ఓ దర్శకుడు రూమ్‌కి రమ్మన్నాడు.. చాలా నీచంగా అది కూడా ఓపెన్‌గా చెప్పేశాడు.. జబర్దస్త్ నటి ఆవేదన

జబర్దస్త్ షో నుంచి నాగబాబు వెళ్లినప్పటి నుంచి ఈ షో గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. జడ్జెస్, కమెడియన్స్‌కి సంబంధించిన విశేషాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ తెరపై వినోదాల విందు ఇచ్చిన సాయి తేజ (ప్రియాంక) తాజాగా కెమెరా ముందుకొచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తనతో ఓ ఓ దర్శకుడు చాలా నీచంగా మాట్లాడాడని తెలుపుతూ ఆవేదన చెందింది. వివరాల్లోకి పోతే..

ప్రియాంకగా మారిపోయిన సాయి తేజ

ప్రియాంకగా మారిపోయిన సాయి తేజ

ఎప్పుడూ లేడీ గెటప్పుల్లో కనిపిస్తూ జబర్దస్త్ తెరకే కొత్త అందం తీసుకొచ్చిన సాయితేజ.. ఇప్పుడు ప్రియాంకగా మారిపోయిన సంగతి తెలిసిందే. సర్జరీ చేయించుకొని పూర్తి ఆడదానిగా అయిపోయాడు సాయి తేజ. గతంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. దీంతో ఇప్పుడంతా ఆయన్ను ప్రియంక గానే చూస్తున్నారు.

 ప్రియాంక పెళ్లి వార్తలు.. పోకిరీల ఆగడాలు

ప్రియాంక పెళ్లి వార్తలు.. పోకిరీల ఆగడాలు

ఈ మధ్యే ఆమెకు పెళ్లైందనే వార్తలు కూడా షికారు చేశాయి. కానీ తనకు ఇంకా పెళ్లి కాలేదని చెబుతోంది ప్రియాంక. అర్థం చేసుకునేవాడు దొరికితే కచ్చితంగా పెళ్ళాడతా అని అంటోంది. అయినా తననెవరూ చేసుకోరని అంటున్న ఆమె.. పోకిరిలు మాత్రం తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చింది.

ఓ దర్శకుడు రూమ్‌కు రమ్మంటూ.. ఎక్స్‌పోజింగ్ చేయాలని

ఓ దర్శకుడు రూమ్‌కు రమ్మంటూ.. ఎక్స్‌పోజింగ్ చేయాలని

ఈ మధ్యే తనను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని, అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది ప్రియాంక. వృత్తిలో భాగంగా తనకు యాక్ట్ చేయాలని కాల్ చేసిన ఆ దర్శకుడు చాల నీచంగా మాట్లాడాడని తెలిపింది. నువ్వు నా సినిమాలో ఐటెం సాంగ్ చేస్తావా? అని అడిగిన ఆ దర్శకుడు.. ఈ పాటలో ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వస్తుందని చెప్పాడని, అయితే అందుకు తాను ఓకే చెప్పానని తెలిపింది ప్రియాంక.

 వరంగల్‌లో ఆ మూడు రోజులు

వరంగల్‌లో ఆ మూడు రోజులు

అయితే ఆ ఐటెం సాంగ్ వరంగల్‌లో షూట్ చేయాల్సి వస్తుందని చెప్పిన దర్శకుడు అక్కడే మూడు రోజుల పాటు ఉండాలని.. అదికూడా తనతో ఆ మూడు రోజులు ఒకే రూమ్‌లో ఉండాలని అన్నాడని ప్రియాంక తెలిపింది. ఆ రూమ్‌లో ఆయనతో పాటు మరొకరు కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పుకొచ్చింది. దీంతో ఆ సినిమా వదిలేసుకున్నానని పేర్కొంది.

పనీపాట లేని వెధవలు.. ప్రియాంక బ్లాస్ట్

పనీపాట లేని వెధవలు.. ప్రియాంక బ్లాస్ట్

అంతేకాదు సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన తర్వాత తనను కూడా చాలా మంది వేధించారని, ఇష్టమొచ్చినట్లు విమర్శించారని ప్రియాంక ఆవేదన చెందింది. ఇటీవలే పనీపాట లేని వెధవలు మాత్రం తమపై ఇలా కామెంట్స్ చేస్తుంటారని బ్లాస్ట్ అయిన ప్రియాంక మళ్ళీ ఇప్పుడు ఈ విషయాలు చెప్పి వార్తల్లో నిలిచింది.

Recommended Video

Nagababu Re-Entry Rumors Into Jabardasth || Filmibeat Telugu
దయచేసి అలా చేయకండి.. ప్రియాంక ఆవేదన

దయచేసి అలా చేయకండి.. ప్రియాంక ఆవేదన

దయచేసి తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని, తనను చిన్నచూపు చూడకుండా అందరిలో ఒకరిలా బ్రతకనీయండి అంటూ కాస్త ఆవేదన చెందింది ప్రియాంక. దీంతో ఈ మాట్లాడిన తీరు, చెప్పిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X