అనిల్ రావిపూడి చేసిన పనికి చనిపోవాలనుకున్నా: షేకింగ్ శేషు షాకింగ్ కామెంట్స్

ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయ్యే కామెడీ షో 'జబర్ధస్త్' ద్వారా ఎంతో మంది తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోందీ షో. అందుకే 'జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ షో ద్వారా ఫేమస్ అయి, సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో షేకింగ్ శేషు ఒకరు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఈయన.. చాలా సినిమాల్లోనూ మెప్పించారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఎమ్మెస్ నారాయణ గారి బదులు చేశాను

ఎమ్మెస్ నారాయణ గారి బదులు చేశాను

షేకింగ్ శేషుకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సుప్రీమ్' ఒకటి. ఇందులో తనకు అవకాశం ఎలా వచ్చిందన్న దానిపై ఆయన మాట్లాడారు. ‘మొదట ఈ పాత్రకు ఎమ్మెస్ నారాయణ గారిని అనుకున్నారు. ఆయన కాలం చేయడంతో వేరే వాళ్ల కోసం వెతికారు. అప్పుడు కమెడియన్ శ్రీనివాసరెడ్డి నా స్కిట్లను అనిల్ రావిపూడి గారికి చూపించారు. ఆయన చూసిన వెంటనే ఓకే చేసేశారు' అని శేషు చెప్పుకొచ్చాడు.

జబర్ధస్త్ కావాలా..? సినిమా కావాలా..?

జబర్ధస్త్ కావాలా..? సినిమా కావాలా..?

సినిమా కోసం తనను పిలిపించిన తర్వాత అనిల్ రావిపూడి ఓ కండీషన్ పెట్టారని శేషు తెలిపాడు. ‘అనిల్ గారి దగ్గరకు వెళ్లిన తర్వాత సినిమా షూటింగ్ 45 రోజులు ఉంటుంది నీకు ఓకేనా అని అడిగారు. నేను సరే అన్నాను. మరి జబర్ధస్త్ ఎలా అని ప్రశ్నించారు. దానికి నేను రెండూ చూసుకుంటాను సార్ అన్నాను. అప్పుడు ఆయన జబర్ధస్త్ కావాలా..? సినిమా కావాలా..? అని అడిగారు. ఆ తర్వాత షో వాళ్లకు చెబితే ఒప్పుకున్నారు. సినిమా చేశాను. మంచి హిట్ అయింది. నాక్కూడా పేరొచ్చింది' అని ఆయన వెల్లడించాడు.

ఏ సినిమాకూ నన్ను తీసుకోలేదు

ఏ సినిమాకూ నన్ను తీసుకోలేదు

అలాగే, సుప్రీం సినిమా తర్వాత అనిల్ రావిపూడి తనను మర్చిపోయారని శేషు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘సుప్రీంలో మంచి పేరు వచ్చినప్పటికీ అనిల్ గారు తర్వాత చేసిన ఏ సినిమాకూ నన్ను పిలవలేదు. అందుకు చాలా బాధగా ఉంది. రాజా ది గ్రేట్ సమయంలో వెళ్లి అడిగాను అవకాశం లేదన్నారు. అంతేకాదు, సినిమా చూసి నీకు సూటబుల్ క్యారెక్టర్ ఉంటే అడుగు అన్నారు. నిజంగానే అందులో అలాంటి పాత్ర లేదు' అని వివరించాడు.

అందులో పాత్ర ఉన్నా ఇవ్వలేదు

అందులో పాత్ర ఉన్నా ఇవ్వలేదు

విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తీసిన ‘F2'లో తనకు సూట్ అయ్యే పాత్ర ఉన్నా ఇవ్వలేదని శేషు చెప్పాడు. ‘నేను సుప్రీంలో అమాయకపు పాత్రను చేశాను కాబట్టి ఈ సినిమాలో ‘అంతేగా.. అంతేగా' అనే పాత్రను నాకివ్వచ్చు. కానీ, అది నాకు దక్కలేదు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు'కు కూడా పిలుపు రాలేదు. మరి ఆయన నన్ను ఎందుకు తీసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు' అని ఆవేదన వ్యక్తం చేశాడు శేషు.

నేను మెసేజ్ కూడా పెట్టాను

నేను మెసేజ్ కూడా పెట్టాను

ఒక సినిమాలో మంచి పేరు వచ్చినప్పటికీ మిగతా వాటిలో ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో తనకు అర్థం కావడం లేదన్న శేషు.. ‘సార్.. సుప్రీం సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మీ వల్ల నాకు మంచి పేరు వచ్చింది. నీనేదైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించండి. కానీ, మీ సినిమాలో అవకాశం ఇవ్వకుండా ఆపకండి సార్. ఆర్టిస్టు అవ్వాలని వచ్చిన వాడిని' అని అనిల్ గారికి మెసేజ్ పెట్టానని ఆయన పేర్కొన్నాడు.

చచ్చిపోవాలని అనిపించింది

చచ్చిపోవాలని అనిపించింది

అంత మంచి దర్శకుడి సినిమాలో అవకాశం రాలేదన్న బాధ తనను ఇప్పటికీ వెంటాడుతుందన్న శేషు.. ‘అవకాశం రాలేదని చచ్చిపోవాలని అనిపించింది. నటించడం కోసమే ఇండస్ట్రీకి వచ్చిన వాడికి మంచి డైరెక్టర్ సినిమాలో అవకాశం రాకపోతే ఏం చేయాలి.? సంసారాన్ని పోషించలేని వాడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లే.. గొప్ప దర్శకుల సినిమాల్లో అవకాశాలు రాకపోతే చాలా బాధగా ఉంటుంది. అందుకే ఇలానే చాలా మంది చనిపోయారు' అని శేషు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X