గుండె బద్దలైనట్లుంది.. సుధీర్, గెటప్ శ్రీనులపై రామ్ ప్రసాద్ కామెంట్స్
బుల్లితెర ప్రేక్షకుల్లో సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను మంచి గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వీరి ముగ్గురు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన స్కిట్స్ కు అప్పట్లో యమా క్రేజ్ ఉండేది. జబర్దస్త్ లో వీరి స్కిట్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉండే వారు. దీంతో వీరి ముగ్గురు జబర్దస్త్ లో ఐకాన్ గా మారాయి. ఇక ప్రస్తుతం రామ్ ప్రసాద్ ఒక్కడే జబర్దస్త్ లో ఉన్నాడు. ఈ సందర్భంగా సుధీర్, శ్రీనుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
సుడిగాలి సుధీర్ ఇలా.. గెటప్ శ్రీను అలా..
సుడిగాలి సుధీర్ తన కెరీయర్ కారణంగా జబర్దస్త్ కామెడీ షోను వీడిన సంగతి తెలిసిందే. మరోవైపు గెటప్ శ్రీను కూడా సినిమాల్లో మంచి మంచి వేషాలు అందడంతో జబర్దస్త్ ను వీడారు. ప్రస్తుతం ఇద్దరి గురి సినిమాలపైనే ఉంది. ప్రస్తుతం గెటప్ శ్రీను కమెడియన్ గా, సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు సుడిగాలి సుధీర్ హీరోగా పలు చిత్రాల్లో నటించి ప్రస్తుతం కాస్తా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం మళ్లీ టెలివిజన్ షోలతో సందడి చేస్తున్నాడు.

సర్కార్ 5 సీజన్ 7లో..
సుడిగాలి సుధీర్ ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ రావడంతో టెలివిజన్ షోలతో సందడి చేస్తున్నాడు. ఢీ13, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్ షోతో అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డ్రామా జూనియర్స్, సర్కార్ సీజన్ 5 గేమ్ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నారు. ఇక సీజన్ 5లో 7వ ఎపిసోడ్ కు గెస్ట్ లుగా తన స్నేహితులు గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, సన్నీ హాజరయ్యారు. వీరితో కలిసి జబర్దస్త్ వేదికపై వేలల్లో కామెడీ స్కిట్లు చేసిన సంగతి తెలిసిందే.
రామ్ ప్రసాద్ భావోద్వేగం..
సర్కార్ సీజన్ 5లోని తాజాగా ఎపిసోడ్ కు హాజరైన ఆటో రామ్ ప్రసాద్ భావోద్వేగం అయ్యారు. జబర్దస్త్ లో మనం దాదాపు 10 ఏళ్లు కలిసి పనిచేశాం. ఒకరోజు మీరు వెళ్లిపోయిన తర్వాత నేను ఒక్కడినే స్టేజ్ ఎక్కాల్సి వచ్చింది. ఆరోజు నాకు గుండె బద్దలైనట్టు అనిపించింద. ఏదో శక్తి వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. మీరు లేకుంటే చాలా బాధగా ఉంది. ఎప్పటికైనా మనం ముగ్గురం కలిసి ఒక కామెడీ షో చేయాలని ఉందని చెప్పారు. అందుకు శ్రీను, సుధీర్, సన్నీ కూడా ఎమోషనల్ అయ్యారు.
సుడిగాలి సుధీర్ సినిమాలు..
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సుడిగాలి సుధీర్ వెండితెర పైన కూడా హీరోగా అలరించాడు. పదుల సంఖ్యలోని చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటించి, ఆ తర్వాత హీరోగా మారాడు. హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్, పండుగాడ్, గాలోడు, కాలింగ్ సహస్త్ర వంటి చిత్రాలతో అలరించాడు. నెక్ట్స్ గోట్ అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











