షోకి గెస్ట్‌గా వచ్చి చెప్పకుండా వెళ్లిపోయాడట.. జబర్దస్త్ రాజమౌళి వ్యవహారంపై గుస్సా
బుల్లితెరపై షో క్లిక్ అవ్వాలంటే ఏదో ఒక ట్రాక్, కాంట్రవర్సీలుండాల్సిందే. మరీ ముఖ్యంగా షోపై హైప్ క్రియేట్ చేసేలా ప్రోమోలను కట్ చేస్తుంటారు. అలా ప్రోమోలతోనే ఇప్పుడు ప్రోగ్రాంలు క్లిక్ అవుతున్నాయి. కొన్ని సార్లు అయితే ఎపిసోడ్‌లో ఏమీ ఉండకపోయినా ప్రోమోలతో నడిపించేస్తారు. తాజాగా సాయి కుమార్ హోస్ట్‌గా వస్తోన్న వావ్ మూడో సీజన్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. అందులో తాగుబోతు రమేష్ రచ్చ రచ్చ చేశాడు.

మూడో సీజన్..
సాయి కుమార్ వావ్ షో ఒకప్పుడు బుల్లితెరపై ఫుల్ క్రేజ్ ఉన్న షో. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలతో సాయి కుమార్ అందరినీ టెస్ట్ చేసేవాడు. అందులో సెలెబ్రిటీలు దారుణంగా విఫలమయ్యే వారు. అలా ఆ రౌండ్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వావ్ మూడో సీజన్ బాగానే క్లిక్ అయింది.

స్పెషల్ గెస్ట్‌లను..
వావ్ మూడో సీజన్‌ను సాయి కుమార్ గ్రాండ్‌గా ప్రారంభించారు. అనసూయ, ఆది, అలీ వంటివారితో షోను ప్రారంభించాడు. సాయి కుమార్ దాదాపుగా జబర్దస్త్ ఆర్టిస్ట్‌లతోనే షోను ఎక్కువగా ప్లాన్ చేస్తుంటారు. ప్రతీ వారం కచ్చితంగా ఇద్దరైనా సరే జబర్దస్త్ కంటెస్టెంట్లు ఉండాల్సిందే.

తాజాగా అలా..
తాజాగా జబర్దస్త్ ఆర్టిస్ట్‌లను తన షోకి గెస్ట్‌లుగా పిలిచాడు సాయి కుమార్. బుల్లెట్ భాస్కర్, గాలిపటాల సుధాకర్, జబర్దస్త్ రాజమౌళి, ఫ్రూటీలతో గేమ్‌ను ఆడించాడు. ఇందులో రాజమౌళి మాత్రం అందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. తనదైన మ్యానరిజంతో నవ్వులు పూయించాడు.
Recommended Video

పాటలతో జోరు..
రాజమౌళి మామూలుగా జబర్దస్త్ షోలో పేరడి పాటలతో రచ్చ రచ్చ చేస్తుంటాడు. ప్రతీ పాటను తాగుబోతు పాటగా మార్చేస్తుంటాడు. అలాగే వావ్ షోలోనూ ఇదే కదా ఇదే కదా.. పదర పదర అంటూ తాగుబోతు పాటలుగా పేరడి చేసి నవ్వులు పూయించాడు.అయితే ఇందులో చివరకు మాత్రం రాజమౌళి ట్విస్ట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

సాయి కుమార్ సీరియస్..
ఇక చివరి రౌండ్‌లో రాజమౌళి అదృశ్యమైనట్టుగా డ్రామా ప్లే చేశారు. అలా ఎలా వెళ్లిపోతాడంటూ సుధాకర్ డైలాగ్‌లు పేల్చాడు. నువ్వే ఎక్కువగా చొరవ ఇచ్చావ్.. నీ వల్లే వెళ్లిపోయాడు.. అలా ఎలా వెళ్లిపోతాడంటూ సాయి కుమార్ కూడా ఫైర్ అయినట్టు ప్రోమోను కట్ చేశారు. కానీ చివరకు అంత సీన్ ఉండదని అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications











