Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Jabardasth: పొట్టి నిక్కరులో దిమ్మతిరిగేలా చేసిన లేడి కమెడియన్ రీతూ.. ఈ యాంగిల్ అరాచకం!
జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకొని సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటున్న వారు ఇప్పుడిప్పుడే ఆ షోకు దూరమవుతున్నారు. ఇక మరికొందరు మాత్రం వారి స్థాయిని పెంచుకునే విధంగా జబర్దస్త్ లోనే అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక జబర్దస్ ద్వారా మంచి గుర్తింపును అందుకున్న లేడీ కమెడియన్సులో రీతూ చౌదరి ఒకరు. తన టైమింగ్ తో అలాగే ఊహించని లవ్లీ స్కిట్స్ తో ఎంతగానో ఆకట్టుకున్న రీతూ గ్లామర్ విషయంలో కూడా షాక్ ఇస్తుంది అని ఎవరు ఊహించలేదు. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
మొదట ప్రదీప్ షోతో ఎంట్రీ
జబర్దస్త్ కంటే ముందు రీతూ కొన్ని రియాల్టీ షో లలో ప్రత్యేకతగా అతిథిగా వచ్చి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా అప్పట్లో యాంకర్ ప్రదీప్ నిర్వహించిన పెళ్లిచూపులు ప్రోగ్రాం ద్వారా మొదటిసారి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. అంతకంటే ముందు. మోడల్ గా అడుగులు వేసిన ఆమె ప్రదీప్ షో ద్వారా టెలివిజన్ రూట్లో కాస్త బిజీ అయ్యే ప్రయత్నం చేసింది.
జబర్దస్త్ లో బిజీగా..
యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు అనంతరం ఆమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. అలాగే చిన్న తరహా సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ఇక జబర్దస్త్ లో కూడా రీతూ కొన్నాళ్లపాటు బాగానే బిజీగా మారిపోయింది. హైపర్ ఆది టీమ్ లో ఆమె చేసిన కామెడీ స్కిట్స్ కు కూడా మంచి స్పందన లభించింది.
స్టేజ్ పైనే ఐ లవ్ యూ
రీతు చౌదరి కేవలం కామెడీని మాత్రమే కాకుండా మధ్య మధ్యలో ప్రేమ వ్యవహారాలు అంటూ చేసిన హడావిడి కూడా ఆమెకు కొంత హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా జబర్దస్త్ లో ఉన్న అజర్ తో ఆమె చేసిన హడావిడి అంతా కాదు. ఒకసారి స్టేజ్ పైన ఏకంగా కౌగిలించుకొని మరి ప్రేమగా కనిపించింది. దీంతో ఆ ఎపిసోడ్ బాగా వైరల్ అయింది. అంతేకాకుండా చాలాసార్లు ఆదికి కూడా ఐ లవ్ యు చెప్పింది.
అన్ని రకాల షోలతో..
ఇక జబర్దస్త్ ద్వారానే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా రీతూ చౌదరి తన కామెడీ టైమింగ్ తో బాగానే పాపులర్ అయింది. ఒక్క షో మాత్రమే అని కాకుండా అలాగే ఒక్క టీమ్ అని కాకుండా అందరితోనూ చాలా సరదాగా కామెడీ చేసుకుంటూ వెళ్లిన రీతూ చాలా బిజీగా మారిపోయింది. ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరొకవైపు టెలివిజన్ రంగంలో కూడా ఆమె నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది.
లెగ్స్ అందాలతో షాక్
ఇక రీసెంట్ గా రీతూ చౌదరి ఎవరు ఊహించని గ్లామర్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోయింది. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక పొట్టి నిక్కర్ లో కనిపించిన విధానం షాక్ కు గురి చేసింది. లెగ్స్ అందాలతో కుర్రాళ్ల మతి పోగొట్టేసింది అనే చెప్పాలి.
బ్యూటీఫుల్ స్టిల్స్
ఒక బీచ్ లో అలా పొట్టి జీన్స్ లో అలాగే టీ షర్ట్ లో నవ్వుతూ కనిపించిన రీతూ చౌదరి హాలిడేస్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలియజేసింది. చాలా అందంగా ఉంది అని కూడా కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక రీతూ చౌదరి జబర్దస్త్ షోలు మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే ఫెస్టివల్స్ సమయంలో కొన్ని స్పెషల్ షోలలో కూడా గెస్ట్ రోల్స్ లో కనిపించి హైలెట్ గా నిలుస్తుంది.