స్టార్ ప్రొడ్యూసర్‌తో జబర్దస్త్ రోహిణి ప్రేమాయణం.. స్టేజీ మీదకు తీసుకొచ్చి రివీల్ చేసిన నటి!
జబర్దస్త్ లేడీ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోహిణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన ఈమె కమెడియన్ గా అనేక టీవీ షోలు చేయడంతో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రేమాయణం గురించి బయట పెట్టింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది. అతడు ఎవరు, ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్ కామెడీ షోతో యమా క్రేజ్ సంపాధించుకున్న ముద్దుగుమ్మ రోహిణి అంటే చాలా మందికి ఇష్టం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు చాలా మందే అభిమానులు ఉన్నారు ముఖ్యంగా తన కామెడీ, మాటతీరుతో అందరినీ మెప్పించిన ఈమె అతి తక్కువ కాలంలోనే టీమ్ లీడర్ గా మారింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ముఖ్యంగా సేవ్ ది టైగర్స్ లో పనిమనిషిగా కనిపించి తెగ అలరించిన ఈమె.. ఇటీవలే హనుమాన్ సినిమాలోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గోపీచంద్ హీరోగా వచ్చిన భీమా సినిమాలో నటించింది. హర్ష దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మలు నటించగా... వెన్నెల కిషోర్, నాజర్, నరేష్, పూర్ణ, రఘుబాబు, చమ్మక్ చంద్ర, నిహారిక వంటి వాళ్లు కూడా కీలక పాత్రలో కనిపించారు. అలాగే కేకే రాధామోహన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అయితే మార్చి 1వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా టీం.. తాజాగా సుమ అడ్డ అనే ఓ షోకు వచ్చారు.
గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, రోహిణిలతో పాటు ఈ సినిమా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ కూడా వచ్చారు. అయితే ఈ సందర్భంగానే చిత్రబృందం గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వగా.. సుమ అనేక ప్రశ్నలు అడుగుతూ అలరించింది. ముఖ్యంగా షో మధ్యలో ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ ప్రేమ గురించి తెలుసుకోవాలని ఉందంటూ చెప్పింది. అయితే పక్కనే ఉన్న రోహిణి... తనను కూడా అడగాలని చెప్పింది. సరే నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అని సుమ అడగగ్గానే.. రాధామోహన్ మొహం చూస్తూ ఉన్నారని చెప్పింది.

ఇక ఆ తర్వాత తనకోసం రాధామోహన్ కాలేజీ, స్కూల్ రోజుల్లో తన వెంట పడి తిరిగే వాడంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆయనతో కలిసి ఓ పాత పాటకు స్టెప్పులు వేసింది. కేకే రాధామోహన్ తన ప్రియుడు అన్నట్లుగా ఈ షోలే కామెంటలు చేస్తూ కామెడీ చేసింది. అయితే ఆమె చేసిందే కామెడీ పర్ససే అయినప్పటికీ.. స్టార్ ప్రొడ్యూసర్ తోనే లవ్ ట్రాక్ అనడంతో వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయింది. ఈ షో కోసం స్టార్ ప్రొడ్యూసర్ కు లవర్ గా మారింది రోహిణి.


Click it and Unblock the Notifications











