Jabardasth: బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ షాక్... జబర్దస్త్ కామెడీ షోకి ఎండ్ కార్డ్... కారణం ఏంటంటే?
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షోల్లో జబర్దస్త్ మొదటి స్థానంలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ జబర్దస్త్ 2013లో ప్రారంభం అయింది. పది సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అయితే ఈ షోకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఈ షోకి ఎండ్ కార్డు పడనుంది.. ఏమైంది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలుగు ప్రేక్షకులను పది సంవత్సరాలకు పైగా వారి మొహాల్లో నవ్వులు పూయిస్తున్న షో జబర్దస్త్. ఈ జబర్దస్త్ షో మొదట ఫిబ్రవరి 7, 2013 న ప్రారంభించారు. ఈ షో ఎంతో మందికి లైఫ్ ను ఇచ్చింది. ఎంతో మంది కమెడియన్స్ ఈ షో ద్వారా పరిచయం అయ్యి పాపులర్ అయ్యారు. చాలా మంది ఈ షో ద్వారా హీరోలుగా, కమెడియన్స్ గా, డైరెక్టర్లుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ఈ షోను రెండు విభాగాలుగా మార్చాక రష్మి కూడా యాంకరింగ్ చేస్తూ వస్తుంది.

అయితే జబర్దస్త్ షోకు మొదట యాంకరింగ్ అనసూయ, జడ్జ్ లుగా నాగా బాబు, రోజా ఉండే వారు. ఇక ఈ షో నుంచి రోజా, నాగాబాబు తప్పుకోవడంతో.. జనాలకు కాస్త ఆసక్తి తగ్గింది. దానికి తోడు షోలో అశ్లీల కామెడీ ఎక్కువైందని ట్రోలింగ్, కామెంట్స్ కూడా వచ్చాయి. మరోవైపు షోకు యాంకర్స్ మారుతూ వచ్చారు. యాంకర్ అనసూయ కూడా ఈ షోకు గుడ్ బై చెప్పేసింది. అలా కాస్త ప్రేక్షకులు ఈ షోకు దూరం అయ్యారు.
ఇక ఆమె ప్లేస్ లోకి సౌమ్య రావు రాగా.. ఆమె కూడా ఈ షో నుంచి తప్పుకుంది. ఇక ఆమె ప్లేస్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ వచ్చింది. ఇక ప్రస్తుతానికి ఈ షోలకు యాంకర్లుగా రష్మి, సిరి హనుమంత్ ఉండగా.. జడ్జ్ లుగా మొన్నటి వరకు కుష్బూ, భగవాన్ ఉన్నారు. ఇక కుష్బూ ఇటీవల తప్పుకోవడంతో.. ఆమె ప్లేస్ లోకి మహేశ్వరి వచ్చింది.
ఇలాంటి షో.. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, శాంతి స్వరూప్, ధన్ రాజ్, వేణు వంటి ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఇక షోకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారుతుంది. దానికి కారణం టీఆర్పి రేటింగ్స్ తగ్గడమే అని తెలుస్తోంది. జబర్దస్త్ స్టార్ట్ అయిన ఇన్ని ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి టీఆర్పీ రేటింగ్స్ రాలేదని తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో కామెడీని కమెడియన్స్ పండించకపోవడం, దానికి తోడు జడ్జ్ లు, హోస్టులు మారడం వల్లే ఇలా అయినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే జబర్దస్త్ షోను ఇక ఆపేద్దామని మల్లెమాల నిర్ణయించుకుందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ గా స్పందించకపోయినప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం వర్క్స్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో జబర్దస్త్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.


Click it and Unblock the Notifications











