Jabardasth: జబర్దస్త్ కంటెస్టెంట్‌పై ఉమ్మేసిన శివాజీ.. అసలేం జరిగిందంటే?
Jabardasth Promo: తెలుగు కామెడీ షోస్‌లో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్ధస్థ్ నంబర్ టాప్ లో రేటింగ్ తో రన్ అవుతోంది. జబర్ధస్థ్ ప్రారంభమై దాదాపు 12 ఏళ్లు అయినా.. ఇప్పటికీ హైయేస్ట్ టీఆర్‌పీ తో కొనసాగుతోంది. జబర్దస్త్ షో వస్తుందంటే ఆడియన్స్ టీవీలకి అతుక్కుపోయే వాళ్లు అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రోగ్రామ్ అంతలాగా...నవ్వులు పూయించేది. ఈ షోకు మంచి రెస్పాన్స్ రావడంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ మరో షోను కూడా మల్లెమాల డిజైన్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
లెటెస్ట్ ప్రోమో చూస్తే.. దసరా పండుగ సందర్భంగా జబర్దస్త్ టీం స్పెషల్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. ఈ స్పెషల్ ప్రోగ్రాంకు స్పెషల్ గెస్ట్ గా హీరోయిన్ లయ రావడంతో మరింత కలర్ ఫుల్ గా మారింది జబర్దస్త్. ముందుగా తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. 'చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు ఈ షో కి రావడం. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ ను. చాలా థాంక్స్' అంటూ హీరోయిన్ లయను ఇంప్రెస్ చేయబోయాడు. వెంటనే హీరో శివాజీ రియాక్ట్ అవుతూ.. 'సర్ సర్లే.. ఇక ఏమైనా మాట్లాడు' అంటూ పంచ్ వేసాడు.

ఆ తర్వాత రాకెట్ రాఘవ తన ఆపోజిట్ గురించి మాట్లాడుతూ .. '4000 రూపాయలు ఇస్తా.. వెళ్లేటప్పుడు తలోక హెల్మెట్స్ కొనుక్కోమని, ఆయన స్కిట్ ఓడిపోతే మొఖం ఎలా చూపిస్తున్నారు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతటితో ఆగకుండా.. స్కిట్ ఓడిపోయిన నాడు తాను ఇంటికి వెళ్ళనని, ఓడిపోయిన వాళ్లు ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్తున్నారని రాకెట్ రాఘవ అనగానే.. శివాజీ రియాక్ట్ అయ్యారు.
'అవును.. నాలుగు వారాల క్రితం రఘవా వాళ్ళ అబ్బాయి తనకు ఫోన్ చేసి మా డాడీ ఇంకా రాలేదని బాధపడ్డాడనీ, ఆ అబ్బాయికి దైర్యం చెబుతూ..' రోజు మీ నాన్న స్కిట్ ఓడిపోయాడు. ఏం పర్వాలేదు.. ఏ మున్సిపాలిటీ వాళ్ళు ఏ రాత్రి అయినా.. మీ డాడీని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర విడిచిపెడతారని ధైర్యం చెప్పానన్నారు. ఈ పంచ్ లో రాఘవ మొకం మడిపోయింది. బ్యాక్ గ్రౌండ్ వచ్చిన ఆర్ఆర్ మాత్రం ఆ సీన్ కు హైలెట్గా నిలిచింది.
ఆ తర్వాత నూకరాజు తన టీం తో వచ్చి చిరంజీవి స్కిట్ చేశారు. ఆ స్కిట్ లో ఓ లేడి క్యారెక్టర్ ను వృద్ధురాలు అని సంబోధించగా.. ఆ లేడీ కంటెస్టెంట్.. 'నన్ను పట్టుకొని వృద్ధురాలని మరోసారి అంటే.. బాగోదని వార్నింగ్ ఇవ్వడంతో షోలో నవ్వుల పువ్వులు పూసాయి. ఆ తర్వాత తాగుబోతు రమేష్ తన టీం తో వచ్చి స్కిట్ చేశాడు. ఇందులో ఓ కంటెంట్ లాంగ్ లెన్త్ డైలాగ్ చెప్పడంతో.. తన డైలాగు ఏంటో మర్చిపోయిన తాగుబోతు రమేష్ ..' ఓ ఐ సీ 'అంటూ ఏదో కవర్ చేశాడు. కానీ ఆ విషయాన్ని గమనించిన జడ్జ్ శివాజీ. అరేయ్ వాడు డైలాగ్ మర్చి పోయాడ్రా.. అంటూ రమేష్ పై సెటైరికల్ పంచ్ వేశాడు.
ఆ తర్వాత రాకెట్ రాఘవ ఓ ఓల్డ్ లేడీ గెటప్ లో స్టేజ్ పై ఎంటర్ అవుతాడు. ఆ గెటప్ చూసిన శివాజీ.. ఇన్నాళ్లకు నీకు సెట్ అయ్యే పాత్ర ఎంచుకున్నావ్ అంటూ కామెంట్ చేస్తాడు. అసలు కామెంట్ చేస్తున్నాడో.. కాంప్లిమెంట్ ఇచ్చాడో.. అర్థం కాక రాఘవ నోరేల్లబెట్టాడు. ఆ తర్వాత స్పెషల్ గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ లయను చూసిన రాఘవ.. 'ఎవర్రా ఆ పిల్లా..' అనడంతో పక్కనే ఉన్న మరో కంటెస్టెంట్ ..' ఏ నీకు మార్కులు వద్దా.?' అంటూ పంచ్ వేసాడు.
'నాకు అమ్మాయి తెలియక పోవడమేంట్రా.. ఆమె లయ .. కుర్రాళ్ళ గుండెల్లో లయ. ఆ పక్కన ఉన్న పిల్లవాడు కూడా తెలుసు.. పదహారేళ్ల పాప పదహారేళ్ల పాప అంటూ తన వెంబడి తిరిగేవాడంటూ' రాకెట్ రాఘవ అనగానే.. 'తూ.. నేను వెళ్ళిపోతున్నా.. అపురా బాబు' అంటూ మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చాడు శివాజీ. ఆ తర్వాత ఆటో రాంప్రసాద్ ఓ రాజు వేషం వచ్చి.. తనదైన కామెడీ టైమింగ్ ఆటో పంచులతో కడుపుబ్బ నవ్వించాడు. రాజ్యం ఎలా ఉందిరా అంటూ తన మంత్రిని అడగగా సుభిక్షంగా ఉంది ప్రభువు అంటూ సమాధానం ఇస్తాడు తన మంత్రి. అరేయ్ నేను అడిగింది మన రాజ్యం గురించి కాదురా రాత్రి వచ్చిన రాజ్యం గురించి అంటూ ఆటో రాంప్రసాద్ వేసిన పంచ్ అశోక్ హైలెట్గా నిలిచింది.


Click it and Unblock the Notifications











