వాళ్ల వల్లే చనిపోయాడు.. హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై జబర్ధస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్

Recommended Video

Shaking Seshu Sensational Comments About Uday Kiran || Filmibeat Telugu

ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయ్యే కామెడీ షో 'జబర్ధస్త్' ద్వారా ఎంతో మంది తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోందీ షో. అందుకే 'జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ షో ద్వారా ఫేమస్ అయి, సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో షేకింగ్ శేషు ఒకరు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఈయన.. చాలా సినిమాల్లోనూ మెప్పించారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఎంతో గౌరవం ఇస్తారు

ఎంతో గౌరవం ఇస్తారు

తనకు జబర్ధస్త్‌లో ఎలాంటి గుర్తింపు ఉంటుందో ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు షేకింగ్ శేషు. ‘జబర్ధస్త్ సెట్‌లో నాతో అందరూ ఎంతో స్నేహంగా ఉంటారు. సీనియర్లు అయినా నన్న గౌరవంగా పిలుస్తుంటారు. అందరూ డాడీ, బాబాయ్ అని పిలుస్తుంటారు. ఇప్పటికీ అదే గౌరవం ఉంటుంది. కేవలం కళాకారులే కాదు.. జడ్జ్‌లు రోజా గారు, నాగబాబు గారు మిగిలిన వాళ్లందరూ నాతో మంచిగానే ఉంటారు' అని ఆయన చెప్పుకొచ్చారు.

జబర్ధస్త్‌ వల్లే అవకాశాలు వచ్చాయి

జబర్ధస్త్‌ వల్లే అవకాశాలు వచ్చాయి

ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను వెల్లడించాడు శేషు. ‘నాకు జబర్ధస్త్‌ వల్లే మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ నా ప్రదర్శన చూసిన తర్వాతే చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కొందరైతే నా స్కిట్లు చూసిన తర్వాతే చాలా మంది అవకాశాలు ఇస్తామని పిలిచారు. సాయి ధరమ్ తేజ్ ‘సుప్రీమ్' సినిమాలో ఛాన్స్ కూడా అలాగే వచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా జబర్దస్త్‌లో పెట్టిన షేకింగ్ శేషు అనే పేరుతోనే పిలుస్తుంటారు' అని ఆయన వెల్లడించారు.

కొందరు జబర్ధస్త్ కావాలా..? సినిమా కావాలా..?

కొందరు జబర్ధస్త్ కావాలా..? సినిమా కావాలా..?

సినిమా కోసం తనను పిలిపించిన తర్వాత కొందరు దర్శకులు కండీషన్లు పెట్టారని శేషు తెలిపాడు. ‘ముఖ్యంగా అనిల్ గారి దగ్గరకు వెళ్లిన తర్వాత సినిమా షూటింగ్ 45 రోజులు ఉంటుంది నీకు ఓకేనా అని అడిగారు. నేను సరే అన్నాను. మరి జబర్ధస్త్ ఎలా అని ప్రశ్నించారు. దానికి నేను రెండూ చూసుకుంటాను సార్ అన్నాను. అప్పుడు ఆయన జబర్ధస్త్ కావాలా..? సినిమా కావాలా..? అని అడిగారు. ఆ తర్వాత షో వాళ్లకు చెబితే ఒప్పుకున్నారు. సినిమా చేశాను. మంచి హిట్ అయింది. నాక్కూడా పేరొచ్చింది. ఇలా చాలా మంది అడగడంతో జబర్ధస్త్ మానేశాను' అని ఆయన చెప్పారు.

 చనిపోదామని అనుకున్నా

చనిపోదామని అనుకున్నా

ఎంత మంచి ప్రదర్శన ఇచ్చినా అవకాశాలు రాలేదన్న శేషు.. ‘అవకాశం రాలేదని చచ్చిపోవాలని అనిపించింది. నటించడం కోసమే ఇండస్ట్రీకి వచ్చిన వాడికి మంచి డైరెక్టర్ సినిమాలో అవకాశం రాకపోతే ఏం చేయాలి.? సంసారాన్ని పోషించలేని వాడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లే.. గొప్ప దర్శకుల సినిమాల్లో అవకాశాలు రాకపోతే చాలా బాధగా ఉంటుంది. అందుకే ఇలానే చాలా మంది చనిపోయారు' అని శేషు అన్నారు.

ఉదయ్ కిరణ్ కూడా...

ఉదయ్ కిరణ్ కూడా...

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. ఆయన కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో షేకింగ్ శేషు దీన్ని కూడా ప్రస్తావించారు. ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు రాకనే చనిపోయాడు. ఆయన చావుకు అవకాశాలు ఇవ్వని వాళ్లే కారణం' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శేషు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X