారింది. అప్పటి నుంచి ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. అలాగే సోషల్ మీడియాలో మరింతగా అందాలు ప్రదర్శిస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

అలా పాపులర్: ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు సాయి తేజ. లేడీ గెటప్పుకు చక్కగా సెట్ అయి అమ్మాయిల అభినయం, ఆహార్యంతో మంచి కామెడీ పండిచేవాడు. జబర్దస్త్ షోలోని అనేక టీమ్‌లలో అదిరిపోయే ప్రదర్శనలు ఇచ్చాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యాడు.

Jabardasth Priyanka Singh

ముంబై వెళ్లి: జబర్దస్త్ షోలో లేడీ గెటప్పులతో ఆకర్షించిన సాయి తేజ ఆ తర్వాత ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్ గా మారాడు. అతను కాస్తా ట్రాన్స్‌జెండర్‌ గా మారి ఆమె అయిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం గ్యాప్ తీసుకుంది. ట్రాన్స్‌జెండర్‌గా అయిన తర్వాత ప్రియాంక సింగ్‌ హెల్త్ పరంగా, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.

ఆరంభంలోనే: ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో ప్రియాంక సింగ్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. కానీ అదే సమయంలోనే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 19 మందిలో ఒకరిగా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టింది. ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చి ఆరంభంలోనే ప్రత్యేకంగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక.

Jabardasth Priyanka Singh

అలా ఎలిమినేట్: ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే ప్రియాంక సింగ్‌ బాగా హైలైట్ అవుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా అందులో మరో కంటెస్టెంట్ అయిన మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించడంతో ఆమె అతనితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లుగా అనిపించింది. మొత్తంగా అందం, ఆట, ప్రేమ అన్నింటిలోనూ తనదైన మార్కును చూపిస్తూ వచ్చిన ప్రియాంక ఫినాలే ముందే ఎలిమినేట్ అయింది.

అటు ఇటుగా ఛాన్సులు: బిగ్ బాస్ షో తర్వాత ప్రియాంక సింగ్ మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా ప్రకటించింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేస్తోంది. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం ప్రియాంక సింగ్ అనుకున్నంత రేంజ్‌లో అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

Jabardasth Priyanka Singh

నడుము మడతలు.. ఆ పిచ్చి: ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అదిరే అందాలతో రచ్చ చేస్తోంది ప్రియాంక సింగ్. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది. లంగా ఓణి వేసుకుని సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే అనే పాటకు డ్యాన్స్ చేసింది. ఇందులో ఆమె నడుము మడుతల అందాన్ని కొంటెగా చూపిస్తూ వయ్యారాలు పోయింది. ఈ వీడియోకు "నేను మంచి డ్యాన్సర్ కాదు. కానీ డ్యాన్స్ మీదున్న పిచ్చి ఇలా స్టెప్పులు వేయిస్తుంది" అని క్యాప్షన్ రాసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X