దిక్కులేని చావు అవసరమా.. దయచేసి మా బాధ అర్థం చేసుకోండి.. రచ్చ రవి ఆవేదన
జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రచ్చ రవి చాలా రోజుల తరువాత జనాల ముందుకు వచ్చాడు. అయితే కామెడి స్కిట్స్ తో కాకుండా ఈ సారి ప్రభుత్వానికి అందరి తరపున తన ఆవేదనని వివరించాడు. సీఎం కేసీఆర్ తన మనవిని గురించి ఒక్కసారి ఆలోచించాలని ఇది చాలా ముఖ్యమైన విషయమని వివరణ ఇచ్చాడు.

చాలా బాధాకరమైన విషయం..
ప్రస్తుతం కరోనా వైరస్ ఏ స్థాయిలో పెరిగిపోతోందో స్పెషల్ చెప్పనవసరం లేదు. పదుల సంఖ్యలో పెరుగుతున్న సమయంలోనే ఎంతగానో భయపెట్టిన ఈ వైరస్ ఇప్పుడు లక్షల సంఖ్యలోకి వెళ్లింది. తెలంగాణలో కూడా రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే మరణించిన వారిని కనీసం చివరిసారి కూడా చూసుకునే అవకాశం కూడా లేకపోవడం చాలా బాధాకరమని రచ్చ రవి ఒక వివరణ ఇచ్చాడు.

తెలంగాణ ముఖ్యమంత్రి గారికి..
రచ్చ రవి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా మనసులో ఉన్న ఒక బాధను తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ కరోనా మహమ్మారి వలన అనాదిగా వస్తున్న ఆచారాలకు సెంటిమెంట్లకు వాల్యూ లేకుండా పోతున్నాయి. మనల్ని కనిపెంచిన వారు కరోనా మహమ్మారి వలన మరణిస్తే కడసారి కూడా చూసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

దిక్కులేని వారిగా..
అందరూ ఉండి కూడా దిక్కులేని వారిగా ఖననం చేస్తున్నాం. ఈ విషయం చాలా మందిని కలచి వేస్తోంది. నా రిక్వెస్ట్ ఏమిటంటే.. కరోనా మహమ్మారి భారిన పడిన వారు మరణిస్తే.. వైద్యుల సలహాతో వైరస్ గాలి కూడా బయటకు రాకుండా ఒక స్పెషల్ బాక్స్ లో ప్యాక్ చేస్తే చాలా బెటర్. ఎదో ఒక విధంగా మెడికల్ కేర్ తీసుకొని బాధితుల కుటుంబాలకు ఇస్తే వారిని చివరిసారి చూసుకునే అవకాశం ఉంటుంది.
Recommended Video

దయచేసి ఒక్కసారి ఆలోచించండి
ఆ తరువాత ఆచారాల ప్రకారం ఖననం చేయడమా లేక ప్రభుత్వానికి అప్పగించడమా అనేది జరుగుతుంది. దీని వల్ల దొరికే తృప్తి మాటల్లో చెప్పలేనిది. ఇలా చేయకపోతే ఆ బాధ జీవితాంతం ఉంటుంది. ఇలాంటి పనులు చేస్తే బాధిత కుటుంబాలకి ఎంతో సంతృప్తిని ఇచ్చినవాళ్ళం అవుతాం. ఎంతో కొంత బాధను కూడా తగ్గించినవాళ్ళం అవుతాం. ఈ విషయం గురించి కేసీఆర్ గారు ఒకసారి ఆలోచించాలని రచ్చ రవి వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











