జబర్దస్త్ రీ స్టార్ట్.. యాంకర్ మంజూషకి షాక్ ఇచ్చిన అనసూయ.. హాట్ స్టిల్ వైరల్!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలు ఎప్పటిలానే షూటింగ్ లతో బిజీ అయినప్పటికీ మునుపటిలా అయితే సందడిగా కనిపించడం లేదు. సోషల్ డిస్టెన్స్ తో చాలా జాగ్రత్తగా సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇక బుల్లితెర రియాలిటీ షోలు కూడా రీ స్టార్ట్ కాబోతున్నాయి. అందులో మెయిన్ గా టాప్ కామెడీ షో జబర్దస్త్ కూడా నేడే పట్టాలెక్కింది. అయితే యాంకర్ విషయంలో వస్తున్న రూమర్స్ కి ఫైనల్ క్లారిటీ వచ్చేసింది.

టాప్ కామెడీ షో..

టాప్ కామెడీ షో..

తెలుగు టెలివిజన్ చరిత్రలో టాప్ కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో అయితే ఈ షోను ఇక బుల్లితెరపై చూడలేము అనే విధంగా టాక్ వచ్చింది. రేటింగ్ తగ్గుతుండడంతో నిర్వాహకులు షోను నిలిపివేస్తున్నట్లు కూడా టాక్ వచ్చింది. ఇక నేటితో ఆ సస్పెన్స్ కి తెర పడింది.

కొత్త యాంకర్ అన్నారు..

కొత్త యాంకర్ అన్నారు..

అలాగే జబర్దస్త్ యాంకర్ పోస్ట్ లో కొత్త యాంకర్ కనపడనున్నట్లు మొన్నటివరకు ఒక టాక్ నడిచింది. యాంకర్ మంజూష.. అనసూయా భరద్వాజ్ స్థానాన్ని లాగేసుకుందని వరుసగా కథనాలు రావడంతో ఓ వర్గం వారు నిజమే అనుకున్నారు. పైగా అనసూయ కూడా ఆ రుమర్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. ఎవరు కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో మంజూష ఎంట్రీ ఉంటుందేమో అని అనుకున్నారు.

క్లారిటీ వచ్చేసింది..

క్లారిటీ వచ్చేసింది..

కానీ అనసూయ నేడు తన సోషల్ మీడియా ద్వారా ఒక హాట్ స్టిల్ తో ఫైనల్ క్లారిటీ ఇచ్చేసింది. మేము మళ్ళీ వచ్చేశాము అంటూ గ్లామర్ డ్రెస్ లో మెలికలు తిరుగుతూ చెప్పింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మంజూష కొత్త యాంకర్ గా రనుందనే వార్తలకు ఈ దెబ్బతో క్లారిటీ వచ్చినట్లయ్యింది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
ఎంత మంది హాట్ యాంకర్స్ వచ్చినా..

ఎంత మంది హాట్ యాంకర్స్ వచ్చినా..

మంజూష అనే కాకుండా చాలా మంది యంగ్ యాంకర్స్ అనసూయా, రష్మీ స్థానాలకు ఎసరు పెట్టినట్లు టాక్ వచ్చింది. ఈ మధ్య అయితే అనసూయ లేనట్లే అని అన్నారు. కానీ ఈ హాట్ యాంకర్ మాత్రం ఎంత మంది యంగ్ యాంకర్స్ వచ్చినా కూడా తన క్రేజ్ తగ్గకుండా మంచి పోటీ ఇస్తోంది. ఎలాంటి యాంకర్ కి అయినా ఆమె పోటీని ఇవ్వగలదని ఈ వార్తతో మరో సారి నిరూపించింది.

అక్కడే ఎక్కువ షోలు..

నానక్ రామ్ గూడాలోని ఒక స్టూడియోలో జబర్దస్త్ షోను ఎప్పటిలానే స్టార్ట్ చేశారు. అతి తక్కువ మంది టెక్నీషియన్స్ తో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో మరికొన్ని రియాలిటీ షోలు రిఫ్రెష్ గా రీస్టార్ట్ కావడానికి రెడీ అయ్యాయి. ఎక్కువగా బుల్లితెర షోలు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. ఇక జబర్దస్త్ కామెడీ షో ఫ్రెష్ ఎపిసోడ్స్ మరికొన్ని రోజుల్లో ఈటివిలో ఎప్పటిలానే టెలిక్యాస్ట్ కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X