Rowdy Rohini: ఆస్పత్రి బెడ్‌పై జబర్దస్త్ రోహిణి.. ఆపరేషన్ చేసుకోవాల్సింది కాదంటూ ఆవేదన!

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వినోదాన్ని పంచుతూ తెలుగు ప్రేక్షకులకు అలవాటుగా మారిపోయింది. ఇక ఈ షో ద్వారా మోస్ట్ పాపులర్ అయినవాళ్లలో ఎంతోమంది ఉన్నారు. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ ద్వారా వివిధ షోలలో, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ సినీ రంగంలో తమ కెరీర్ ను పదిలం చేసుకుంటున్నారు. జబర్దస్త్ షోలో లేడి కమెడియన్స్ కూడా మంచి పేరు తెచ్చుకున్న వాళ్లు ఉన్నారు. వాళ్లలో ఒకరే రోహిణి. ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తూ వినోదాన్ని పంచుతున్న రోహిణి తాజాగా హాస్పిటల్ బెడ్ పై ఊహించని విధంగా కనిపించింది.

హాస్య నటీమణులు: తెలుగులో లేడి కమెడియన్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మొన్నటివరకు అయితే సినిమాల్లో ఎక్కువగా కోవై సరళ పేరు వినిపించేది. ఇప్పుడు బుల్లితెరపై మాత్రం అనేకమంది హాస్య నటీమణులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా అనేకమంది లేడీ కమెడిన్స్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

Rowdy Rohini

చాలా పాపులర్: జబర్దస్త్ లోకి కేవలం ఎంట్రీ ఇవ్వడం కాకుండానే తమ కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఈ షో ద్వారా ఇప్పటికీ ఎంతోమంది కమెడియన్స్ లైమ్ లైట్ లోకి వచ్చారు. కొంతమంది అయితే సినిమా హీరోలు కూడా అయ్యారు. మరికొంతమంది నిర్మాతలు, రైటర్స్, డైరెక్టర్స్ గా మారారు. ఇలా జబర్దస్త్ నుంచి లేడి కమెడియన్స్ గా రోహిణి కూడా చాలా బాగా పాపులర్ అయ్యారు.

Rowdy Rohini

సినిమాల్లో కూడా: జబర్దస్త్ లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి తర్వాత టీమ్ లీడర్ రౌడీ రోహిణిగా (Rowdy Rohini) మారి మరంత వినోదాన్ని పంచింది. అలాగే వివిధ షోలలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సినిమాల్లో కూడా సత్తా చాటుతోంది. బలగం మూవీ, సేవ్ ది టైగర్స్ వంటి సినిమాలు, వెబ్ సిరీసులలో తన కామెడీతో అలరిస్తోంది.

Rowdy Rohini

షాకింగ్ విషయం: అయితే సీరియళ్ల ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన రోహిణికి 2016లో యాక్సిడెంట్ అయింది. అప్పుడు డాక్టర్స్ ఆమె కాలికి రాడ్ వేశారు. నటిగా బిజీగా ఉండటంతో ఆ రాడ్ ను అప్పుడు తొలగించలేదు. ఈ మధ్య టీవీ డ్యాన్స్ షోలలో డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆమెకు కాలిలో నొప్పి మొదలైంది. దీంతో వైద్యులను సంప్రదించింది రోహిణి. అయితే డాక్టర్స్ ఆమెకు షాకింగ్ విషయం చెప్పారు.

ఎముక విరిగిపోతుంది: యాక్సిడెంట్ సమయంలో అమర్చిన రాడ్ ను తొలగించలేకపోయారట డాక్టర్స్. ఒకవేళ బలవంతంగా తొలగించాలని ప్రయత్నిస్తే ఎముక విరిగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఆ రాడ్ ను తొలగించకపోవడమే మంచిదని వారు సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని తాజాగా యూట్యూబ్ వీడియోలో పంచుకుంది రోహిణి.

Rowdy Rohini

బయటకు నవ్వుతున్నా: ప్రస్తుతం షోస్, సినిమా ఛాన్సులతో బిజీగా ఉన్నాను. కాలిలోని రాడ్ ను తీసేయించుకుంటే బాగుంటుందని ఆపరేషన్ వరకు వచ్చాను. అనవసరంగా ఆపరేషన్ చేసుకున్నా. ఇప్పుడు మళ్లీ కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రాడ్ బయటకు రాలేదు. ఆఫర్స్ ఉన్నప్పుడు ఇలా గ్యాప్ రావడం అనేది చాలా ఇబ్బందికరం. బయటకు నవ్వుతున్నా లోపల చాలా బాధగా ఉంది అని తన ఆవేదన చెప్పుకొచ్చంది జబర్దస్త్ రోహిణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X