జబర్ధస్త్ రీతూ చౌదరి హాట్ వీడియో వైరల్: తండ్రి చనిపోయిన వారానికే ఇలాంటివా!

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది అమ్మాయిలు తనదైన శైలిలో అలరిస్తూ హైలైట్ అయ్యారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. అలాంటి వారిలో రీతూ చౌదరి ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంటరైన చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిన ఈ చిన్నది వరుసగా షోల మీద షోలు చేస్తూ దూసుకుపోతోంది. కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలోనే ఇటీవలే రీతూ చౌదరి తన తండ్రిని కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ వీడియోను షేర్ చేసింది. దీంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. హైలైట్‌గానే

అలా పరిచయం.. హైలైట్‌గానే

రీతూ చౌదరి స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా ఎంటరైంది. ఈ క్రమంలోనే కొన్ని షోలు, సినిమాల్లోనూ నటించింది. అనంతరం 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంటరై 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లు చేసింది. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా వచ్చింది. దీనివల్ల రీతూ యమ హైలైట్ అయిపోయింది.

జబర్ధస్త్‌ ఎంట్రీ.. మరింత క్రేజ్

జబర్ధస్త్‌ ఎంట్రీ.. మరింత క్రేజ్

సుదీర్ఘ కాలంగా యాంకర్‌గా, బుల్లితెర నటిగా ప్రేక్షకులను అలరించిన రీతూ చౌదరి.. ఆ మధ్య ఫేమస్ షో జబర్ధస్త్‌లోకి ఎంటరైంది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే, షోలో లవ్ ట్రాకుతోనే ఈ చిన్నది బాగా హైలైట్ అయింది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుని.. అప్పటి నుంచి అదే ఛానెల్‌లో వరుసగా షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది.

ప్రేమలో మునిగి తేలుతోందిగా

ప్రేమలో మునిగి తేలుతోందిగా

జబర్ధస్త్ రీతూ చౌదరి రియల్ లైఫ్‌లో పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్ అయిన శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక, పర్సనల్‌ లైఫ్‌ను కూడా ఈ అమ్మడు బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ హాలీడే ట్రిప్‌లకు కూడా చెక్కేస్తోంది.

తండ్రిని కోల్పోయిన బ్యూటీ

తండ్రిని కోల్పోయిన బ్యూటీ

తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతోన్న రీతూ చౌదరి ఇంట్లో వారం రోజుల క్రితమే పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె ప్రాణానికి ప్రాణమై తండ్రి అనారోగ్య కారణాలతో సోమవారం మరణించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు తండ్రితో తీసుకున్న ఓ ఫొటోను కూడా రీతూ చౌదరి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

తెలుగు బుల్లితెరపై వరుసగా సీరియళ్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా యమ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ దూసుకుపోతోంది.

హాట్ వీడియో షేర్ చేసింది


సోషల్ మీడియాలో తనదైన రీతిలో రెచ్చిపోతోన్న రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్, థైస్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రీతూ ఓ హాట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

అప్పుడే ఇలాంటివా అంటూ

అప్పుడే ఇలాంటివా అంటూ

రీతూ చౌదరి తాజాగా బ్లాక్ కలర్ ట్రాన్స్‌పరెంట్ శారీలో తీసుకున్న హాట్ వీడియోను వదిలింది. దీంతో 'మీ నాన్నను మొన్ననే కదా పోగొట్టుకున్నావు.. అప్పుడే ఇలాంటి వీడియోలా' అంటూ కొందరు ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అది ఆమె ప్రొఫెషన్ అంటూ రీతూ చౌదరికి సపోర్ట్ చేస్తోన్నారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X