‘జబర్ధస్త్’ రెమ్యూనరేషన్స్ లీక్.. టాప్ ప్లేస్ ఆమెదే.. నాగబాబుకు ఎంతొస్తుందంటే.!

By Manoj

ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్ధస్' అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారానే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను పరిశ్రమకు అందిస్తోందీ షో. అందుకే 'జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రత్యేకంగా చాలా మంది గురు, శుక్రవారాల్లో ఈ షో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలా 'జబర్ధస్త్' ప్రభావం చూపిస్తోంది. ఇందులో కనిపించే ఆర్టిస్టులతో పాటు జడ్జ్‌లు రోజా, నాగబాబుకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు, యాంకర్లు రష్మీ, అనసూయను ఫాలో అయ్యే వారి సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ షోకు ఇచ్చే రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి.

 రెమ్యూనరేషన్‌లో ఆమెదే టాప్ ప్లేస్

రెమ్యూనరేషన్‌లో ఆమెదే టాప్ ప్లేస్

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిపోర్టుల ప్రకారం.. జబర్ధస్త్ మొత్తంలో జడ్జ్‌గా వ్యవహరిస్తున్న రోజా అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఈమె నెలకు రూ. 20 లక్షలు అందుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ షో చేస్తుండడం వల్లే రోజాకు ఎక్కువ పారితోషికం చెల్లిస్తున్నారట జబర్ధస్త్ నిర్వహకులు.

నాగబాబు ఎంత తీసుకుంటున్నారంటే..

నాగబాబు ఎంత తీసుకుంటున్నారంటే..

ఇక, ఇదే షోలో ఎప్పటి నుంచో రెండో జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నాగబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఆయన నవ్వుకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఆయనకు నెలకు రూ. 15 లక్షలు మేర అందుతుందని తెలుస్తోంది. అంటే మెగా బ్రదర్‌కు రోజా కంటే ఐదు లక్షల రూపాయలు తక్కువ రెమ్యూనరేషన్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

యాంకర్లలో ఆమెకె ఎక్కువ

యాంకర్లలో ఆమెకె ఎక్కువ


జబర్ధస్త్ వారానికి రెండు రోజులు ప్రసారం అవుతుంది. అందులో గురువారం ఎపిసోడ్‌కు అనసూయ, శుక్రవారం వచ్చే ‘ఎక్స్‌ట్రా జబర్ధస్త్'కు రష్మీ గౌతమ్ యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్ల గ్లామర్‌ కూడా ఈ షోకు భారీగా ప్లస్ అవుతుందన్న టాక్ ఉంది. అందుకే వీళ్ల డిమాండ్‌ను బట్టి రెమ్యూనరేషన్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రిపోర్టుల బట్టి.. అనసూయ నెలకు రూ. 4 లక్షలు, రష్మీ రూ. 3.5 లక్షలు చార్జ్ చేస్తారని టాక్.

వాళ్లకు మాత్రం దాని ఆధారంగానే

వాళ్లకు మాత్రం దాని ఆధారంగానే

ఎన్నో సంవత్సరాల నుంచి కొత్త కొత్త స్కిట్లతో నవ్విస్తున్నారు జబర్ధస్త్ టీమ్ లీడర్స్. ఇప్పటి వరకు ఈ షోకు ఎంతో మంది టీమ్ లీడర్లు పని చేశారు. అలాంటి వారిలో కొందరు మాత్రమే షో కోసం పని చేస్తూ ఉన్నారు. అందుకే వీరికి చాలా డిమాండ్ ఉంది. ఈ కారణంగానే రెండు రోజులు ప్రసారం అయ్యే ఈ షోలో టాలెంట్‌ను బట్టి రెమ్యూనరేషన్ డివైడ్ చేశారని సమాచారం. వీరిలో చాలా మంది రైటర్లు కూడా ఉన్నారు. వారికి కొంత ఎక్కువ మొత్తమే ఇస్తారట.

Recommended Video

#CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !
టీమ్ లీడర్లలో ఎవరికి ఎక్కువంటే..

టీమ్ లీడర్లలో ఎవరికి ఎక్కువంటే..

టీమ్ లీడర్ల విషయానికొస్తే.. అందరి కంటే ఎక్కువగా చమ్మక్ చంద్ర నెలకు రూ. 4 లక్షలు రెమ్యూనరేషన్ రూపంలో అందుకుంటాడని ప్రచారం జరుగుతోంది. అతడి తర్వాత సుడిగాలి సుధీర్ రూ. 3.5 లక్షలు తీసుకుంటున్నాడట. ఇక, అదిరే అభి, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తలో మూడు లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నారని తెలిసింది. గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు రూ. 2.5 లక్షలు తీసుకుంటున్నారని టాక్. మిగిలిన వారిలో బుల్లెట్ భాస్కర్, వెంకీ, రాకేష్ తలో రెండు లక్షలు రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X