బలుపు చూపిస్తున్నావా... తొక్కిపారేస్తా.... పటాస్ ఫైమాకి జబర్దస్త్ కమెడియన్ వార్నింగ్
తెలుగువారి ఫేవరెట్ కామెడీ షో జబర్దస్త్ ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..
తొలుత నూకరాజు, చలాకీ చంటీలు ఎంట్రీ ఇస్తారు. జబర్దస్త్‌లో చంటిని అందరూ కమెడియన్ అనుకుంటున్నారు. కానీ అతను కమెడియన్ కాదు. జబర్దస్త్‌కు చంటి ఒక కోడలు పిల్ల. అలిగిన ప్రతిసారి పోతాడు, మళ్లీ వస్తాడు అని నూకరాజు చెప్పగానే అంతా నవ్వేస్తారు. రాంప్రసాద్‌కు ఏ కష్టాలు లేవు.. ఏ బాధలు లేవు.. చాలా హ్యాపీగా ఉంటాడు అనుకుంటున్నారు కదా? కానీ ఆయన వెంట్రుకలతో ఒక వ్యవసాయం చేస్తున్నాడు తెలుసా అని అంటాడు. వ్యవసాయం వెంట్రుకలతో ఎలా చేశాడని కొమరం అడగ్గా.. ఇక్కడివి పీకి ఇక్కడ అంటూ చెబుతాడు నూకరాజు.
ఆ వెంటనే లేడీ కంటెస్టెంట్స్‌ని పిలిచి మీ అందరికీ నేను ముగ్గుల పోటీ పెట్టబోతున్నాను అంటాడు. అయితే అతని సుత్తి తట్టుకోలేక ముగ్గు పాత్రను ఫైమా నేలమీద విసిరి కొట్టేస్తుంది. అహంకారం, బలుపు, యాటిట్యూడ్.. పైటాస్‌లోనే తొక్కిసుంటే ఇక్కడి వరకు వచ్చేదా? అని పంచ్ వేస్తాడు నూకరాజు. ఆ మాటలకు కంటెస్టెంట్స్ పడిపడి నవ్వుతారు. ఖుష్బూ గారు ఎంత సున్నితమైన మనసంటే ఆవిడకి సెట్‌లో ఎవరైనా కొట్టుకుంటే నచ్చదు. ఆవిడ మేకప్‌మెన్‌ని పనిలోంచి తీసేసింది. ఎందుకంటే మేకప్ వేస్తున్నప్పుడు ముక్కుకి వాటర్ స్ప్రే కొట్టింది. వాటర్ స్ప్రే కొట్టడం కూడా కొట్టడమే కదా అని అంటాడు నూకరాజు.

ఆ తర్వాత పటాస్ ఫైమా - బుల్లెట్ భాస్కర్ వస్తారు. నాకొక డౌట్.. ఖుష్బు గారు మీ దగ్గరికి వస్తే మీకు ఏమనిపిస్తుందని అడుగుతుంది ఫైమా. దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. అదే నీకైతే దండం వేసి పిండం పెట్టాలనిపిస్తుందని పంచ్ వేస్తాడు భాస్కర్. అంత అందంగా ఉన్న రష్మి వెనకాల ఒక్కరు కూడా పడటం లేదు... ఒక్కరు కూడా కొట్టుకోవడం లేదు. అంతంత ఉన్న నా వెనుక ముగ్గురు కొట్టుకోవడం ఏంటి అని అడుగుతుంది ఫైమా. ఫైవ్ స్టార్ హోటల్‌లో చికెన్ బిర్యానీ ఉంటుంది. దాని కోసం కుక్కలు కొట్టుకుంటాయా? అదే చికెన్ బిర్యానీ చెత్తకుండలో ఉంటే అని భాస్కర్ క్లారిటీ ఇవ్వడంతో అంతా నవ్వేస్తారు.
మరో స్కిట్‌లో వర్షని ఎందుకు డల్‌గా ఉన్నావని అడుగుతాడు పొట్టి నరేష్. మా ఇంట్లో దొంగలుపడి సీసీకెమెరాలను ఎత్తుకుపోయారని చెబుతుంది. మరి మీరెందుకు డల్‌గా ఉన్నారని నరేష్‌ను అడగ్గా.. మా ఇంట్లో కూడా దొంగలు పడ్డారని చెబుతాడు నరేష్. మీ ఇంటి ముందు కుక్క ఉంది కదా అని వర్ష అడగ్గా.. ఆ కుక్కనే ఎత్తుకెళ్లాడని అంటాడు నరేష్. ఆ తర్వాత వర్ష కోసం నెక్లెస్ తీసుకొచ్చి మెడలో వేయగా.. అది చూసిన ఫైమా నాకు కూడా నెక్లెస్ కావాలని అప్పుడే శోభనమని భాస్కర్ మీద రంకెలు వేస్తుంది. దాంతో ఊరకుక్క మీద పడినప్పుడు కూడా ఇంత భయపడలేదు అంటాడు భాస్కర్.
తర్వాత రాంప్రసాద్ ఒక కంటికి అడ్డుగా గుడ్డ కట్టుకుని రెండు గన్నులతో వస్తాడు. ఈ రెండు గన్నులతో ఒకదాని నుంచి చూస్తా.. రెండో దాని నుంచి కాలుస్తా అని చెబుతాడు. అలా ఎందుకని అడగ్గా.. మొన్న జలుబు చేసిందని మాస్క్ తీసుకురమ్మంటే వీడు ఇది పట్టుకొచ్చాడు.. వేస్ట్ చేయడం ఎందుకని వాడుతున్నానని అంటాడు రాంప్రసాద్. ఒక అమ్మాయి చచ్చిపోయింది అక్కడ ఇద్దరు కిల్లర్స్ ఉన్నారు.. ఒకరి చేతిలో పెన్ను, మరొకరి చేతిలో కత్తి ఉంది? ఎవరు చంపారని సన్నీని అడుగుతాడు రాంప్రసాద్. కత్తి ఉన్నోడే చంపాడని సన్నీ ఆన్సర్ ఇవ్వగా.. పెన్ను ఉన్నోడే చంపాడని రాంప్రసాద్ అంటాడు. అదేలా అంటే కత్తి కంటే కలం షార్ప్‌గా ఉంటుందని చెప్పడంతో అంతా పడపడి నవ్వుతారు. ఆ తర్వాత సుష్మా భూపతి, దొరబాబు, చంటి- సుధాకర్‌లు తన మార్క్ కామెడీతో స్కిట్ చేసింది. మరి ఫైమాకు నూకరాజుకు గొడవ చల్లారిందా? హత్య కేసును రాంప్రసాద్ ఎలా సాల్వ్ చేశాడు? బుల్లెట్ భాస్కర్ శోభనం జరిగిందా? ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే జనవరి 30, 31వ తేదీలలో జరిగే జబర్దస్త్ షోను చూసేయాల్సిందే.


Click it and Unblock the Notifications











