Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎప్పటి నుంచో ఆ ఫీలింగ్స్ ఉన్నాయి.. చెప్పే వాళ్ళే రాత్రి కాగానే.. జబర్దస్త్ సాయితేజ షాకింగ్ కామెంట్స్
బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు ఫేమస్ అయ్యారు. కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ వేస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త రకం స్కిట్.. అప్డేట్ నవ్వులు అన్నట్లుగా సాగుతోంది జబర్దస్త్ షో. అయితే జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో లేడీ గెటప్స్ వేసుకొని ఆడవాళ్ళుగా అలరిస్తున్న వారిలో పాపులర్ అయ్యారు వినోద్, శాంతి స్వరూప్, సాయి తేజ. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు సాయితేజ.
ఆడదానిగా మారిన సాయితేజ
మొదట జబర్దస్త్ వేదికపై ఆడ వేషాలు వేస్తూ అలరిస్తూ వచ్చిన సాయితేజ నిజంగానే ఆడదానిగా మారాడు. అందుకు తగిన ఆపేరేషన్ చేయించుకొని అమ్మాయిగా జీవితం కొనసాగిస్తున్నాడు. ఈ మేరకు తన పేరును సాయితేజ నుంచి ప్రియాంక సింగ్ అని పేరు మార్చుకున్నాడు. దీంతో అతడు కాస్తా ఆమె అయిపోయింది.
ఆడదానిగా మారడంపై సాయితేజ ఫీలింగ్స్
సాయితేజగా ఉన్న తాను ఆడదానిగా మారి ప్రియాంక సింగ్ కావడం పట్ల స్వయంగా తన అభిప్రాయాన్ని తెలిపింది ప్రియాంక. తనకు చిన్నప్పటి నుంచే అలాంటి ఫీలింగ్స్ ఉండేవని, అందుకే ఇలా ప్రియంకగా మారానని చెప్పుకొచ్చింది. ఇది పూర్తిగా తన అభిప్రాయమే అని తెలిపింది.
అలా చెప్పే వాళ్ళే రాత్రి కాగానే..
జబర్దస్త్ లో డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి అని చెప్పే వాళ్ళే రాత్రి కాగానే టీవీ ముందు కూర్చుంటారు. నేను ముందు నుంచే చెబుతున్నా.. నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని అని కుండబద్దలు కొట్టేస్తూ మాట్లాడింది ప్రియాంక సింగ్. అయితే తాను ఇలా మారాననే విషయం తన తండ్రికి మాత్రం తెలియదని వెల్లడించింది ప్రియాంక.
వినోద్, శాంతి స్వరూప్ లపై స్పందన
ఇక ఇంటర్వ్యూలో భాగంగా.. మీరు ఇలా మారిన ఇంపాక్ట్ వినోద్, శాంతి స్వరూప్ లపై పడుతోంది కదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. వాళ్ళు నాతో ఒక్కటే చెప్పారు.. సాయి నీ ఫీలింగ్స్ నీవి, వాటికి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం.. ఎవ్వరో ఏదో అంటున్నారని అవన్నీ మేము పట్టించుకోము అని చెప్పారని ప్రియాంక చెప్పుకొచ్చింది.
Recommended Video
వాళ్లతో సినిమాలకు వెళ్తా.. లంగా ఓణీ కొనిస్తుంటారు
తాను వినోద్, శాంతి స్వరూప్, పవన్ లతో సినిమాలకు కూడా వెళ్తుంటా. అది కూడా చీర కట్టుకొని ఇలాగే వెళతా. పైగా వాళ్ళు నాకు లంగా ఓణీ కొనిస్తుంటారు అని చెప్పింది ప్రియాంక. వాళ్లకి గిల్టీ ఫీలింగ్స్ ఉంటే వాళ్ళు నాతో మాట్లాడారు కదా! అని అనేసింది ప్రియాంక (సాయి తేజ).
మా అందరికీ ఓ గ్రూప్ కూడా ఉంది
వినోద్, శాంతో స్వరూప్, పవన్ లాంటి వాళ్లమంతా కలిసి ఓ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నామని చెప్పింది ప్రియాంక. దాని పేరు జబర్దస్త్ లేడీ గెటప్స్ అని పేర్కొన్న ఆమె ఆ గ్రూప్ ద్వారా తామంతా ఎప్పుడూ టచ్‌లో ఉంటామని తెలిపింది.