Jabardasth Rohini: "అతడే నా జీవితాన్ని నాశనం చేశాడు.. పెళ్లి చేసుకోకపోతే అస్సలే ఊరుకోను"

జబర్దస్త్ లేడీ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోహిణి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన ఈమె కమెడియన్ గా అనేక టీవీ షోలు చేయడంతో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన జీవితాన్ని ఓ వ్యక్తి నాశనం చేశాడని స్టేజీమీదే చెప్పుకొచ్చింది. అతడు పెళ్లి చేసుకోకపోతే అస్సలే ఊరుకోను అంటూ తెలిపింది. మరి రోహిణిని మోహం చేసిన అతడు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జబర్దస్త్ కామెడీ షోతో యమా క్రేజ్ సంపాధించుకున్న ముద్దుగుమ్మ రోహిణి అంటే చాలా మందికి ఇష్టం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు చాలా మందే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తన కామెడీ, మాటతీరుతో అందరినీ మెప్పించిన ఈమె అతి తక్కువ కాలంలోనే టీమ్ లీడర్ గా మారింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ముఖ్యంగా సేవ్ ది టైగర్స్ లో పనిమనిషిగా కనిపించి తెగ అలరించిన ఈమె.. ఇటీవలే హనుమాన్, భీమా సినిమాల్లోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది.

Jabardasth Rohini Sensational Comments on Her Personal Life Check Details

అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈమె తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తన జీవితాన్ని ఓ వ్యక్తి నాశనం చేశాడని చెప్పుకొచ్చింది. తనకు ఉపాధి కూడా లేకుండా చేసిన అతడే తనను పెళ్లి చేసుకోవాలని.. అప్పుడే తన జీవితం బాగు పడుతుందని కూడా వివరించింది. అయితే ఆమెకు మద్దతుగా.. యాంకర్ రష్మి కూడా నిలిచింది. అంతేకాకుండా హీరోయిన్ ఇంద్రజ కూడా అండగా ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే రోహిణి జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరో కాదు. అతడు కూడా ఓ కమెడియన్ యే.

తాజాగా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఈ తతంగం అంతా జరిగింది. అయితే రోహిణి లైఫ్ ను నాశనం చేసింది.. కమెడియన్ హైపర్ ఆదియేనని ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి ఓ స్కిట్ చేశారు. అందులో బుగ్గలు, ఐస్ క్రీమ్ లు అమ్ముకునే మహిళగా.. రోహిణి కనిపించింది. అలా చిన్న పిల్లల వద్ద అన్నీ అమ్ముకుంటూ ఆమె కామెడీ చేయగా.. హైపర్ ఆది తిట్టినట్లు పంచులు వేశాడు. అలా చేస్తే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని రోహిణి చెప్పగా... 200 ఇస్తూ మరీ ఆమెపై కామెంట్లు చేశాడు.

Jabardasth Rohini Sensational Comments on Her Personal Life Check Details

ఆమె తన వద్ద ఉన్న వస్తువులు అమ్మిన ప్రతీసారి హైపర్ ఆది ఏదో ఒకటు అంటుండడం చూపించారు. ఇలా అతడు తన పొట్టపై కొట్టాడని, తనను ఏమీ అన్నుకోనివ్వట్లేదని చెప్పుకొచ్చింది. ఇలా తన ఉపాధిని దూరం చేసి, తన జీవితాన్ని హైపర్ ఆది నాశనం చేశాడని తెలిపింది. అతడు తనను పెళ్లి చేసుకుని తన జీవితం బాగు చేయాలని కోరింది. అయితే యాంకర్ రష్మితో పాటు ఇంద్రజలు కూడా రోహిణికి అండగా నిలిచారు. నీకు సాయంగా మేముంటామని.. ఆది నిన్ను పెళ్లి చేసుకునేలా చూస్తామని చెప్పారు. ఇలా ఫన్నీ ఫన్నీగా సాగిందీ షో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X