For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనసూయకు ప్రమోషన్: జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా మారిన యాంకర్.. రోజా సహకారంతోనే ఇలా.!

By Lekhaka
|

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర షోల హవా కనిపిస్తోంది. అందులోనూ ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయ్యే 'జబర్ధస్త్' షో భారీ క్రేజ్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ షోకు యాంకరింగ్ చేస్తున్న వారిలో అనసూయ ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. టీవీ షోలైనా, సినిమాలు అయినా ఈమె రంగంలోకి దిగిందంటే ఆ ప్రత్యేకతే వేరు. అందుకే రంగమ్మత్తకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పటికే ఎన్నో షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ క్రేజీ యాంకర్.. ప్రమోషన్ సంపాదించింది. అది కూడా యాంకర్ నుంచి జడ్జ్ స్థాయికి. వివరాల్లోకి వెళ్తే..

జబర్ధస్త్ అనసూయగానే బాగా ఫేమస్

జబర్ధస్త్ అనసూయగానే బాగా ఫేమస్

అనసూయ కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే, ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లోనూ పని చేసింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. ఎప్పుడైతే ‘జబర్ధస్త్' షోలో అడుగు పెట్టిందో.. అప్పటి నుంచి అనసూయ బాగా పాపులర్ అయిపోయింది. తర్వాత మంచి మంచి పాత్రల్లో నటించినప్పటికీ జబర్ధస్త్ అనసూయగానే బాగా ఫేమస్ అవుతోంది.

స్టార్ హీరో సినిమాలో అదిరిపోయే రోల్

స్టార్ హీరో సినిమాలో అదిరిపోయే రోల్

టీవీ షోలు.. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అనసూయకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం'లో నటించే అవకాశం దక్కింది. గత ఏడాది వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ఇందులో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత అనసూయకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి.

మరో ప్రతిష్టాత్మక చిత్రానికి సంతకం

మరో ప్రతిష్టాత్మక చిత్రానికి సంతకం

వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ సెలెక్టివ్‌గా ఒప్పుకుంటోంది అనసూయ. తన పాత్ర పరిధి, ప్రాధాన్యాన్ని చూసుకున్న తర్వాతనే ఆ ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ఇందులో భాగంగానే ఆమె క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ' అనే సినిమాకు సంతకం చేసేసింది. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లీగంజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వాళ్లు కూడా అనసూయ వెనకాలే

వాళ్లు కూడా అనసూయ వెనకాలే

ఒకవైపు సినిమాలు చేయమని ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు అనసూయ ఇంటికి క్యూ కడుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. బుల్లితెరకు చెందిన వారు కూడా ఆమె డేట్స్ కోసం వేచి చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె జబర్ధస్త్ కాకుండా మరికొన్ని ఛానెళ్లలో ప్రసారం అవుతున్న షోలలో కూడా పాల్గొంటోంది. దీంతో రెండు చేతులా సంపాదిస్తోంది.

భారీగా పెరిగిన రెమ్యూనరేషన్

కొద్ది రోజుల క్రితం జబర్ధస్త్ కామెడీ షోలో లుకలుకలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి నుంచీ ఆ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నాగబాబు అర్థాంతరంగా తప్పుకున్నారు. ఆయనతో పాటే టీమ్ లీడర్లు, యాంకర్ అనసూయ కూడా వేరే చానెల్‌కు వెళ్లిపోయారు. ఆ సమయంలో అనసూయకు ‘జబర్ధస్త్' యూనిట్ రెమ్యూనరేషన్ భారీగా పెంచి వెనక్కి పిలిచిందని తెలిసింది.

అనసూయకు ప్రమోషన్.. గెస్ట్‌గా సీనియర్ యాక్టర్

అనసూయకు ప్రమోషన్.. గెస్ట్‌గా సీనియర్ యాక్టర్

ఇక, ఇప్పటి వరకు ‘జబర్ధస్త్' కామెడీ షోలో యాంకర్‌గానే కనిపించిన అనసూయ.. తాజాగా ప్రమోషన్ పొందింది. వచ్చే వారం ఎపిసోడ్‌లో ఆమె రోజా పక్కన కూర్చుని జడ్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. రోజా అడగడం వల్లే నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అలాగే, ఈ ఎపిసోడ్‌కు పోసాని కృష్ణ మురళీ గెస్ట్‌గా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

English summary
Jabardasth with tagline Katharnak Comedy Show is Telugu-language television channel comedy television series, broadcasts on the ETV Network channel which is shot at Annapoorna Studios, Telangana, India. The show is produced by Mallemala Entertainments and Directed by Nitin and Bharath.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more