పనీపాట లేని వెధవలు కూడా..! తట్టుకోలేం.. జబర్దస్త్ సాయితేజ షాకింగ్ కామెంట్స్

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు ఫేమస్ అయ్యారు. కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ వేస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త రకం స్కిట్.. అప్‌డేట్ నవ్వులు అన్నట్లుగా సాగుతోంది జబర్దస్త్ షో. అయితే జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో లేడీ గెటప్స్ వేసుకొని ఆడవాళ్ళుగా అలరిస్తున్న వారిలో పాపులర్ అయ్యారు వినోద్, శాంతి స్వరూప్, సాయి తేజ. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు సాయి తేజ.

Recommended Video

Vinod Reveals Interesting Secrets In A Latest Interview || Filmibeat Telugu
సాయి తేజ కాదు ప్రియాంక

సాయి తేజ కాదు ప్రియాంక

సాయి తేజగా లేడీ గెటప్పులో బుల్లితెరపై వినోదాలు పంచిన సాయి తేజ.. ఇప్పుడు ప్రియాంకగా మారి పోయాడు. అంటే ఆడవారిగా మార్నేదుకు గాను సర్జరీ చేయించుకొని పూర్తి ఆడదానిగా అయిపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిస్తూ అతని వ్యక్తిగత విషయాలతో పాటు ఇటీవల వినోద్ పై జరిగిన దాడి గురించి స్పందించాడు.

వినోద్‌పై దాడి.. తీవ్ర గాయాలు

వినోద్‌పై దాడి.. తీవ్ర గాయాలు

ఇటీవలే ఇల్లు కొనుగోలు విషయమై జబర్దస్త్ కమెడియన్ వినోద్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో వినోద్ తీవ్రంగా గాయపడటంతో ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తన వద్ద డబ్బులు తీసుకొని ఇంటి ఓనర్ మోసం చేశాడని వినోద్ ఆరోపించి కేసు నమోదు చేశాడు. ఇదే విషయంపై తన అభిప్రాయం చెప్పాడు జబర్దస్త్ సాయి తేజ (ప్రియాంక).

న్యాయం జరిగే వరకూ పోరాడతాం

న్యాయం జరిగే వరకూ పోరాడతాం

వినోద్‌కి న్యాయం జరిగే వరకూ మేమంతా అతనికి అండగా ఉంటామని, వినోద్ పై దాడి చేసిన వాళ్ళు మనుషులు కాదు మృగాలు అని సాయి తేజ (ప్రియాంక) అన్నారు. వినోద్ కంటికి, భుజానికి బలమైన గాయాలయ్యాయి. త్వరలో ఆయన ఆపేరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని సాయి తేజ చెప్పారు.

కూలి ఇచ్చి మరీ గుడిచుకున్నట్లుగా..

కూలి ఇచ్చి మరీ గుడిచుకున్నట్లుగా..

కూలి ఇచ్చి మరీ గుడిచుకున్నట్లుగా వినోద్ పరిస్థి అయిందని, ఎంతో కష్టపడి పోగు చేసి మరీ 18 లక్షలు కట్టి మోసపోయిన వినోద్ కి ఖచ్చితంగా న్యాయం జరగాలని పేర్కొన్నారు సాయి తేజ. ఎన్నో అవమానాలు భరించి ఈ సొమ్ము కూడబెట్టిన వినోద్‌కి చాలా అన్యాయం జరిగిందని అన్నారు సాయి తేజ.

పనీపాట లేని వెధవలు కూడా

పనీపాట లేని వెధవలు కూడా

ఓ ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నో మాటలంటారు. పనీపాట లేని వెధవలు కూడా కామెంట్ చేస్తుంటారు. అలా ఎన్నో మాటలు పడి తన ఫ్యామిలీ కోసం దాచుకున్న డబ్బులు కడితే.. వినోద్ కి దక్కిన ప్రతిఫలం అది. ఇంకెవరికీ అలాంటిది జరగొద్దని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు సాయి తేజ (ప్రియాంక).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X