Jabardasth షో మరో షాకింగ్ డిసిషన్.. ఇలానే కొనసాగితే సర్దుకోవాల్సిందే?
జబర్దస్త్ కామెడీ షో అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. చాలా తొందరగా అతి వేగంగా జనాలకు కనెక్ట్ అయిన ఈ కామెడీ షో మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎంతో మంది కమెడియన్స్ కు మంచి లైఫ్ ఇచ్చింది అని కూడా చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు కాంట్రవర్షియల్ గొడవల్లో కూడా జబర్దస్త్ షో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక జబర్దస్త్ షో ఇటీవల కాలంలో మళ్లీ తన క్రేజ్ ను కోల్పోతుంది అని అనిపిస్తోంది. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇలానే జరిగితే త్వరలోనే మూత పడే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ వస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అలా క్రేజ్ అందుకున్న షో
అరుంధతి సినిమా తర్వాత మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు పూర్తిగా టెలివిజన్ రంగంలో రియాలిటీ షోలతో మంచి గుర్తింపును అందుకున్నారు. ఈ సంస్థ నుంచి క్యాష్ తో పాటు జబర్దస్త్ షో ఎంటర్టైన్మెంట్ షోలు గా గుర్తింపును అందుకున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ అయితే కొన్నిసార్లు నెంబర్ వన్ రేటింగ్స్ ను కూడా సొంతం చేసుకుంది. చాలా మంది సీనియర్ కమెడియన్స్ జబర్దస్త్ షోపై కూడా ప్రశంసలు కురిపించారు.

నాగబాబు తప్పుకోవడంతో..
జబర్దస్త్ షో లో పనిచేసిన కామెంట్స్ మాత్రమే కాకుండా రైటర్స్ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ కామెడీ రియాల్టీ షో పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాకుండా నాగబాబు కూడా బయటకు వెళ్ళిపోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మేనేజ్మెంట్ ఏ మాత్రం సరిగ్గా లేదు అని అందులో పనిచేసే వారికి అన్యాయం జరుగుతోంది అని కూడా కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి.

అలాంటి ఆరోపణలు
నాగబాబు జబర్దస్త్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజా అక్కడ కొనసాగుతున్నప్పటికీ కొంతమంది కమెడియన్స్ మాత్రం మేనేజ్మెంట్ సరిగ్గా వ్యవహరించడం లేదు అని ఆరోపణలు చేసి బయటకు వచ్చేశారు. వివాదాలు ఎన్ని వస్తున్నా కూడా జబర్దస్త్ షో కు క్రేజ్ తగ్గలేదు. ఒకప్పుడు టీం లీడర్ కింద పనిచేసిన చిన్నతరహా కమెడియన్స్ కూడా సోలోగా స్కిట్స్ తయారు చేసుకుంటూ టీం లీడర్స్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు.

తక్కిన హవా
అయితే ఇటీవల కాలంలో మాత్రం జబర్దస్త్ షో కు గతంలో మాదిరిగా అనుకున్నంత క్రేజ్ అయితే దక్కడం లేదని కామెంట్స్ వస్తున్నాయి. జబర్దస్త్ షో తో పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కూడా రేటింగ్స్ ను చాలా తక్కువగా అందుకుంటున్నాయి అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు హైపర్ ఆది సుడిగాలి సుధీర్ టీమ్ నుంచి ఎలాంటి స్కిట్ వచ్చినా కూడా భారీ స్థాయిలో రేటింగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా అందుకు భిన్నంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Recommended Video


మరొక ఉదాహరణ
జబర్దస్త్ షో రేటింగ్ తగ్గింది అనడానికి మరొక ఉదాహరణ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకుముందు టెలివిజన్ లో ఈ షో ఎపిసోడ్ గంటన్నరకు పైగా ప్రసారమయ్యేది. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని చాలా వరకు తగ్గించేశారు. కేవలం 40 నిమిషాల వరకు మాత్రమే కొనసాగిస్తున్నట్లు గా తెలుస్తోంది. ప్రస్తుతం కమెడియన్స్ కూడా పారితోషికాలు చాలావరకు తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా జబర్దస్త్ షో తన పట్టును కోల్పోతోందని ఇలానే జరిగితే షో త్వరలోనే మూతపడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











