Jabardasth అనసూయ తరువాత రెండోసారి ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిన టాప్ యాంకర్.. అదే సమస్య?
జబర్దస్త్ ద్వారా క్రేజ్ అందుకున్న కమెడియన్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బిజీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కామెడీ షో పై ఇటీవల కాలంలో కొన్ని నెగటివ్ వార్తలు అయితే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. విభేదాలు కారణంగానే చాలామంది ఈ కామెడీ షో నుంచి వెళ్లిపోయినట్లుగా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా యాంకర్ అనసూయ వెళ్లిపోవడంపై కూడా అనేక రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు రష్మీ కంటే ముందు వరకు కొంతమంది టాప్ యాంకర్స్ ను కూడా సంప్రదించారు. అయితే వారు చేయలేము అని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఊహించని రేటింగ్స్
అసలు జబర్దస్త్ 2013లో మొదలైనప్పుడు ఊహించని రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని ఎవరు అనుకోలేదు. ఇండియాలోనే టాప్ రేటింగ్స్ అందుకున్న కామెడీ షో గా కూడా జబర్దస్త్ గుర్తింపు అందుకుంది. అయితే మెల్లగా ఈ షో నుంచి సీనియర్ కమెడియన్స్ వెళ్లిపోయినప్పటికీ కూడా కొన్నాళ్ల వరకు కొత్త కమెడియన్స్ తో కలకలలాడుతూ కనిపించింది. గత రెండు మూడేళ్ల ముందు వరకు కూడా ఈ షోకు 20కి పైగానే రేటింగ్ కూడా వచ్చేది.

మళ్ళీ డౌన్
అయితే జబర్దస్త్ షో ఇటీవల కాలంలో మాత్రం కనీసం 10 టిఆర్పి రేటింగ్ కూడా అందుకోవడం లేదు అనే కామెంట్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో యాజమాన్యం కొంతమంది కమెడియన్స్ పారితోషికాలు కూడా చాలావరకు తగ్గించేసింది. ఆ కారణం చేత టాప్ కమెడియన్స్ అందరూ కూడా షో నుంచి వెళ్ళిపోతున్నట్లుగా కొన్ని కథనాలు అయితే వెలువడ్డాయి.

అనసూయ వెళ్లిపోవడం
ఇక అనసూయ భరద్వాజ్ కూడా జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కమెడియన్స్ మెప్పించినా కూడా ఈ కామెడీ షోకు సరికొత్త గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ఆమె చాలా ముఖ్యపాత్ర పోషించింది అని చెప్పవచ్చు. అంతేకాకుండా మధ్య మధ్యలో అనసూయ పై వేసే పంచ్ లు కూడా హైలెట్గా నిలుస్తూ ఉంటాయి. ఇక అలాంటి అనసూయ వెళ్ళిపోవడం కొంతమంది నెగిటివ్ అనే అనిపిస్తోంది.

శ్రీముఖిని సంప్రదించారా?
అయితే అనసూయ భరద్వాజ్ వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్ షో కు మళ్లీ ఎవరు వస్తారు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ కూడా వచ్చాయి. ఈ క్రమంలో నిర్వాహకులు మొదట శ్రీముఖిని సంప్రదించినట్లుగా ఒక టామ్ అయితే వచ్చిందే. నిజానికి శ్రీముఖికి 2013 లోనే జబర్దస్త్ షో స్టార్ట్ అయినప్పుడు యాంకర్ గా అవకాశం వచ్చింది కానీ అప్పుడు ఆమె ఈ షో అంతగా సక్సెస్ కాదేమో అని ఒప్పుకోలేదు.

అందుకే రిజెక్ట్?
ఇక ఇప్పుడు అనసూయ భరద్వాజ్ వెళ్లిపోయిన తర్వాత కూడా శ్రీముఖి నీ మరోసారి జబర్దస్త్ నిర్వాహకులు సంప్రదించగా ఆమె ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందుకే రష్మీని రంగంలోకి దింపారు. రష్మీ ఏక్స్ ట్రా జబర్దస్త్ లో యాంకర్ గా సాగుతున్న విషయం తెలిసిందే. ఇక శ్రీముఖి ఎందుకు ఒప్పుకోలేదు అనే విషయంలో కూడా ఒక టాక్ వైరల్ అవుతుంది. ఆమె డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం వల్లనే శ్రీముఖి చేయలేకపోయినట్లుగా తెలుస్తోంది.
Recommended Video


అందుకే వెళ్లిపోతున్నారా?
నిజానికి అనసూయ అయితే ఇతర సినిమాలకు ప్రాజెక్టుల వలన బిజీగా ఉండడం వల్లనే జబర్దస్త్ లో కొనసాగ లేకపోయింది అని మరి కొంతమంది కమెడియన్స్ తెలియజేశారు. అయితే మరి కొంతమంది మాత్రం విభేదాలు కారణంగానే బయటకు వచ్చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మళ్లీ మరో యాంకర్ కోసం గట్టిగానే ప్రయత్నంలో జరిపినప్పటికీ ఎవరు సెట్ అవ్వలేదు. ఇక చివరికి మళ్ళీ రష్మినే తీసుకువచ్చి షోను నడిపిస్తున్నారు. మరి ఆమె ఎన్నాళ్లు ఈ షోలో యాంకర్ గా కొనసాగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











