Jabardasth దారుణమైన రేటింగ్స్.. షోలో గెటప్ శ్రీను రీ ఎంట్రీ.. త్వరలో వాళ్ళు కూడా?
నెంబర్ వన్ కామెడీ షో గా మంచి గుర్తింపు అందుకున్న జబర్దస్త్ ఇటీవల కాలంలో మాత్రం రేటింగ్స్ అందుకోవడంలో చాలా వెనుకబడిపోతుంది. మిగతా షో ల నుంచి పోటీ రావడం అలాగే కంటెంట్ కూడా రొటీన్ గా ఉండడంతో జనాలు జబర్దస్త్ పై పెద్దగా ఫోకస్ చేయడం లేదు. దానికి తోడు సీనియర్ కమెడియన్స్ కూడా చాలా వరకు వెళ్లిపోవడం ఒక మైనస్ అని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో గెటప్ శ్రీను రీఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అతన్ని మళ్ళీ రప్పించడానికి ఒక కారణం ఉందట. అంతే కాకుండా మరి కొంతమంది కూడా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ ద్వారా మంచి డిమాండ్
జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోతున్నారు. అంతే కాకుండా అప్పుడప్పుడు కొన్ని టెలివిజన్ షోలలో కూడా పాల్గొంటూ మంచి ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు. ఒక్క ఎపిసోడ్ కు కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ లక్షల్లోనే ఆదాయాన్ని అందుకుంటున్నారు.

అదే పెద్ద మైనస్
గతంలో ఎప్పుడూ లేనివిధంగా కొంతమంది సీనియర్ కమెడియన్స్ ఇటీవల జబర్దస్త్ ను విడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ టీమ్ వీడిపోవడం కూడా జబర్దస్త్ కు కొంత మైనస్ అయింది అని చెప్పాలి. సుడిగాలి సుదీర్ అలాగే గెటప్ శ్రీను ఇద్దరు కూడా బయటకు వెళ్లిపోయారు. మొదట వీళ్ళు విభేదాల కారణంగానే వెళ్ళిపోయినట్లు టాక్ వచ్చింది.

ఒకప్పుడు హై లెవెల్లో రేటింగ్స్
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇలా రెండు కామెడీ షోలు ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఈ షోలకు రికార్డు స్థాయిలో అయితే 16, 18 పైగానే రేటింగ్స్ వచ్చాయి. అంతేకాకుండా కమెడియన్స్ అందరికీ కూడా ఒక్క ఎపిసోడ్ కు లక్షల్లోనే రెమ్యునరేషన్ అందిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

హైపర్ ఆది ఎఫెక్ట్
ఇక సుడిగాలి సుదీర్ విడిపోవడమే కాకుండా హైపర్ ఆది కూడా వెళ్లిపోవడం మరొక పెద్ద మైనస్. ఇక ప్రముఖ కమెడియన్సు అందరు వెళ్లిపోవడంతో లేటెస్ట్ గా ఉన్న జూనియర్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. అలాగే అప్పుడెప్పుడో నటించిన కమెడియన్స్ మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చినా అనుకున్నంత స్థాయిలో అయితే ఆకట్టుకోవడం లేదు.

అందుకే గెటప్ శ్రీను ఎంట్రీ
అయితే నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఎపిసోడ్లో మాత్రం గెటప్ శ్రీను ఎంట్రీ ఉన్నట్లుగా ఒక ప్రోమో విడుదల చేశారు. ఆ ప్రోమోలో రామ్ ప్రసాద్ చేసిన స్కిట్ లో గెటప్ శ్రీను ఉండడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈసారి జబర్దస్త్ ఎపిసోడ్ కు మంచి రేటింగ్స్ అయితే దక్కే అవకాశం ఉంది. రేటింగ్స్ దాదాపు 7 వరకు పడిపోవడంతో నిర్వాహకులు ఈ విధంగా మళ్లీ గెటప్ శ్రీను రప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సీనియర్లు రీ ఎంట్రీ?
ఇప్పుడు గెటప్ శ్రీను రావడంతో మళ్లీ హైప్ వచ్చే అవకాశం ఉంది అని అలాగే మరి కొంతమంది పాత కమెడియన్స్ ను కూడా తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. అవసరమైతే ఇంకా ఖర్చు చేసి మళ్లీ జబర్దస్త్ కు సరికొత్త రూపం తీసుకురావాలని కూడా అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సుడిగాలి సుదీర్ కూడా మళ్ళీ వస్తాడు అని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అలాగే అప్పట్లో ధనరాజ్ వేణు మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. వారు కూడా రీ ఎంట్రీ ఇస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











