For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాకింగ్ రాకేష్ కు అందరి ముందు ముద్దు పెట్టేసిన జోర్డార్ సుజాత.. నిజమైన ప్రేమ అంటూ..

  |

  జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకుంటున్న కమెడియన్స్ కొంతమంది వారితో ఉండే లేడీ కమెడియన్స్ తోనే ప్రేమలో పడుతున్నట్లు అనేక రకాల స్టోరీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక వాటికి ఆజ్యం పోస్తూ ఆ కమెడియన్స్ కూడా వార్తలను అడ్వాంటేజ్ గా వాడుకుంటారు. వీలైనంత ఎక్కువగా రియాలిటీ షోలలో ప్రేమ వ్యవహారాలను హైలెట్ చేస్తూ రేటింగ్స్ అందుకుంటూ ఉంటారు. ఇక జోర్దార్ సుజాత రీసెంట్ గా తన ప్రేమను ఏకంగా ముద్దుతో బయట పెట్టడం వైరల్ గా మారింది. వారికి సంబంధించిన ఫోటోలు వీడియో లు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  పెళ్లి కూడా..

  పెళ్లి కూడా..

  జబర్దస్త్ షోలో ఒకప్పుడు కేవలం కామెడీ తో మాత్రమే ఆర్టిస్టులు ఎక్కువగా క్రేజ్ అందుకునే వారు. కానీ ఆ తర్వాత రష్మీ గౌతమ్ వర్ష లాంటి వారి గ్లామర్ షో తో పాటు కమెడియన్స్ ప్రత్యేకంగా కెమిస్ట్రీని కొనసాగిస్తున్నట్లు కవరింగ్ ఇచ్చారు. ఇక పంచ్ లలోనే రొమాంటిక్ డైలాగ్స్ మరొక విధంగా కూడా వైరల్ అయ్యేవారు. ముఖ్యంగా రష్మీ సుడిగాలి సుదీర్ మధ్యలో ఏదో కొనసాగుతోంది అని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

   నిజంగానే ప్రేమ ఉందా?

  నిజంగానే ప్రేమ ఉందా?

  అయితే అవన్నీ కూడా అబద్ధాలే అయినప్పటికీ కూడా ఆర్టిస్టులు దాన్నే అతిపెద్ద అడ్వాంటేజ్ గా తీసుకోవడం విశేషం. ఏకంగా కొన్ని సార్లు ప్రత్యేకమైన షోలలో రొమాంటిక్ సాంగ్స్ డైలాగ్స్ తో కూడా ఆకట్టుకోవడంతో షోలకు భారీ స్థాయిలో రేటింగ్స్ కూడా వస్తున్నాయి. ఇక వారి మధ్యలో ప్రేమ ఉందా పెళ్లి చేసుకుంటున్నారా అనే విషయాల్లో మాత్రం బయట ఎక్కడా కూడా పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు.

  రాకేష్, సుజాత లవ్?

  రాకేష్, సుజాత లవ్?

  జబర్దస్త్ లో ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రేమ పక్షులుగా హైలైట్ అవుతున్న వారిలో జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ కూడా టాప్ లిస్టులో ఉన్నారు అని చెప్పవచ్చు. వీరు కామెడీ స్కిట్ లో మాత్రమే కాకుండా బయట మరికొన్ని షోలలో కూడా చాలా ఎమోషనల్ లవ్ బాండింగ్ తోనే కనిపిస్తూ ఉంటారు. ఇక ఆ మధ్యకాలంలో రాకింగ్ రాకేష్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనది ప్రేమ కాదు అంతకంటే ఎక్కువ బంధం అని కూడా చెప్పడంతో వీరి మధ్య నిజంగానే ప్రేమ ఉంది అని అందరూ అనుకుంటున్నారు.

  జీవితాంతం కలిసి ఉండే ప్రేమ..

  జీవితాంతం కలిసి ఉండే ప్రేమ..

  ఇక రీసెంట్ గా మరొక స్పెషల్ షో లో కూడా రాకింగ్ రాకేష్ జోర్డార్ సుజాత ప్రేమ వివాహం మరింత హైలెట్ గా నిలిచింది. శ్రావణ సందడి షోలో వీరిద్దరూ స్పెషల్ జోడిగా పాల్గొనగా ఒకరి ప్రేమ గురించి మరొకరు విభిన్నంగా తెలియజేశారు. మాది ప్రమోషన్స్ కోసం పుట్టిన ప్రేమ కాదు అంటూ రాకింగ్ రాకేష్ జీవితాంతం కలిసి ఉండే ప్రేమ అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

  Recommended Video

  కార్తికేయ 2 తో చందు మొండేటి సక్సెస్ అయ్యాడా? *Reviews | Telugu OneIndia
  ముద్దు పెట్టిన సుజాత

  ముద్దు పెట్టిన సుజాత

  అయితే రాకింగ్ రాకేష్ మాటలు విన్న సుజాత స్టేజ్ పైనే చాలా ఎమోషనల్ గా దగ్గరికి వచ్చి కౌగిలించుకుంది. అంతేకాకుండా నుదుటిపై ముద్దు కూడా పెట్టి తన ప్రేమను తెలియజేసింది. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. చూస్తూ ఉంటే సుజాత రాకింగ్ రాకేష్ ప్రేమ మాత్రం చాలా నిజమే అని కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ జంట నిజంగానే ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదంటే కేవలం షో కోసం మాత్రమే ఇలా కొనసాగుతునారా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

  English summary
  Jabardasth rocking rakesh and jordar sujatha love track in Sravana sandadi show
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X