నాగబాబు వల్ల రోజాతో పాటు వీళ్లందరికీ మేలు.. టీమ్ లీడర్లు కూడా ఊహించి ఉండరు.!

By Manoj

తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది 'జబర్ధస్'. 2013 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ షో.. ఇప్పటికీ అదే రీతిలో కొనసాగుతోంది. క్రమక్రమంగా రేటింగ్ పెంచుకుంటూ దూసుకుపోతోంది. మొదట్లో వారంలో ఒక రోజు మాత్రమే ఈ కామెడీ షో ప్రసారం అయ్యేది. ఆ తర్వాత దీని పాపులారిటీ అంతకంతకూ పెరిగిపోవడంతో రెండు రోజులకు పెంచారు. దీంతో ఈ షోను ఇష్టపడేవారి సంఖ్య కూడా పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జబర్ధస్త్‌లో కొన్ని లుకలుకలు బయటకు వచ్చాయి. ఇప్పుడవే కొందరికి మేలు చేశాయట. వివరాల్లోకి వెళితే..

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఎంతో మంది

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఎంతో మంది

ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయ్యే జబర్ధస్త్ షో వల్ల బుల్లితెరతో పాటు వెండితెరకు ఎంతో మంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. అదే సమయంలో రైటర్లు, టెక్నీషియన్లు కూడా వచ్చారు. వీరిలో చాలా మంది తమ హవాను చూపిస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఆర్టిస్టులు సినీ తారలతో సమానంగా సంపాదించుకుంటున్నారు.

నాగబాబు, రోజాకు కూడా ప్లస్ అయింది

నాగబాబు, రోజాకు కూడా ప్లస్ అయింది

జబర్ధస్త్‌కు మొదటి నుంచీ జడ్జ్‌లుగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ నటి రోజాకు కూడా ఈ షో ప్లస్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా రోజా.. రాజకీయాల్లో రాణిస్తూ, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారంటే దాని వెనుక జబర్ధస్త్ పాత్రను కొట్టి పారేయలేం. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

 జబర్ధస్త్ షోలో లుకలుకలు

జబర్ధస్త్ షోలో లుకలుకలు

ఇటీవల జబర్ధస్త్ షోలో లుకలుకలు చోటు చేసుకున్నాయి. ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నాగబాబు.. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. ఆయనతో పాటే పలువురు టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు కూడా షోను విడిచి వెళ్లిపోయారు. దీంతో జబర్ధస్త్ షో ఉంటుందా..? ఉండదా..? ఉంటే అదే స్థాయిలో ఎంటర్‌టైన్ చేస్తుందా..? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలిగాయి.

నాగబాబు వల్ల వాళ్లకు మేలు

నాగబాబు వల్ల వాళ్లకు మేలు

జబర్ధస్త్ నుంచి నాగబాబు బయటకు వెళ్లిపోవడంతో కొందరికి మేలు జరిగిందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. మరో జడ్జ్ అయిన రోజా రెమ్యూనరేషన్ భారీగా పెరిగిపోయిందట. మొన్నటి వరకు ఆమె నెలకు రూ. 20 లక్షలు అందుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడది రూ. 30 లక్షలు అయిందని సమాచారం.

వాళ్లు కూడా ఊహించి ఉండరు

వాళ్లు కూడా ఊహించి ఉండరు

అదే సమయంలో జబర్ధస్త్ నుంచి నాగబాబుతో వెళ్లకుండా షోలోనే ఉన్న టీమ్ లీడర్ల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్‌కు తలో లక్షన్నర పెంచేశారని తెలుస్తోంది. అలాగే, గెటప్ శ్రీనుకు లక్ష.. బుల్లెట్ భాస్కర్, వెంకీ, రాకేష్ సహా పలువురికి రూ. 50 వేల వరకు పెరిగిందని టాక్.

Recommended Video

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
మరి ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి.?

మరి ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి.?

ఈ కామెడీ షో వారానికి రెండు రోజులు ప్రసారం అవుతుంది. అందులో గురువారం ఎపిసోడ్‌కు అనసూయ, శుక్రవారం రష్మీ గౌతమ్ యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి కూడా రెమ్యూనరేషన్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఇందులో ఎవరికి ఎంత పెరిగిందన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X