రూటు మార్చేసిన జబర్దస్త్ సత్య శ్రీ .. ఆ పాటను మించి గ్లామర్ షో, కుర్రాళ్లు తట్టుకోగలరా?

ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్‌ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు బయటికొస్తున్నారు. ఈ ఫ్లాట్‌ఫాం ద్వారా టాలెంట్ నిరూపించుకున్న కొందరు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. అలా వెలుగులోకి వచ్చిన వారిలో సత్యశ్రీ ఒకరు. మేల్ డామినేషన్ ఉండే జబర్దస్త్‌లో ఫిమేల్ కంటెస్టెంట్స్‌ అతి తక్కువ మంది. అలాంటి చోట తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన సత్యశ్రీ నటనపై ఆసక్తితో ఈ రంగం వైపు అడుగుపెట్టారు. ఇలాంటి దశలో జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర టీంలో అతనికి అసిస్టెంట్‌గా పనిచేసింది సత్యశ్రీ. ఎన్నో స్కిట్లలో చంద్రకి వైఫ్‌గా నటించి తన కామెడీ టైమింగ్, పంచ్‌ల‌తో నవ్వులు పూయించింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో పలు ఈవెంట్స్, సినిమాలలోనూ ఛాన్స్‌లు దక్కించుకుంది.

jabardasth satya sri stunning looks in gold color saree video goes viral

మొన్నామధ్య నితిన్ హీరోగా ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో సత్య ఐటెం సాంగ్ చేయడం ఆమె అభిమానులకు షాకిచ్చింది. నా పెట్టే తాళం తీస్తే అంటూ డబుల్ మీనింగ్‌తో సాగే ఆ పాట మాస్‌ను ఒక ఊపేసింది. ఈ సాంగ్‌కు ప్రశంసలతో పాటు పోలీస్ డ్రెస్‌లో డబుల్ మీనింగ్‌ అర్ధాలు వచ్చేలా నటించడం ఏంటంటూ పలు విమర్శలు కూడా వచ్చాయి.

తన ప్రతిభ, కష్టంతో ఇక్కడి వరకు వచ్చిన సత్య శ్రీ ఇన్నాళ్లకు తన సొంతూరు తణుకులో సొంతిల్లు ఇల్లు కట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో పాలు పొంగించిన ఫోటోలు, బిందెతో నీటిని తీసుకెళ్తున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాదు ఇది ఇల్లు కాదు, నా కల అంటూ సత్య శ్రీ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తాను ఈస్థాయికి రావడానికి చమ్మక్ చంద్రయే కారణమని.. ఆయన తన గురువు అని చెబుతుంది సత్య. చంద్ర ఎక్కడుంటే అక్కడే తాను కూడా ఉంటానని చెప్పే ఆమె ప్రస్తుతం మాత్రం ఆయనకు దూరమైంది.

దీంతో వీరిద్దరిపై రకరకాల పుకార్లు వైరల్ అయ్యాయి. నిజానికి చమ్మక్ చంద్ర సినిమల్లో బిజీగా ఉండటంతో బుల్లితెరను అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో సత్యకి కూడా అవకాశాలు తగ్గాయి. కానీ ఈమెకు సినిమాల్లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తన ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవిని కలిసి మురిసిపోయింది సత్యశ్రీ. అంతేకాదు తన తల్లిని కూడా చిరు దగ్గరికి తీసుకెళ్లి ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సత్య.. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వివరాలు, షోల గురించి అప్‌డేట్స్ పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోల్డ్ కలర్ శారీలో మత్తెకించే చూపులతో, నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది సత్యశ్రీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: jabardasth satya sri movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X