Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అనసూయకు ప్రమోషన్: జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా మారిన యాంకర్.. రోజా సహకారంతోనే ఇలా.!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర షోల హవా కనిపిస్తోంది. అందులోనూ ఓ ప్రముఖ చానెల్లో ప్రసారం అయ్యే 'జబర్ధస్త్' షో భారీ క్రేజ్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ షోకు యాంకరింగ్ చేస్తున్న వారిలో అనసూయ ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. టీవీ షోలైనా, సినిమాలు అయినా ఈమె రంగంలోకి దిగిందంటే ఆ ప్రత్యేకతే వేరు. అందుకే రంగమ్మత్తకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పటికే ఎన్నో షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ క్రేజీ యాంకర్.. ప్రమోషన్ సంపాదించింది. అది కూడా యాంకర్ నుంచి జడ్జ్ స్థాయికి. వివరాల్లోకి వెళ్తే..
జబర్ధస్త్ అనసూయగానే బాగా ఫేమస్
అనసూయ కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే, ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్లోనూ పని చేసింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. ఎప్పుడైతే ‘జబర్ధస్త్' షోలో అడుగు పెట్టిందో.. అప్పటి నుంచి అనసూయ బాగా పాపులర్ అయిపోయింది. తర్వాత మంచి మంచి పాత్రల్లో నటించినప్పటికీ జబర్ధస్త్ అనసూయగానే బాగా ఫేమస్ అవుతోంది.
స్టార్ హీరో సినిమాలో అదిరిపోయే రోల్
టీవీ షోలు.. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అనసూయకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం'లో నటించే అవకాశం దక్కింది. గత ఏడాది వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ఇందులో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత అనసూయకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి.
మరో ప్రతిష్టాత్మక చిత్రానికి సంతకం
వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ సెలెక్టివ్‌గా ఒప్పుకుంటోంది అనసూయ. తన పాత్ర పరిధి, ప్రాధాన్యాన్ని చూసుకున్న తర్వాతనే ఆ ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ఇందులో భాగంగానే ఆమె క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ' అనే సినిమాకు సంతకం చేసేసింది. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లీగంజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వాళ్లు కూడా అనసూయ వెనకాలే
ఒకవైపు సినిమాలు చేయమని ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు అనసూయ ఇంటికి క్యూ కడుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. బుల్లితెరకు చెందిన వారు కూడా ఆమె డేట్స్ కోసం వేచి చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె జబర్ధస్త్ కాకుండా మరికొన్ని ఛానెళ్లలో ప్రసారం అవుతున్న షోలలో కూడా పాల్గొంటోంది. దీంతో రెండు చేతులా సంపాదిస్తోంది.
భారీగా పెరిగిన రెమ్యూనరేషన్
కొద్ది రోజుల క్రితం జబర్ధస్త్ కామెడీ షోలో లుకలుకలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి నుంచీ ఆ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నాగబాబు అర్థాంతరంగా తప్పుకున్నారు. ఆయనతో పాటే టీమ్ లీడర్లు, యాంకర్ అనసూయ కూడా వేరే చానెల్‌కు వెళ్లిపోయారు. ఆ సమయంలో అనసూయకు ‘జబర్ధస్త్' యూనిట్ రెమ్యూనరేషన్ భారీగా పెంచి వెనక్కి పిలిచిందని తెలిసింది.
అనసూయకు ప్రమోషన్.. గెస్ట్‌గా సీనియర్ యాక్టర్
ఇక, ఇప్పటి వరకు ‘జబర్ధస్త్' కామెడీ షోలో యాంకర్‌గానే కనిపించిన అనసూయ.. తాజాగా ప్రమోషన్ పొందింది. వచ్చే వారం ఎపిసోడ్లో ఆమె రోజా పక్కన కూర్చుని జడ్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. రోజా అడగడం వల్లే నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అలాగే, ఈ ఎపిసోడ్‌కు పోసాని కృష్ణ మురళీ గెస్ట్‌గా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.