బ్రాలో షాకిచ్చిన జబర్ధస్త్ ప్రియాంక: ఏం దాచుకోవాలో అవన్నీ చూపిస్తూ!
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. ఎంతో మంది గొప్ప గొప్ప ఆర్టిస్టులను వెలుగులోకి తీసుకొచ్చిన ఏకైక షో జబర్ధస్త్. అలా వచ్చి పాపులర్ అయిన వారిలో సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్ ఒకరు. ఆ షోలో లేడీ గెటప్‌లు వేసుకుంటూ.. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ట్రాన్స్‌జెండర్‌గా మారి అందంతో మాయ చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చి మరింత హైలైట్ అయింది. ఇక, తాజాగా ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

జబర్ధస్త్ షోలో సందడి చేసేసి
ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ సందడి చేసిన ప్రియాంక సింగ్.. ఎన్నో టీమ్‌లలో అదిరిపోయే స్కిట్లు చేసింది. అలా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది. దీంతో ట్రాన్స్‌జెండర్ అయిపోయింది. దీని తర్వాత ఆమె ఆరోగ్య పరంగా ఎంతగానో ఇబ్బంది పడినట్లు ఇంటర్వ్యూల్లో తెలిపింది.

ట్రాన్స్‌జెండర్‌గా బిగ్ బాస్‌లో
సాయితేజగా జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ వచ్చినా.. సర్జరీ తర్వాత అవకాశాలు రాక ప్రియాంక సింగ్ ఎన్నో ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే ఆమె కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 19 మంది రాగా ప్రియాంక సింగ్ ప్రత్యేకంగా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది.

బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాకు
బిగ్ బాస్ షోలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రియాంక సింగ్ బాగా ఫోకస్ అయింది. మరీ ముఖ్యంగా ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ట్రై చేసింది. అలా షో మొత్తం ఆమె అతడితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించింది. మొత్తంగా అందం, ఆట, ప్రేమ అన్నింటిలోనూ తనదైన మార్కును చూపిస్తూ వచ్చి.. ఫినాలే ముందు ఎలిమినేట్ అయిపోయింది.

సినిమా ఛాన్స్.. షోలలో రచ్చ
బిగ్ బాస్ షో పుణ్యమా అని ప్రియాంక సింగ్ మరింతగా ఫేమస్ అయింది. గతంలో కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్న ఆమె.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. సోషల్ మీడియాలో లైవ్‌లు చేస్తూ తెగ సందడి చేసింది. అదే సమయంలో సినిమా ఛాన్స్‌లు కూడా పట్టేస్తోంది. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా ప్రకటించింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయిన తర్వాత సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ గ్లామర్ టచ్
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రియాంక సింగ్ మరింతగా హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లానే అందమైన ఫొటోలను, రీల్స్‌ను వదులుతూ ఫాలోవర్లను అలరిస్తోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. దీంతో ఆమె పోస్టులకు ఫాలోవర్ల నుంచి రెస్పాన్స్ దక్కుతోంది.

బ్రాలో ప్రియాంక అరాచకం
గతంలో కంటే ఇప్పుడు హాట్ డోస్ పెంచుతోన్న ప్రియాంక సింగ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా మాత్రమే ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కి.. ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











