For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్ రీతూ ఇంట్లో పెను విషాదం: ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి దూరం.. పెళ్లికి ముందే దారుణం!

  |

  ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో రీతూ చౌదరి ఒకరు. టెలివిజన్ రంగంలో సుదీర్ఘ కాలంగా తనదైన శైలిలో సందడి చేస్తోన్న ఈ బ్యూటీ.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రీతూ చౌదరి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆమెకు ప్రాణానికి ప్రాణమైన వ్యక్తం దూరం అయ్యారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

  వరుస సీరియళ్లు.. పెళ్లి చూపులు

  వరుస సీరియళ్లు.. పెళ్లి చూపులు


  నటిగా మారడానికి ముందే రీతూ చౌదరి యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో నటిగా ప్రయాణం మొదలెట్టింది. ఆ తర్వాత 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లు చేసింది. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ మాచిరాజు 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా వచ్చింది. ఆ దెబ్బతో ఫుల్ ఫేమస్ అయిపోయింది.

  పైట తీసేసి పచ్చిగా హీరోయిన్ ఫోజులు: ఉప్పొంగిన అందాలతో రెచ్చగొడుతూ!

   జబర్ధస్త్ ఎంట్రీతో ఫుల్ పాపులర్

  జబర్ధస్త్ ఎంట్రీతో ఫుల్ పాపులర్


  యాంకర్‌గా, బుల్లితెర నటిగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే రీతూ చౌదరి.. ఆ మధ్య ఫేమస్ షో జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి యమ గుర్తింపు తెచ్చుకుంది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. అప్పటి నుంచి అదే ఛానెల్‌లో వరుసగా షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది. దీంతో రీతూ చౌదరి మరింతగా పాపులర్ అయింది.

  రీతూ చౌదరి ఇంట్లో దుర్ఘటనతో

  రీతూ చౌదరి ఇంట్లో దుర్ఘటనతో


  తెలుగు బుల్లితెరపై బిజీ ఆర్టిస్టుగా సత్తా చాటుతోన్న రీతూ చౌదరి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె ప్రాణానికి ప్రాణమై తండ్రి అనారోగ్య కారణాలతో సోమవారం మరణించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు తండ్రితో తీసుకున్న ఓ ఫొటోను కూడా రీతూ చౌదరి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

  Suhana Khan: అందాల ఆరబోతతో షారుఖ్ కూతురు రచ్చ.. షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా!

  ఈ ఫొటో ఇలా చేస్తాననుకోలేదు

  ఈ ఫొటో ఇలా చేస్తాననుకోలేదు


  తన తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన విషయాన్ని బుల్లితెర నటి రీతూ చౌదరి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు తన తండ్రితో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. 'ఐ మిస్ యూ డాడీ. ఈ పిక్చర్ తీసుకునేటప్పుడు నేను ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నీతో ఇదే చివరి ఫొటో నాన్న' అంటూ చెప్పుకొచ్చింది.

  నువ్వు లేకుండా నేనుండలేను

  నువ్వు లేకుండా నేనుండలేను


  అంతేకాదు, ఇదే పోస్టులో రీతూ చౌదరి 'నన్ను ఎలా వదిలి వెళ్లిపోయావ్ నాన్న? నువ్వు లేకుండా నేను ఉండలేను డాడీ. ప్లీజ్ నీ కూతురు దగ్గరకు తిరిగి రా నాన్న' అంటూ ఎమోషనల్ అయిపోయింది. ఇక, రీతూ చౌదరి తన తండ్రిని కోల్పోయిందన్న వార్త బుల్లితెర వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పాలి. దీంతో ఆమెకు ప్రముఖులంతా ధైర్యం చెప్తున్నారు.

  ఆమెను ఓదార్చుతూ పోస్టులు

  ఆమెను ఓదార్చుతూ పోస్టులు


  తన తండ్రి మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న జబర్ధస్త్ భామ రీతూ చౌదరికి ఆమె ఫాలోవర్లు బాసటగా నిలుస్తున్నారు. ఈ మేరకు ఆమెను ఓదార్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో రీతూ చౌదరి తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో కామెంట్లను చేస్తున్నారు.

  ప్రేమలో రీతూ.. పెళ్లికి ముందే

  ప్రేమలో రీతూ.. పెళ్లికి ముందే


  రీతూ చౌదరి రియల్ లైఫ్‌లో పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్ అయిన శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని బుల్లితెర వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాదు, త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రీతూ చౌదరి తండ్రి మరణించారు. ఇక, ఆయన ఎలా కన్నుమూశారు అనే విషయం మాత్రం తెలియలేదు.

  English summary
  Jabardasth Fame Rithu Chowdary Passed Away Due To Health Issues. Now She Post Emotional Note On This Incident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X