Jabardasth ప్రియాంక సింగ్ హల్దీ ఫంక్షన్ వీడియో వైరల్.. పెళ్లి సెట్ అయ్యిందా?

మొదట జబర్దస్త్ కామెడీ షోలో అమ్మాయి గెటప్ లలో కనిపించి ఆ తర్వాత జెండర్ మార్చుకొని ప్రియాంక సింగ్ గా తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకుంది. కేవలం రియాల్టీ షో లతోనే కాకుండా కొన్ని చిన్న సినిమాలలో అలాగే ఇతర ప్రోగ్రామ్స్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తోంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రియాంక సింగ్ పోస్ట్ చేస్తున్న ఫోటోలు వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అయితే రీసెంట్ గా ప్రియాంక సింగ్ హాల్దీ వేడుక గెటప్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమెకు పెళ్లయిందా అనే సలహాలు కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

జెండర్ మార్చుకొని..

జెండర్ మార్చుకొని..

జబర్దస్త్ లో లేడీ గెటప్ లో కనిపించిన చాలామంది అబ్బాఅయిలు అమ్మాయిలు తరహాలో షాక్ ఇస్తూ ఉంటారు. మంచి నటనతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక అదే తరహాలో అమ్మాయి గెటప్ లో కనిపించిన ప్రియాంక సింగ్ ఆ తర్వాత జెండర్ కూడా మార్చుకుంది. చిన్నప్పటినుంచి అమ్మాయి గా ఉండాలి అనే కోరికతోనే ఆ తర్వాత ఆమె జెండర్ మార్చుకొని వార్తల్లో నిలిచారు.

 తొందరపడకుండా..

తొందరపడకుండా..

ప్రియాంక సింగ్ జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న తరువాత కొన్ని చిన్న సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. కానీ తొందరపడకుండా ప్రియాంక సింగ్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని అనుకుంది. మంచి కంటెంట్ ఉన్న పాత్రలు వస్తేనే చేయాలని అనుకుంది. ఇక ఆ ప్రయత్నంలోనే ఆమెకు బిగ్ బాస్ ద్వారా ఒక మంచి అవకాశం అయితే దక్కింది.

బిగ్ బాస్ ద్వారా

బిగ్ బాస్ ద్వారా

అసలైతే రెండవ సీజన్లోనే అవకాశం కోసం ప్రయత్నాలు చేసిన ప్రియాంక సింగ్ మొత్తానికి ఐదవ సీజన్లో అవకాశం దక్కించుకునే మంచి గుర్తింపును అందుకుంది. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు కూడా ప్రియాంక సింగ్ తప్పకుండా ఫైనల్ వరకు వెళుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆమె కొన్ని పొరపాట్ల కారణంగా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

 ఎమోషనల్ మూమెంట్స్

ఎమోషనల్ మూమెంట్స్

ఇక ఈ తరుణంలో బిగ్ బాస్ లో ఆమె తన జీవితంలోని ఎన్నో విశాద విషయాలను కూడా తెలియజేసింది. లవ్ స్టోరీతో పాటు ముఖ్యంగా అప్పటివరకు తన తండ్రికి తాను జెండర్ మార్చుకున్నట్లుగా విషయం తెలియదు అని తెలియజేసింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా తెలుసుకున్న తన తల్లిదండ్రులు ఎమోషనల్ అవుతూ ఆమెకు దగ్గరయ్యారు.

గ్లామరస్ ఫోటోషూట్స్

గ్లామరస్ ఫోటోషూట్స్

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో మరింత పాపులర్ అయింది. ఆమె ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గ్లామరస్ ఫోటోషూట్స్ తో కూడా ప్రియాంక సింగ్ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. రీసెంట్ గా కూడా ఆమెకు కొన్ని డిఫరెంట్ ఫోటోలు పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచింది.

పెళ్లికి సిద్ధమైందా?

పెళ్లికి సిద్ధమైందా?

అలాగే ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతోందా అనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎందుకంటే ఆమె హల్దీ వేడుకకు సిద్ధమైనట్లు పెళ్లికూతురులా కనిపించింది. పసుపుపచ్చని చీరలో కాబోయే పెళ్లికూతురులా కనిపించిన ప్రియాంక అక్కడ ఏర్పాట్లు కూడా రెడీ చేస్తూ ఉన్నట్లుగా కనిపించింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతోందా అనే సందేహం కలుగుతోంది.

హల్దీ వీడియో వైరల్

హల్దీ వీడియో వైరల్

ప్రియాంక సింగ్ ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఇప్పుడు హాల్ది వేడుకకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంతో ఆమె మరింత చర్చనీయాంశంగా మారింది. బహుశా ఏదైనా షూటింగ్లో ఆమె ఈ విధంగా వీడియో తీసుకొని ఉండవచ్చు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ప్రియాంక సింగ్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X