ఇమాన్యూయేల్ - వర్ష రిలేషన్‌పై సాయి షాకింగ్ కామెంట్స్: రెండో పెళ్లాం అంటూ మేటర్ లీక్ చేశాడు
తెలుగు బుల్లితెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి.. దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తోంది జబర్ధస్త్. మొదటి నుంచీ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోన్న ఈ షో.. మంచి రేటింగ్‌తో దూసుకుపోతోంది. పోటీగా ఎన్నో షోలు పుట్టుకొస్తున్నా.. వాటిని మించేలా డిజైన్ చేస్తున్నారు నిర్వహకులు. ఇందులో భాగంగానే కొన్ని లవ్ ట్రాకులను కూడా హైలైట్ చేస్తున్నారు. ఇలా ఇటీవలి కాలంలో ఇమాన్యూయేల్ - వర్ష జంట బాగా ఫేమస్ అయింది. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి రిలేషన్‌పై జబర్ధస్త్ సాయి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

ఎంతో మంది.. జబర్ధస్త్‌గా మారిన కెరీర్లు
టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దీని ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వాళ్లంతా ఇప్పుడు స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. వీళ్లతో పాటే పలువురు టెక్నీషియన్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇలా కొన్ని వందల మందికి అవకాశాలు కల్పించింది జబర్ధస్త్. అదే సమయంలో యాంకర్లు, జడ్జ్‌లకు సైతం ఎంతగానో ఉపయోగ పడిపోయింది.
హంసా నందిని బికినీ ఫోటోలు హల్‌చల్.. వైరల్‌గా మారిన షోటోషూట్

అతడి వల్ల ఆమె... దాని నుంచి అతడు
హైపర్ ఆది టీమ్ వల్ల ఎంతో మంది జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇస్తుంటారు. అందులో తెలుగందం వర్ష ఒకరు. అతడి స్కిట్ల ద్వారానే షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకునే అందంతో ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. అదే సమయంలో 'పటాస్' షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు ఇమాన్యూయేల్. జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి తక్కవ టైమ్‌లోనే బెస్ట్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు.

రష్మీ సుధీర్ తర్వాత అంతటి పేరొచ్చింది
జబర్ధస్త్ షో వల్ల ప్రపంచానికి పరిచయం అయ్యారు యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్. ఆ తర్వాత వీళ్లిద్దరే తమ మధ్య ట్రాక్ నడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ షోను నిలబెడుతున్నారు. తద్వారా ఫుల్‌గా పాపులారిటీని అందుకున్నారు. ఇక, వీళ్ల తర్వాత ఇమాన్యూయేల్.. వర్ష అంతగా ఫేమస్ అయ్యారు. ఈ జంట కూడా ప్రేమలో ఉన్నట్లు చూపిస్తున్నారు.

కిస్సులు.. హగ్గులతో రెచ్చిపోతోన్న జోడీ
కెవ్వు కార్తీక్ టీమ్‌లో పని చేస్తున్న సమయంలో ఇమాన్యూయేల్.. వర్షను జంటగా చూపిస్తున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరినీ హైలైట్ చేయడం కోసం లవ్ ట్రాకును కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్త పరచుకోవడంతో పాటు అప్పుడప్పుడూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. దీంతో తరచూ వార్తల్లో ఉంటున్నారు.

ఇమాన్యూయేల్ - వర్ష రిలేషన్‌పై సాయి
జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేస్తూ సాయి లేఖగా పేరొందాడు కమెడియన్ సాయి. తాజాగా అతడు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా యాంకర్.. 'నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అబ్బాయిని చేసుకుంటావా?' అని ప్రశ్నించింది. దీనికి 'ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను' అని చెబుతూనే ఇమాన్యూయేల్ - వర్ష రిలేషన్‌పై సాయి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

రెండో పెళ్లాం అంటూ మేటర్ లీక్ చేశాడు
ఈ ఇంటర్వ్యూలో సాయి మాట్లాడుతూ.. 'నాకు ఇమాన్యూయేల్‌లే మొగుడు' అని చెప్పాడు. దీనికి యాంకర్ 'అతడికి వర్ష ఉందిగా. మళ్లీ నువ్వెందుకు' అని ప్రశ్నించింది. ఆ వెంటనే స్పందించిన సాయి అలియాస్ సాయి లేఖ.. 'వర్ష కాదు.. నేనే పెళ్లాన్ని. ఆమె ఇమాన్యూయేల్‌కు రెండో భార్య' అంటూ బాంబ్ పేల్చాడు. ఇక, చివర్లో 'నేను చెప్పింది స్కిట్ల వరకు మాత్రమే' అని వివరించాడు.


Click it and Unblock the Notifications











