సొంతింట్లోకి అడుగుపెట్టిన జబర్దస్త్ బ్యూటీ .. ఇల్లు కాదు, నా కల అంటూ ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్‌ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు బయటికొస్తున్నారు. టాలెంట్ ఉండి ఎలా బయటపెట్టాలో తెలియక నాలుగు గోడలకే పరిమితమైన వారికి ఈ కార్యక్రమం ఓ వేదికలా నిలిచింది. అలా వెలుగులోకి వచ్చిన వారిలో సత్యశ్రీ ఒకరు. జబర్దస్త్ ఫిమేల్ కంటెస్టెంట్స్‌లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. తాజాగా సత్యశ్రీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన సత్యశ్రీ నటనపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర టీంలో అతనికి అసిస్టెంట్‌గా పనిచేసింది సత్యశ్రీ. చంద్రకి వైఫ్‌గా నటించి తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో పలు ఈవెంట్స్, సినిమాలలోనూ ఛాన్స్‌లు దక్కించుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో మెరిసిపోయే సత్య శ్రీ .. పలు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్‌గానూ నటించింది.

jabardasth satya sri house warming ceremony photos here

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో సత్య చేసిన ఐటెం సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. నా పెట్టే తాళం తీస్తే అంటూ సాగే ఆ పాట మాస్‌ను ఊపేసింది. పోలీస్ డ్రెస్‌లో డబుల్ మీనింగ్‌లో సాగే ఆ పాటపై పలు విమర్శలు కూడా వచ్చాయి. సత్య, సోనియా, నితిన్, బ్రహ్మాజీలు ఈ సాంగ్‌లో నటిస్తారు. అయితే ఈ పాట గురించి తనకు తెలియకుండానే సత్యశ్రీ ఓకే చెప్పారట.

మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యశ్రీని యాంకర్ ఈ పాట గురించి అడగ్గా.. తనకు ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ ఉందని చెప్పారని వెల్లడించారు. ఆ పాత్రకు ఓ పాట, డ్యాన్స్ కూడా చేయాల్సి ఉంటుందని అన్నారని.. కానీ ఈ సీన్ చేసే ఒకరోజు ముందు పాట గురించి చెప్పగానే మధ్యలో డ్రాప్ కాలేక నటించిందట సత్య. అంతేకాదు ఈ సాంగ్‌కు తగిన ఎక్స్‌ప్రెషన్స్ పెట్టలేక టేకుల మీద టేకులు తీసుకుందట. శేఖర్ మాస్టర్ కూడా ఈ పాట గురించి తనకు అర్థమయ్యేలా చెప్పారని సత్యశ్రీ తెలిపారు.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సత్య.. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వివరాలు, షోల గురించి అప్‌డేట్స్ పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్నాళ్లకు తన సొంతూరు తణుకులో సత్య ఇల్లు కట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో పాలు పొంగించిన ఫోటోలు, బిందెతో నీటిని తీసుకెళ్తున్న ఫోటోలను ఆమె పంచుకున్నారు. ఇల్లు కాదు, నా కల అంటూ సత్య శ్రీ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజన్లు, పలువురు బుల్లితెర ప్రముఖులు ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Read more about: jabardasth satya sri movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X