కమెడియన్లకు విలువ లేదా? ఇమ్మూ ఎలిమినేషన్‌పై రోహిణి షాకింగ్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) గ్రాండ్ ఫినాలే వేళ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ లో టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడని, టైటిల్ కోసం చివరి వరకు పోటీపడతాడని భావించిన జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ (Immanuel) నాలుగో స్థానంతో ఎలిమినేట్ అయినట్టు లీక్స్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపగా, ఇదే అంశంపై కమెడియన్ రోహిణి ( Rohini) చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఏమన్నారంటే..?

బిగ్‌బాస్ అంటే కేవలం గొడవల షో కాదు.. అది ఫుల్ ప్యాకేజ్ ఎంటర్‌టైన్‌మెంట్. కేవలం టాస్కులు, కాంట్రవర్సీలు, ఆర్యూమెంట్స్ మాత్రమే కాదు.. నవ్వులు, ఎమోషన్స్ ఉంటేనే షో ఎంటర్టైన్ గా మారుతుంది. ఇక్కడే కమెడియన్ పాత్ర కీలకం. కుటుంబ ప్రేక్షకుల నుంచి పిల్లల వరకు అందర్నీ నవ్వించగలిగే ఏకైక వర్గం కమెడియన్లే. అలాంటి కమెడియన్‌గా బజర్దస్త్ కామెడియన్ ఇమ్మూ ఈ సీజన్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.

Jabardasth Rohini s Shocking Post on Immanuel s Bigg Boss 9 Elimination

జబర్దస్త్ వేదికపై టైమింగ్ కామెడీతో పేరు తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్, బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన తొలి రోజునుంచే 'ఎంటర్‌టైనర్'ట్యాగ్‌ను సొంతం చేసుకున్నాడు. కేవలం నవ్వడమే కాదు.. నవ్వించడం, టాస్క్‌ల్లోనూ పోటీపడి, మానసిక స్థైర్యం చూపించి 'కామెడీ మాత్రమే కాదు.. ఆటలోనూ స్ట్రాంగ్' అని నిరూపించాడు. హౌస్‌లో చాలామంది ఒకే కోణంలో కనిపిస్తారు. కానీ, ఇమ్మూ మాత్రం ఎమోషన్,ఎంటర్‌టైన్‌మెంట్ రెండింటినీ సమపాళ్లలో చూపించారు. తన జీవితంలోని కష్టాలు, అమ్మ కల, కెరీర్ కోసం చేసిన పోరాటం అన్నింటిని ఓపెన్ చెప్పేశాడు.

అదే సమయంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినా.. ఆర్యూమెంట్స్ జరిగినా.. ఇట్టే ఆ వాతావరణాన్ని కూల్ చేసేవాడు. తన కామెడీతో ఎంత పెద్ద సమస్యను అయినా చాలా లైట్ గా చేసేవాడు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకూ అతనికి గట్టి కనెక్షన్ ఏర్పడింది. ఈ సీజన్‌లో మరో విశేషం..ఇమ్మూ ఎలిమినేషన్ భయం పెద్దగా ఎదుర్కోకుండా టాప్ 5 వరకు రావడం. ఇది అతనికి దక్కిన ప్రజాదరణకు నిదర్శనం. అందుకే టాప్ 3లో ఉంటాడన్న అంచనాలు బలంగా ఏర్పడ్డాయి. కానీ ఫైనల్ దశలో సూట్‌కేస్ ఆఫర్ లేకుండానే నాలుగో స్థానంతో ఔట్ అయ్యాడన్న టాక్ అభిమానులను మరింత కలచివేసింది.

ఈ నేపథ్యంలో రోహిణి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. 'ఇమ్మూ గురించి తెలిసి ఎంతో నిరాశచెందాను. అతడి విషయంలో బిగ్‌బాస్ టీమ్‌, ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు. బిగ్‌బాస్ 9 సీజన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. కష్టపడినా వాడికి విలువ ఉండదా? దానికి తగ్గ ఫలితం రాదా? మీ దృష్టిలో ఎంటర్‌టైనర్స్‌కు ఏ స్థానం ఉందో మళ్లీ నిరూపించారు. ఇమ్మూ ఈ సీజన్‌కు నిజమైన విజేత నువ్వే. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. చేతులెత్తి జోడిస్తున్న ఎమోజీలతో 'బిగ్‌బాస్‌కో దండం' అంటూ రాసుకోచ్చింది.

ఇది ఒక్క ఇమ్మూ కథ కాదు. గత సీజన్లలోనూ కమెడియన్లు నవ్వులు పంచినా, ట్రోఫీ దూరంగానే నిలిచిన సందర్భాలు ఉన్నాయి. రోహిణి, ముక్కు అవినాష్ లాంటి వారు ఫైనలిస్ట్‌లుగా నిలిచినా, కిరీటం మాత్రం దక్కలేదు. ఈసారి ఆ లోటు తీరుతుందని భావించిన ప్రేక్షకులకు ఇమ్మూ ఎలిమినేషన్ గట్టి దెబ్బ అనే చెప్పాలి. బిగ్‌బాస్‌లో కాంట్రవర్సీ ఎంత అవసరమో.. కామెడీ కూడా అంతే అవసరం. ఎంటర్‌టైన్‌మెంట్‌ను మోసే కమెడియన్లకు తగిన గౌరవం దక్కాలన్న డిమాండ్ ఇమ్మూ ఎలిమినేషన్ ఘటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. ట్రోఫీ ఒక్కరికే దక్కినా, ప్రేక్షకుల మనసులు గెలిచినవాడు ఎవరో ఈ సీజన్ స్పష్టంగా చెప్పింది. రోహిణి మాటల్లో చెప్పాలంటే 'ఇమ్మూ, నువ్వే రియల్ విన్నర్'.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X