రేవ్ పార్టీలో నటి రోహిణి అరెస్ట్.. హేమ డ్రగ్ పార్టీ తరహాలోనే..

రోజులు గడుస్తున్నా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఘటన టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయగా.. తెలుగు, కన్నడ పరిశ్రమలకు చెందిన నటీనటులు, ఇతర ప్రముఖులు అడ్డంగా బుక్కయ్యారు. ఈ లిస్ట్‌లో నటి హేమ కూడా ఉన్నారు. పోలీసులకు దొరికిపోయాక కూడా తాను స్పాట్‌లో లేనని, హైదరాబాద్‌లో ఎంజాయ్ చేస్తున్నానను, బిర్యానీ వండుతున్నానని ఏవేవో వీడియోలు రిలీజ్ చేసి మీడియాను, సమాజాన్ని తప్పుదోవ పట్టించింది. చివరికి బెంగళూరు పోలీసులు జోక్యం చేసుకుని హేమ తమ అదుపులోనే ఉందని చెప్పుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. రేవ్ పార్టీకి హేమ హాజరైనట్లుగా ఆధారాలతో సహా విడుదల చేశారు అధికారులు. తీరా రేవ్ పార్టీకి హాజరైన వారి రక్త నమూనాలను పరీక్షించగా హేమకు పాజిటివ్‌గా తేలింది. దీంతో తన డ్రామాలను పక్కనబెట్టి సైలెంట్ అయ్యింది హేమ.

ఈ ఎపిసోడ్‌తో హేమపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ పరువు తీసిందంటూ నెటిజన్లు, సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. అయినప్పటిప్పటికీ మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం ఆమెకు అండగా నిలిచారు. దోషిగా తేలేవరకు ఆమె నిర్దోషేనని.. ఆమెపై అనవసరంగా దుష్ప్రచారం చేయొద్దని మీడియాను విష్ణు కోరాడు. ఖచ్చితమైన ఆధారాలను అందజేస్తే అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందని విష్ణు స్పష్టం చేశారు. దీంతో హేమను వెనకేసుకొచ్చినందుకు ఆయనపైనా ట్రోలింగ్ నడిచింది.

jabardasth rohini caught in a rave party video has gone viral

ఇక పార్టీలో దొరికిపోయినా పోలీసుల విచారణకు సహకరించలేదు హేమ. తమ ఎదుట హాజరవ్వాలని రెండు సార్లు నోటీసులు ఇచ్చినా హేమ స్పందించకపోవడంతో బెంగళూరు పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి మరి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హేమను అనేకల్‌లోని నాలుగో అదనపు సివిల్, జేఎంఎఫ్‌సీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్ట్ ఆమెకు కస్టడీ విధించగా ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు పంపించారు. కొద్దిరోజుల తర్వాత హేమ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో మీడియాతో ఆమె వ్యవహారశైలి ఏమాత్రం బాలేదు. రేవ్ పార్టీపై అనేక కథనాలు రాశారని, అసలేం జరిగిందో మీకే తెలియాలంటూ మండిపడ్డారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని.. వెంట్రుకలు, గోళ్లు, బ్లడ్ శాంపిల్స్‌ను స్పాట్‌లో తీసుకోలేదని ఇప్పుడే తీసుకున్నారంటూ హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హేమ ఇష్యూ సద్దుమణగకముందే మరో టాలీవుడ్ నటి రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కయ్యారు. జబర్దస్త్ ఫేమ్ రోహిణి ఓ రేవ్ పార్టీ హాజరై దొరికిపోయిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా.. మైకులు పట్టుకుని విలేకరులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి రోహిణి బదులిస్తూ తనకేం సంబంధం లేదని, బర్త్ డే పార్టీ ఉందంటే వచ్చానని పేర్కొంది. అయినప్పటికీ మీడియా ప్రతినిధులు వదిలిపెట్టకుండా.. మీకు పాజిటివ్ వచ్చింది కదా అని ప్రశ్నిస్తారు. దానికి రోహిణి.. నాకు టెస్టులే చేయలేదు పాజిటివ్ ఎలా వచ్చిందని ఎదురు ప్రశ్నిస్తుంది. అనంతరం ఎన్ఆర్ఐ బర్త్ డే పార్టీ అనగానే వెనుక ముందు చూడకుండా రాకూడదంటూ బోరున ఏడుస్తుంది.

అయితే వీడియో చూసిన ఎవరికైనా అది ఫ్రాంక్ అని అర్ధమైపోతుంది. నెటిజన్లయితే .. హేమ ఇన్సిడెంట్‌ను గుర్తుకు తెచ్చేలా పర్ఫెక్ట్‌గా స్పూఫ్ దించారని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే హేమను అవమానించారంటూ భగ్గుమంటున్నారు. ఓ మూవీ ప్రమోషన్ కోసం రోహిణి ఇలా చేసినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై హేమ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X