జగన్ పాదయాత్రకి వెళ్లడం వల్ల జబర్దస్త్ నుంచి పక్కన పెట్టారు: శాంతి స్వరూప్

Recommended Video

Popular Comedy Show Fame Shanthi Swaroop Reveals Why He's Away From The Show || Filmibeat Telugu

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు ఏపీలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్న కారణంగా జబర్దస్త్ కమెడియన్లు శాంతి స్వరూప్, వినోద్‌లను స్కిట్ల నుంచి తీసివేసినట్లు రూమర్లు వినిపించాయి. ఈ రూమర్లపై శాంతి స్వరూపం తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

మేము జగన్ గారి పాదయాత్రకు వెళ్లిన మాట నిజమే, కానీ ఆ పాదయాత్రకు, మమ్మల్ని పక్కన పెట్టడానికి సంబంధం లేదు. మేము అపుడు జబర్దస్త్ మానేసి వెళ్లాం. మాకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చినపుడు మేము దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు తెలియని తత్వంతో నేను, వినోద్ వాళ్లు పిలిచారు కదా అని వెళ్లిపోయామని శాంతి స్వరూప్ తెలిపారు.

అందుకే పనిష్మెంట్ ఇచ్చారు

అందుకే పనిష్మెంట్ ఇచ్చారు

మేము వెళుతున్న విషయం టీమ్ లీడర్లకు కూడా చెప్పాం, వారు మేనేజ్ చేయలేక పోయారు. డైరెక్షన్ డిపార్టుమెంటుకు మాపై కోపం లేదు కానీ ఇంకొకరు ఇలా చేయకూడదు అని మాకు మూడు నెలలు పనిష్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకుని స్క్రిట్లు రాసుకున్నపుడు ఇలా వదిలేసి వెళ్లడం తప్పు అని మేము తెలుసుకునేలా చేశారని తెలిపారు.

ఆ విషయం నిజం కాదు

ఆ విషయం నిజం కాదు

మేము చేసిన పొరపాటును మేము కూడా సరిదిద్దుకోవాలనుకున్నాం. ఆ మూడు నెలలు మేము అందరితో టచ్‌లోనే ఉన్నాం. కానీ బయట మా గురించి ఏవేవో అనుకున్నారు. జగన్ గారి గురించి మాట్లాడటం వల్లే తీసేశారు అని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని శాంతి స్వరూప్ తెలిపారు.

ట్రాన్స్ జెండర్స్ అంటే ఎంతో గౌరవం

ట్రాన్స్ జెండర్స్ అంటే ఎంతో గౌరవం

తమన్నా అనే ట్రాన్స్‌జెండర్ జబర్దస్త్‌లో అందరినీ చెప్పుతో కొడతాను అని ఎందుకు అన్నారు? అనే ప్రశ్నకు శాంతి స్వరూపం స్పందిస్తూ.... తనకు తమన్నా అంటే ఎవరో తెలియదన్నారు. ట్రాన్స్ జెండర్స్ అంటే నాకు ఎంతో గౌరవం. మా జబర్దస్త్‌లో కూడా సాయి అనే వ్యక్తి లేడీగా మారారు. తన కష్టమేదో తాను పడుతున్నాడు. తమన్నా లాంటి వారు సర్జరీలు చేసుకుని ఆడవారిగా మారిపోయినా గుర్తింపు లేదే అని వల్గారిటీగా హైప్ అవ్వడం కోసం ఇలాంటి పిచ్చివాగుడు వాగుతుంటారు.. అని శాంతి స్వరూప్ తెలిపారు.

నేను తిరిగి చెప్పుతో కొట్టగలను

నేను తిరిగి చెప్పుతో కొట్టగలను

మమ్మల్ని ఎందుకు చెప్పుతో కొట్టాలి? ఆమె అలా ఎందుకన్నారో తెలియదు, ఎవరైతే ఈ మాట అన్నారో వారికి చెప్పేది ఒకటే. మేము లేడీసా? జంట్సా? అనేది గురువారం, శుక్రవారం చూసే కోట్ల మందికి తెలుసు. మేము బేసిగ్గా జంట్సే అయినా లేడీ గెటప్స్ వేస్తున్నాం. మీలా సర్జరీలు చేసుకుని హైప్ అవ్వడం కోసం ప్రయత్నించడం లేదు. మమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేస్తే ఊరుకోం. లేడీ గెటప్ వేసే వారిని కించపరిచే విధంగా మాట్లాడితే మీరు కొడతానన్న చెప్పుతోనే తిరిగి కొడతాను... అని శాంతి స్వరూప్ హెచ్చరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X