అందుకే సర్జరీ.. నగ్నంగా వీడియో కాల్స్.. లేడీ గెటప్ కంటెస్టెంట్స్ పై జబర్దస్త్ శాంతి స్వరూప్ సంచలనం!
జబర్దస్త్ లో ఒకప్పుడు మహిళలు నటించేవారు కాదు మగవాళ్లే మహిళల గెటప్ వేసుకొని ఆడవారిగా కనిపించేవారు.. అయితే అలా లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయిన వారిలో శాంతిస్వరూప్ కూడా ఒకరు. మిగతా వాళ్ళు తర్వాత వేరే దారులు చూసుకున్నా శాంతి స్వరూప్ మాత్రం చాలా కాలం నుంచి జబర్దస్త్ లోనే లేడీ గెటప్స్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసిన ఒక వీడియో సంచలనం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇలాంటి వాళ్లే అని
తన యూట్యూబ్ ఛానల్ ద్వారా జబర్దస్త్ శాంతి స్వరూప్ ఒక సుదీర్ఘమైన వీడియో విడుదల చేశాడు. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసి పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి సర్జరీ చేయించుకుని ట్రాన్స్ జెండర్ గా మారినట్లు వెల్లడించాడు. అలా ట్రాన్స్ జెండర్ గా మారడం, మారకపోవడం అనేది వారి వ్యక్తిగత విషయం అని చెబుతూనే జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వాళ్ళు అందరూ కూడా ఇలాంటి వాళ్లే అని అతను అంటున్నాడు అంటూ శాంతి స్వరూప్ వెల్లడించాడు.

నగ్నంగా వీడియో కాల్స్
జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని సర్జరీ చేయించు కోవడమే కాక సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి కొంత మందిని ట్రాప్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని శాంతి స్వరూప్ చెప్పుకొచ్చాడు. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ వారి స్క్రీన్ షాట్ తీసి బెదిరించిన దాఖలాలు కూడా తనకు తెలుసని ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని శాంతి స్వరూప్ హెచ్చరించాడు.

అందుకే కొట్టా
అతను అలా చేయడంతో జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసి అందరినీ చిన్నచూపు చూస్తున్నారని బాధపడ్డాడు.తిరుపతిలో ఒక ఈవెంట్ కోసం వెళ్లిన సదరు ట్రాన్స్ జెండర్ అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ కుమారుడితో అసభ్యంగా ప్రవర్తించడంతో దెబ్బలు కూడా తిన్నాడు అని తాను కూడా ఒకసారి కొట్టానని జబర్దస్త్ శాంతి స్వరూప్ చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ చేసి ఆ వచ్చిన క్రేజ్ తో వేరే చోటకు వెళ్ళిన అతను జబర్దస్త్ లో టీం లీడర్లు తనను వేధిస్తున్నారని బయట చెబుతున్నాడని అందుకే అతనిని కొట్టడం జరిగింది అని శాంతి స్వరూప్ చెప్పుకొచ్చారు.

డబ్బు సంపాదనే ధ్యేయంగా
ఇలా జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో నిజంగా ఫీలింగ్స్ లేకపోయినా సర్జరీ చేయించుకుని డబ్బు సంపాదనే ధ్యేయంగా అడ్డమైన పనులు చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు అంటూ ఆమె మీద ఆరోపణలు గుప్పించారు. అయితే జబర్దస్త్ నుంచి సర్జరీ చేయించుకున్న వ్యక్తి అనగానే బిగ్ బాస్ ప్రియాంక గుర్తొస్తుంది. అయితే ప్రియాంక కాదని ఆమె పేరు ప్రస్తావించకుండా బిగ్ బాస్ లోకి వెళ్లి మంచి పేరు సంపాదించిన వ్యక్తి కాదని అన్నారు.

ఆమె కాదు
ఆమె చాలా మంచి వ్యక్తి ఆమెకు ఈ వ్యవహారానికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పుకొచ్చాడు శాంతి స్వరూప్. కానీ మరో వ్యక్తి ఉన్నాడని, అతను చేసిన పనులకు మా పరువు పోతోందని ఇకమీదట ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేది లేదంటూ ఆ సుదీర్ఘ వీడియోలో శాంతి స్వరూప్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే శాంతి స్వరూప్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. అయితే వీడియోలో కొన్ని సార్లు ఒక్కరే ఇలా చేస్తున్నారని మరికొన్ని సార్లు కొందరు చేస్తున్నారని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











