నా భర్తతో తెగతెంపులు చేసుకొన్నా.. భర్తతో డైవోర్స్‌‌పై రీతూ చౌదరీ హాట్ కామెంట్స్

జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టు కనిపిస్తున్నది. ఆంధ్రాలో జరిగిన భారీ భూ కుంభకోణంలో ఆమె పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు నమోదు చేయడంతో ఆమె విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారుగా 700 కోట్ల రూపాయల మేర కుంభకోణంలో ఇరుక్కొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె తాజాగా ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. రీతూ చౌదరీ చెప్పిన సంచలన విషయాల్లోకి వెళితే..

జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరీ వెల్లడించిన ప్రకారం.. చీమకుర్తి శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత అతడి గురించి చాలా విషయాలు నా దృష్టికి వచ్చాయి. అప్పటికే ఆయనకు పెళ్లి జరిగిందని తెలిసింది. అయితే ఆ విషయంపై మా మధ్య చాలా మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. రెండు రోజులు కలిసి ఉంటే.. 6 నెలలు విడిపోయే వాళ్లం అని చెప్పారు.

Jabardasth Ritu Chowdary open up on Divorce with Husband amid 700 Crores Land Scam in Andhra

ఇక భూ కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రెండు ప్లాట్స్ నా పేర పవర్ ఆఫ్ అటార్నీ శ్రీకాంత్ రాశాడు. వాటి విలువ కేవలం 4 కోట్ల రూపాయలు మాత్రమే. 700 కోట్ల రూపాయలు అని బయటకు రావడంతో అందరూ నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. అంత డబ్బు ఏం చేశావని ప్రశ్నిస్తున్నారు. అయితే అంత డబ్బు ఉంటే నాకు ఇలాంటి ఖర్మ ఏం పడుతుంది అని రీతూ చౌదరీ అన్నారు.

శ్రీకాంత్‌కు నాకు చాలానే గొడవలు అయ్యాయి. నాపై శారీరకంగా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్ల కొట్టడం కూడా జరిగింది. చాలా విషయాలు దృష్టిలో పెట్టుకొని విడిపోయాం. డైవోర్స్‌కు కోర్టులో దరఖాస్తు చేసుకొన్నాం. ఇప్పుడు ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏసీబీ, ఇతర దర్యాప్తు సంస్థల విచారణకు హాజరవుతాను అని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

Jabardasth Ritu Chowdary open up on Divorce with Husband amid 700 Crores Land Scam in Andhra

ఇదిలా ఉండగా, రీతూ చౌదరీ భర్త శ్రీకాంత్ కూడా తమ డైవోర్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం విడాకుల కోసం అప్లై చేసుకొన్నాం. ప్రస్తుతం వేర్వేరుగా జీవిస్తున్నాం. నాకు సినిమా పరిశ్రమలో చాలా మంది సంబంధాలు ఉన్నాయి. అవన్నీ రీతూ చౌదరీ కారణంగా రిలేషన్స్ ఏర్పడ్డాయి. అందులో కొందరు అన్నయ్య పిలుస్తారు అని చెప్పారు.

రీతూ చౌదరీ విషయానికి వస్తే.. జబర్దస్త్ ద్వారా పరిచయమైన రీతూ టెలివిజన్, సినిమా రంగంలో రాణిస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని సినిమాల్లో తనదైన రీతిలో నటించారు. మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే 700 కోట్ల కుంభకోణంలో ఆమె పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది.

More from Filmibeat

Read more about: ritu chowdary divorce jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X