అలాంటి డ్రెస్‌లో జబర్దస్త్ వర్ష ఎంట్రీ... తల ఎక్కడ పెట్టుకోవాలంటూ నటుడి సీరియస్
తెలుగు ప్రేక్షకులకు దాదాపు 12 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..
ముందుగా చలాకీ చంటి ఆటోవాలా లాగా ఎంట్రీ ఇచ్చాడు. ఒకటి చెబుతా గుర్తు పెట్టుకోండి.. జీవితంలో అలసిపోతే మీకు కావాల్సింది టీ, ఇంకా అలిసిపోతే కావాల్సింది గ్రీన్ టీ, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే అడగాల్సింది చంటీ అని పంచ్ విసిరాడు. ఇంతలో సుధాకర్ లేడీ గెటప్‌లో నాకు హార్ట్ అటాక్ వస్తోందని పడిపోతాడు. భర్త గెటప్‌లో ఉన్న ప్రవీణ్.. మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పగానే చంటి కంగ్రాట్స్ చెబుతాడు. మా ఆవిడ ప్రెగ్నెంట్ కాదు సార్.. హార్ట్ అటాక్ వచ్చిందని ప్రవీణ్ అంటాడు. హార్ట్ లేని దానికి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎవరు నమ్ముతారు. ఈ ప్రపంచంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినట్లు ఒక్క స్త్రీ రికార్డ్‌లో కూడా లేదు కంగ్రాట్స్ అంటాడు చంటి. ఆ వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లానని ఇద్దరినీ ఆటో ఎక్కించుకుని అద్దంలో మీ ఆవిడ కనిపిస్తోందని అద్దాన్ని తీసేశాని అంటాడు ఆ దెబ్బకు అంతా నవ్వేస్తారు.

మరో స్కిట్‌లో అప్పారావు- నూకరాజులు ఎంట్రీ ఇస్తారు. 50 వేలు వచ్చాయి.. ఆ నెక్లెస్ కూడా ఇస్తే అప్పు తీర్చేస్తానని అంటాడు నూకరాజు. పక్కనే నాటకాల నటరాజు ఉన్నాడు కదా వాడిని అడగండి అని లేడీ గెటప్‌లో ఉన్న అప్పారావు సలహా ఇస్తాడు. వెంటనే నాటకాల నటరాజు దగ్గరికి వెళ్లగా అతను అన్ని ప్రశ్నలను నాటకాలలో మాదిరిగానే డైలాగ్స్ రూపంలో సాగదీస్తాడు. దాంతో వాడు ఒకటి పక్కన ఐదు సున్నాలు పెట్టడానికి ఐదు రోజులు అయ్యేలా ఉందని విసుక్కుంటాడు నూకరాజు. ఈ స్కిట్ అందరినీ బాగా నవ్వించినట్లుగానే ఉంది.
ఆ వెంటనే వర్ష- బుల్లెట్ భాస్కర్‌లు అదిరిపోయే సాంగ్‌తో భార్యాభర్తలుగా ఎంట్రీ ఇస్తారు. పనిమనిషిగా ఉన్న ఫైమాను పిలిచి ఎవరొచ్చారు చూడు అని భాస్కర్ చెప్పగా.. వర్షనిన చూసి నేను కాకుండా ఇంకో పనిమనిషిని తీసుకొస్తారా అని ఫైమా పంచ్ వేయడంతో అంతా నవ్వేస్తారు. ఇంతలో ఫైమా మోడ్రన్ డ్రెస్‌లో పొట్టి గౌను వేసుకుని రావడంతో తోటి నటులు, జడ్జిలు షాక్ అయ్యారు. ఆఫీసుకు తీసుకుని వెళ్తారా అని వర్ష అడగ్గా... నేను ప్రేమించిందే చీరలో చూసి నువ్వేంటీ ఆఫీసుకు ఈ డ్రెస్‌లో వచ్చావు? నేను సినిమాను ఇంట్లో చూద్దామని అనుకుంటున్నాను.. నువ్వు ఓటీటీలో వేసి ఊరంతా చూపిస్తున్నావని భాస్కర్ మండిపడతాడు.
ఇంతలో వర్ష తండ్రి గెటప్‌లో వేసిన కమెడియన్ వచ్చి మొగుడు చెప్పినట్లు పెళ్లాం వినాలి కదా? అయినా మాట వినడం లేదు మీ అత్తని బయటికి పిలువు అంటాడు. దాంతో అత్త గెటప్ వేసిన లేడీ కమెడియన్ వర్షకంటే మోడ్రన్ డ్రెస్‌లో రావడంతో అంతా షాక్ అవుతారు. అమ్మా.. నువ్వు ఇలా ఉంటే నేను రోడ్ల మీద తల ఎలా ఎత్తుకోవాలి అంటుంది వర్ష. మరి నువ్వు ఇలా ఉంటే నేను ఎలా తల ఎత్తుకోవాలని తండ్రి గెటప్‌లో ఉన్న కమెడియన్ సెటైర్లు వేస్తాడు.
చివరిలో రాంప్రసాద్ బ్యూటీ పార్లర్ ఓనర్‌లా ఎంట్రీ ఇస్తాడు. మన పార్లర్‌లో అందంగా లేని అమ్మాయిలు ఫేసియల్ చేయించుకుంటే 10 వేలు తీసుకుంటాం, అదే అందంగా ఉన్న అమ్మాయిలు చేయించుకున్నారంటే వెయ్యి రూపాయలు తీసుకుంటామని రష్మికి ఆఫర్ ఇస్తాడు. అంటే నాకు వెయ్యి రూపాయలేనా అని రష్మి అడగ్గా.. నీకు 10 వేలు రా 1000 రూపాయలు ఉన్న అమ్మాయిని చూడమనడంతో అంతా నవ్వుతారు. పార్లర్ స్టాఫ్‌గా శాంతి స్వరూప్, మరో అమ్మాయిల్ని పరిచయం చేస్తాడు రాంప్రసాద్. ఇంతలో దొరబాబు వచ్చి.. రాంప్రసాద్ చూసి 2 ప్లేట్లు చికెన్ నూడిల్స్ తీసుకురమ్మని చెబుతాడు. ఆ మాటలతో అంతా నవ్వుకుంటారు.
కాసేపటికీ మరో కమెడియన్ వచ్చి నాకు అన్ని ఫేసియల్స్, అన్ని స్పాలు కావాలని చెబుతాడు. అవన్ని శాంతి చేస్తుందని చెప్పగానే నాకు అవన్నీ వద్దు జస్ట్ కటింగ్ చాలు.. కటింగ్ కూడా ఇదే చేస్తదా? అయితే జస్ట్ మూడు కత్తెరలు చాలు అని వెళ్లిపోతాడు. ఈ స్కిట్ కూడా బాగానే ఎంటర్‌టైన్ చేసినట్లుగా ఉంది. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ అవుతుండగా.. మరి హార్ట్ అటాక్ వచ్చిన సుధాకర్‌కు ట్రీట్‌మెంట్ జరిగిందా? నూకరాజు తనకు కావాల్సిన లక్ష రూపాయల్ని నాటకాల నటరాజు దగ్గర తీసుకున్నాడా? మోడ్రన్ డ్రెస్‌లో ఉన్న వర్ష ఆఫీసుకి ఎలా వెళ్లింది? రాంప్రసాద్ పార్లర్ బిజినెస్ ఎలా జరిగింది? తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 6, 7 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్‌ను చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











