చమ్మక్ చంద్రతో ఎఫైర్ రూమర్స్... ఆయన వల్లే జబర్దస్త్ కి దూరం!

గ్లామర్ ఫీల్డ్‌లో ఎఫైర్ రూమర్స్ కొత్తవి కావు. హీరో-హీరోయిన్‌లు వరుసగా సినిమాలు చేస్తే, లేదా ఒకే టీమ్‌లో ఎక్కువకాలం కనిపిస్తే, వారి మధ్య ఏదో ఉందంటూ కథనాలు పుట్టుకొస్తుంటాయి. చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా నటీనటులకు ఇలాంటి ప్రచారాలు రావడం సాధారణమే. ఈ కోవలోనే ఒకప్పుడు జబర్దస్త్ వేదికగా పేరు తెచ్చుకున్న లేడీ కమెడియన్ సత్యశ్రీ కూడా ఎఫైర్ రూమర్స్‌ను ఎదుర్కొన్నారు. ఆమెతో పాటు కమెడియన్ చమ్మక్ చంద్ర పేరు కూడా అప్పట్లో విస్తృతంగా వినిపించింది. ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సత్యశ్రీ ఓపెన్ అయింది. అసలు నిజం ఏంటో వెల్లడించారు. ఇంతకీ ఏమన్నారంటే?

సత్యశ్రీని జబర్దస్త్‌కు పరిచయం చేసిన వ్యక్తి చమ్మక్ చంద్రనే. భార్యాభర్తల మధ్య గొడవలు, గిల్లికజ్జాల నేపథ్యంలో సాగే 'మొగుడు-పెళ్లాల' కామెడీ డ్రామాతో చమ్మక్ చంద్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన స్కిట్స్‌లో భార్య పాత్ర చాలా కీలకంగా ఉండేది. తొలుత వినోద్ లేడీ గెటప్‌తో ఆ పాత్రను పోషించగా, తర్వాత లేడీ గెటప్స్‌తో విసిగిపోయింది చమ్మక్ చంద్ర. నిజమైన లేడీ కమెడియన్‌గా సత్యశ్రీని తన టీమ్‌లోకి తీసుకున్నారు. ఈ నిర్ణయం కలిసి వచ్చింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవ్వడంతో పాటు, కామెడీ టైమింగ్ కూడా కుదిరింది. ఫలితంగా వరుసగా పదుల సంఖ్యలో స్కిట్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.

Jabardasth Satya Sri Breaks Silence on Chammak Chandra Affair Rumours and Exit From the Show

బుల్లితెరపై ఫేమ్ సొంతం చేసుకున్న ఈ జంటపై రూమర్స్ కూడా మొదలయ్యాయి. 'సత్యశ్రీ-చమ్మక్ చంద్ర మధ్య సంథింగ్ సంథింగ్ ఉంది'. 'ఆ కారణంగానే ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి'అంటూ సోషల్ మీడియా, గాసిప్ కాలమ్స్‌లో ప్రచారం సాగింది. ఈ వార్తలపై స్పందించిన సత్యశ్రీ, వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా చెప్పింది. ఈ రూమర్స్ గురించి మొదట తన డాడీ తనకు చెప్పారని సత్యశ్రీ తెలిపారు. అయితే ఆ వార్తలు ఇంట్లోకి వచ్చినప్పటికీ, తల్లిదండ్రులు వాటిని పెద్దగా పట్టించుకోలేదని, పైగా తనను మరింత ఎంకరేజ్ చేస్తూ షోను కొనసాగించమని ధైర్యం చెప్పారని వెల్లడించారు.

'నీపై ఇలాంటి కథనాలు వస్తున్నాయంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం' అని తండ్రి చెప్పిన మాటలు తనకు ఎంతో బలాన్ని ఇచ్చాయని ఆమె భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. కష్టకాలంలో తల్లిదండ్రులు తనకు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారని, ఆ సపోర్ట్ లేకపోతే తాను ఇంత స్ట్రాంగ్‌గా ఉండలేదేమోనని పేర్కొన్నారు. ఇలాంటి విమర్శలు, రూమర్స్‌పై తాను చమ్మక్ చంద్రతో కూడా ఓపెన్‌గా డిస్కస్ చేశానని సత్యశ్రీ చెప్పారు.

'చంద్ర గారు కూడా ఇవన్నీ లైట్‌గా తీసుకోమన్నారు. ఆయన చాలా బిజీ పర్సన్. రిహార్సల్స్ లేదా షూటింగ్ టైంలో మాత్రమే ఆయనను కలిసేదాన్ని. అంతకు మించి ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు' అని స్పష్టంగా చెప్పారు. ఈ మాటలతో ఎఫైర్ రూమర్స్‌కు పూర్తిగా చెక్ పెట్టారు.

ఇక జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గల కారణంపై కూడా సత్యశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చమ్మక్ చంద్ర గారు నన్ను జబర్దస్త్‌కు తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన నాకు గురువు లాంటివారు. ఆయన షో నుంచి బయటకు వెళ్లిన తర్వాత, అప్పటివరకు నేను ఎలాంటి స్కిట్స్ చేయలేదు. అలాంటి గురువును వదిలి అక్కడే ఉండలేకపోయాను. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యాం' అని చెప్పారు. తనతో పాటు మరికొందరు కూడా ఇదే భావనతో జబర్దస్త్‌ను విడిచిపెట్టారని తెలిపారు.

'మాకు ఒకటే ఉద్దేశం... మా గురువు చంద్ర గారు ఒక్కడే కాదు, ఆయన వెనుక మేము కూడా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాం. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు' అని సత్యశ్రీ క్లారిటీ ఇచ్చారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి గొడవలు లేదా విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు.

అయితే జబర్దస్త్ తర్వాత చమ్మక్ చంద్రతో కాకుండా ధనరాజు టీమ్‌లో పనిచేయడంపై కూడా సత్యశ్రీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'చంద్ర గారు మూవీస్‌లో బిజీ కావడంతో ధనరాజ్ గారి టీమ్‌లో చేరాల్సి వచ్చింది. ఆయన నన్ను కేవలం నటిగా మాత్రమే కాకుండా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఇన్వాల్వ్ చేశారు' అని చెప్పారు. అందుకే యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్ వైపు కూడా నేర్చుకుంటూ, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే తపనతో ముందుకెళ్లానని పేర్కొన్నారు. ఇక జబర్దస్త్ వేదికపై ఏర్పడిన మంచి కెమిస్ట్రీనే కొందరు తప్పుగా అర్థం చేసుకుని ఎఫైర్ రూమర్స్‌గా మలిచారని సత్యశ్రీ మాటల ద్వారా స్పష్టమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X