జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ స్క్రాప్? శివాజీ షాకింగ్ కామెంట్.. ఆయనకు 100 ఫోన్ కాల్స్
టెలివిజన్ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తోంది జబర్దస్త్ కామెడీ షో. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు స్టార్లుగా ఎదిగారు. బుల్లితెరపైనే కాకుండా తమ టాలెంట్ తో వెండితెరపైన కూడా విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. మరికొందరు హీరోలుగానూ అవకాశాలు అందుకుంటూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అయితే జబర్దస్త్ అనగానే ముందుగా అందరికీ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ గుర్తుకు వస్తారు. అయితే సుధీర్, శ్రీను ఇద్దరూ సినిమాల్లో బిజీ అయ్యారు. కానీ రాం ప్రసాద్ జబర్దస్త్ లోనే ఉండిపోయారు. కాగా తాజాగా విడుదలైన ప్రోమోలో రాం ప్రసాద్ ను జడ్జీ శివాజీ స్క్రాప్ అనడం చర్చనీయాంశంగా మారింది.
దశాబ్దానికి పైగా బుల్లితెర సింహాసనంపైనే..
ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో కామెడీని అందిస్తున్న ఏకైక షో 'జబర్దస్త్ కామెడీ షో'. ఈ షో 2013లో ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతూనే వస్తోంది. మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ రూపొందించిన ఈ కామెడీ స్కిట్లు ప్రతి శుక్ర, శనివారాలు ఈటీవీ ఛానెల్ లో ప్రసారం కానున్నాయి. 12 ఏళ్లు ఈ షోకు ఎంతో మంది ఆర్టిస్టులు వచ్చి పోతున్నారు. జడ్జీలు కూడా మారుతూ ఉన్నారు. యాంకర్లు కూడా ఛేంజ్ అవుతూనే వస్తున్నారు. అయినా టీవీ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించడంలో ఫెయిల్ కాలేదు. కామెడీ విషయంలో బుల్లితెర సింహాసనంపై కూర్చుందనే చెప్పాలి.

ఇంకా జబర్దస్త్ లోనే రాం ప్రసాద్..
వేణు వండర్స్ టీమ్ ద్వారా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ జబర్దస్త్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి తమ టాలెంట్ ను ప్రదర్శిస్తూ ఒక్కొక్కరూ ఒక్కో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. సుడిగాలి సుధీర్ తన స్టైల్, మేనరిజం, చలాకీతనంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం వెండితెరపై హీరోగా అలరిస్తూనే.. బుల్లితెరలోని టాప్ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక గెటప్ శ్రీను కరోనా తర్వాత జబర్దస్త్ ను వీడిన తర్వాత నుంచి పూర్తిగా సినిమాల్లోనే నటిస్తూ బిజీ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్, హను మాన్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ రామ్ ప్రసాద్ మాత్రం ఇంకా జబర్దస్త్ లోనే కొనసాగుతున్నారని, వెండితెరపై తన ప్రత్యేకతను చాటుకోవడం లేదని ఆయన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
శివాజీ దారుణమైన కామెంట్..
జబర్దస్ కామెడీ షోకు ప్రస్తుతం నటుడు, హీరో, బిగ్ బాస్ శివాజీ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఫీమేల్ జడ్జీగా ఇంద్ర ఉన్నారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో శివాజీ రామ్ ప్రసాద్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రామ్ ప్రసాద్ చేసిన స్కిట్ గురించి మాట్లాడుతూ.. 'రామ్ ప్రసాద్ స్క్రాపా?' అని ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. దానికి రామ్ ప్రసాద్ కూడా షాక్ అయ్యాడు. ఇంకా పూర్తిగా ఏం జరిగిందనేది ఫుల్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది.
రియాజ్ కు100 ఫోన్ కాల్స్.. స్టూడెంట్స్ తో సద్దాం ఫన్..
జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ పై ఆసక్తికరంగా మారింది. సద్దామ్ హుస్సేన్, బుల్లెట్ భాస్కర్, చలాకీ చంటీ, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, ప్రవీణ్ టీమ్ లీడర్లు ప్రదర్శించిన స్కిట్లపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ టీమ్ లోని రియాజ్ కు కొందరి నుంచి 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. మరోవైపు స్టూడెంట్స్ తో సద్దాం చేసిన స్కిట్ కడుపబ్బా నవ్వించేలా ఉంటోంది.


Click it and Unblock the Notifications











