హైపర్ ఆది సైలెంట్ కిల్లర్.. పైకి కనిపించడు కానీ అలా చేస్తాడు: జబర్ధస్త్ సాయిలేఖ షాకింగ్ కామెంట్స్

కొన్నేళ్లుగా తెలుగు టెలివిజన్ రంగంపై హవాను చూపిస్తోన్న షోలలో జబర్ధస్త్ ఒకటి. స్టాండప్ కామెడీ ప్రోగ్రాంగా వచ్చిన దీనికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తుండడమే ప్రధాన కారణం. ఇక, ఈ షో వల్ల వెలుగులోకి వచ్చిన ఎంతో మంది స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో పంచుల కింగ్ హైపర్ ఆది ఒకడు. షోలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. టాప్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జబర్ధస్త్ సాయిలేఖ అతడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన ప్రయాణం.. జబర్ధస్త్‌గా మారింది

అలా మొదలైన ప్రయాణం.. జబర్ధస్త్‌గా మారింది

కెరీర్ ఆరంభంలో డబ్‌స్మాష్ వీడియోలతో హల్‌చల్ చేసేవాడు ఆది. ఆ సమయంలోనే ఎన్నో సినిమాలకు స్ఫూప్ వీడియోలు రూపొందించడంతో పాటు అందులో నటించి మెప్పించాడు. ఇలా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయాడు. ఈ క్రమంలోనే అతడు జబర్ధస్త్ కమెడియన్ అదిరే అభి ద్వారా ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి అతడు వెనుదిరిగి చూడకుండా సాగుతున్నాడు.

మామూలుగా ఎంట్రీ.. టీమ్ లీడర్‌గా ఎదిగిన ఆది

మామూలుగా ఎంట్రీ.. టీమ్ లీడర్‌గా ఎదిగిన ఆది

జబర్ధస్త్‌లోకి డైలాగ్ రైటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. ఆ సమయంలోనే అదిరే అభినయ్ స్కిట్లకు ఎన్నో పంచులు రాశాడు. అలాగే, కొన్ని స్కిట్లలో యాక్టింగ్ కూడా చేశాడు. ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్‌గా మారి.. ఎన్నో స్కిట్లను రాశాడు. దీంతో అతడి టాలెంట్‌ను గుర్తించిన జబర్ధస్త్ నిర్వహకులు.. హైపర్ ఆది పేరుతో టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. దీంతో అతడి రేంజ్ పెరిగిపోయింది.

పంచులు, ప్రాసలతో దండయాత్ర చేస్తున్నాడుగా

పంచులు, ప్రాసలతో దండయాత్ర చేస్తున్నాడుగా

జబర్ధస్త్ టీమ్ లీడర్‌గా మారిన తర్వాత హైపర్ ఆది దూసుకుపోతున్నాడు. అదిరిపోయే పంచులు, ప్రాసలతో ఎదుటి వారిపై దండయాత్ర చేస్తూ సత్తా చాటుతున్నాడు. అసాధారణమైన కామెడీతో ఎన్నో సార్లు బెస్ట్ పెర్ఫార్మర్‌గా గెలుపొందాడు. దీంతో పలు చిత్రాల్లోనూ నటించే అవకాశాలను అందుకుంటున్నాడు. ఇలా షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడీ యంగ్ కమెడియన్.

ఇంటర్వ్యూతో హల్‌చల్ చేస్తున్న జబర్ధస్త్ సాయి

ఇంటర్వ్యూతో హల్‌చల్ చేస్తున్న జబర్ధస్త్ సాయి

జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసే వాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్న అందరికీ తెలిసిందే. చాలా కాలంగా ఎంతో మంది కుర్రాళ్లు ఆడవాళ్లలా యాక్టింగ్ చేస్తూ ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో సాయి అలియాస్ సాయిలేఖ ఒకరు. జబర్ధస్త్ ద్వారా ఫుల్ ఫేమస్ అయిన అతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూతో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాడు.

హైపర్ ఆది క్యారెక్టర్‌పై సాయి షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆది క్యారెక్టర్‌పై సాయి షాకింగ్ కామెంట్స్

ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి జబర్ధస్త్ షో గురించి ఎన్నో విషయాలను వెల్లడించాడు. అదే సమయంలో అందులో పని చేస్తున్న యాంకర్లు, జడ్జ్‌లు, టీమ్ లీడర్లు, ఆర్టిస్టుల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ జబర్ధస్త్ నెంబర్ వన్ టీమ్ లీడర్ హైపర్ ఆది క్యారెక్టర్‌పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

సైలెంట్ కిల్లర్.. పైకి కనిపించడు కానీ అలా చేస్తూ

సైలెంట్ కిల్లర్.. పైకి కనిపించడు కానీ అలా చేస్తూ

ఈ ఇంటర్వ్యూలో యాంకర్ 'హైపర్ ఆది గురించి చెప్పింది. అతడు సెట్స్‌లో ఎలా ఉంటాడు' అని ప్రశ్నించింది. దీనికి సాయి సమాధానం చెబుతూ 'ఆది గారు సైలెంట్‌ కిల్లర్. అంటే వేరేగా అర్థం చేసుకోకండి. ఆయన పైకి కనిపించడు కానీ.. లోపల మాత్రం ఎంతో టాలెంటెడ్ పర్సన్. మామూలుగానే కనిపిస్తూ ఎదుటి వాళ్లను పంచులతో చంపేస్తుంటాడు' అంటూ వివరించాడతను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X